newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

నితిన్ 'పవర్ పేట' రఫ్ఫాడిస్తాడు..

23-12-201923-12-2019 08:50:30 IST
Updated On 23-12-2019 11:14:03 ISTUpdated On 23-12-20192019-12-23T03:20:30.854Z23-12-2019 2019-12-23T03:20:06.016Z - 2019-12-23T05:44:03.967Z - 23-12-2019

నితిన్ 'పవర్ పేట' రఫ్ఫాడిస్తాడు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
యంగ్ హీరో నితిన్ వరుస ప్లాప్స్ రావడంతో చాలా కాలం లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఈ లాంగ్ గ్యాప్ లో వరుసగా కథలు విన్న నితిన్ నాలుగు సినిమాలకు ఓకే చెప్పాడు. నితిన్ తాజాగా నటిస్తున్న చిత్రం 'బీష్మ'. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది.

సింగిల్ ఫర్ ఎవర్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ మంచి రెస్పాన్స్ పట్టేసింది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలను నితిన్ పట్టాలెక్కించాడు. చంద్రశేఖర్ యేలేటితో చదరంగం, అలాగే, వెంకీ అట్లూరితో కలిసి రంగ్ దే సినిమాలని చేస్తున్న సంగతి తెలిసిందే.

పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాల రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు హీరో నితిన్. రీసంట్ గా తన పెళ్లిపై వచ్చిన వార్తలని ఖండించాడు మనహీరో. ఇప్పడప్పుడే పెళ్లి చేసుకునేది లేదని, ఒకవేళ చేసుకుంటే మీడియాతో చెప్పే చేసుకుంటానని అంటున్నాడు. అంతేకాదు తన ద్రుష్టి మొత్తం సినిమాలపైనే ఉందని నితిన్ స్పష్టం చేశాడు. 

రీసంట్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టర్ బ్యానర్ లో పవర్ పేట సినిమాకి సైన్ కూడా చేసాడు. కృష్ణ చైతన్య డైరెక్టర్ గా చేస్తున్న  ఈమూవీ మ్యాగ్జిమమ్ ఆంధ్రాలో షూటింగ్ జరుపుకోబోతోంది. ఏలూరులో ఉన్న పవర్ పేట స్టేషన్ , పవర్ పేట వీధిలో కూడా షూటింగ్ చేస్తారని అంటున్నారు. న్యాచురల్ లొకేషన్స్ లో సినిమా ఉండబోతున్నట్లుగా సమాచారం.

ఈ సినిమా 2020 సమ్మర్ లో షూటింగ్ ప్రారంభం కానుంది. ఆసక్తికరమైన స్టోరీ, స్క్రీన్ ప్లేతో చాలా పవర్ ఫుల్ గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఈసినిమాలో హీరోయిన్ గా నివేధా థామస్ నటించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. చిత్ర యూనిట్ నుండి ఎటువంటి ప్రకటన రాలేదు. ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ 'వడ చెన్నై' కి రీమేక్ అంటూ వార్తలు వస్తున్నాయి. వెట్రి మారన్ దర్శకత్వంలో ధనుష్ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడమే గాక బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసింది.

ఈ సినిమా రీమేక్ గా వస్తున్న చిత్రమే 'పవర్ పేట' అంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. మొత్తం మీద నితిన్ వరుస సినిమాలతో సూపర్ హిట్ కొట్టడం ఖాయంగా కనబడుతోంది. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle