newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

నితిన్ ఆశలు నెరవేరేనా?

12-06-201912-06-2019 06:36:17 IST
2019-06-12T01:06:17.807Z11-06-2019 2019-06-11T17:27:16.508Z - - 20-09-2019

నితిన్ ఆశలు నెరవేరేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ చిత్రం 'శ్రీనివాస కళ్యాణం'. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న దర్శకుడు. కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

కానీ ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమా ఇచ్చిన షాక్ తో నితిన్ దాదాపు 10 నెలల గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ లోనే చాలామంది దర్శకులు చెప్పిన కథలని విని మూడు సినిమాలను ఓకే చేశాడు. 

ఈ మూడు సినిమాల్లో వెంకీ కుడుముల దర్శకత్వంలో  'భీష్మ', కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమా, క్రియేటివ్ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మరో సినిమాని నితిన్ ఓకే చేశాడు. ఫిలిం వర్గాల సమాచారం మేరకు  కృష్ణచైతన్య దర్శకత్వంలో చేయనున్న సినిమా తమిళ సూపర్ హిట్ రీమేక్ అని తెలుస్తోంది.

తాజాగా తమిళ సూపర్ స్టార్ ధనుష్ నటించిన చిత్రం 'వడ చెన్నై'. గ్యాంగ్ వార్, మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాని నితిన్ హీరోగా 'పవర్ పేట' పేరిట రీమేక్ చేస్తున్నారు. 

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు పరిసర ప్రాంతమైన పవర్ పేట నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమాని డిసెంబర్ లో మొదలుపెట్టనున్నారు.  'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో చేస్తున్న భీష్మా సినిమా పూజ కార్యక్రమాలు నేడు జరగనున్నాయి. దాదాపు 10 నెలల తరువాత నితిన్ షూటింగ్ లో జాయిన్ కానుండటంతో ఆయన అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

మహాభారతంలోని 'భీష్మా' పాత్ర నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి ట్యాగ్ లైన్ సింగిల్ ఫర్ ఎవర్. లక్కీ గర్ల్ రష్మిక మందాన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని త్వరగతిన పూర్తి చేసి డిసెంబర్ చివరి వారంలో విడుదల చేయనున్నారు. 

 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle