newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

నాని ‘వి’ మూవీపై క్లారిటీ.. 27, 28న ఫస్ట్ లుక్స్

22-01-202022-01-2020 08:51:00 IST
Updated On 22-01-2020 08:50:58 ISTUpdated On 22-01-20202020-01-22T03:21:00.734Z22-01-2020 2020-01-22T03:19:52.455Z - 2020-01-22T03:20:58.171Z - 22-01-2020

నాని ‘వి’ మూవీపై క్లారిటీ.. 27, 28న ఫస్ట్ లుక్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నేచుర‌ల్ స్టార్ నాని సినిమాలతో బిజీగా వున్నాడు. జెర్సీ మూవీతో నానికి మంచి పేరు వచ్చింది. తాజాగా ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `వి`. నాని న‌టిస్తోన్న 25వ చిత్ర‌ం కావడంతో అంచనాలు భారీగానే వున్నాయి. నానితో పాటు సుధీర్‌బాబు, ఆదితిరావు హైదరి, నివేదా థామ‌స్ న‌టిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఉగాది సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 

Image may contain: text

సంక్రాంతికి విడుదలైన సినిమాలు హిట్ కావడంతో నాని కూడా తన మూవీ హిట్ కావడం ఖాయం అంటున్నాడు. ఈ సినిమాలో నాని, సుధీర్‌బాబు ఫ‌స్ట్ లుక్స్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేయ‌డానికి రెడీ అయ్యింది. దీనికి సంబంధించి సుధీర్ బాబు ఒక డైలాగ్ చెబుతూ 27 న తన ఫస్ట్ లుక్ విడుదలవుతుందని పేర్కొన్నాడు.

‘‘కృష్డుడి గీతలో ఎపుడో చెప్పాడు రాక్షసుడు ఎదిగిన నాడు ఒకడొస్తాడని  వాడే ఇప్పుడొస్తున్నాడు రక్షకుడు వస్తున్నాడు’’ అంటూ సుధీర్ బాబు ట్వీట్ చేశాడు.  ఇటు నాని కూడా తానేం తక్కువ తినలేదన్నట్టు ‘‘సరే... నా లుక్ జ‌న‌వ‌రి 28న విడుద‌ల‌వుతుంది`` అంటూ నాని రిప్లై ఇచ్చేశాడు.

అంటే ఈసినిమాలో నాని రాక్ష‌సుడు అంటే నెగిటివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లో.. సుధీర్‌బాబు ర‌క్షకుడు అంటే పాజిటివ్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. మొత్తం మీద నాని, సుధీర్ బాబుల కలయికలో ఈ మూవీ వి విజయానికి చేరువ కావడం ఖాయం అంటున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle