newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

నాగార్జునే హోస్ట్.... బిగ్ బాస్ 4 షో అప్ డేట్ ఏంటంటే?

01-08-202001-08-2020 13:11:36 IST
Updated On 01-08-2020 13:40:37 ISTUpdated On 01-08-20202020-08-01T07:41:36.226Z01-08-2020 2020-08-01T07:39:14.826Z - 2020-08-01T08:10:37.448Z - 01-08-2020

నాగార్జునే హోస్ట్.... బిగ్ బాస్ 4 షో అప్ డేట్ ఏంటంటే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగులో  ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 4 త్వరలో రాబోతున్నట్టు స్టార్ మా ప్రకటన చేసింది. ఈ రియాలిటీ షో కి ఎవరు హోస్ట్ గా వుంటారోనని తెలుసుకోవాలని ఉబలాటపడుతున్నారు. ఈ సీజన్ కి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ సీజన్ ప్రోమో షూట్ జరుగుతోంది. హైదరాబాదులోని అన్నపూర్ణా స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్స్ లో ఈ ప్రోమోను చిత్రీకరిస్తున్నారు. దీనికి 'సోగ్గాడే చిన్ని నాయన' దర్శకుడు కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. అలాగే 'బాహుబలి' కెమెరామేన్ కెకె సెంథిల్ కుమార్ చిత్రీకరించారు. 

ఈ ప్రోమో షూటింగ్ కోసం ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ నిబంధనలను పక్కాగా పాటించారు. త్వరలోనే ఈ ప్రోమో టీవీలలో ప్రసారం కానుందని తెలుస్తోంది. ఈ సీజన్ బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లేవారి జాబితా సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు నుంచి షోని ప్రసారం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఎవరెవరు ఈ షోలో పార్టిసిపేట్ చేస్తారో ఇంకా తేలాల్చి వుంది. సోషల్ మీడియాలో మాత్రం అనేకమంది పేర్లు లీక్ అయ్యాయి. 

పూనమ్ భజ్వా, శ్రద్దాదాస్, హంసా నందిని, సింగర్ సునీత,  మంగ్లీ , హీరో నందు, వైవా హర్ష, అఖిల్ సార్దక్, యామినీ భాస్కర్, మహాతల్లి, అపూర్వ, పొట్టి నరేష్, మెహబూబా దిల్ సే,  ప్రియ వడ్లమాని, సింగర్ నోయల్ పేర్లు వచ్చాయి. శ్రద్ధాదాస్ తాను బిగ్ బాస్‌లో పాల్గొనడటం లేదని తెలిపింది. హీరో తరుణ్, యాంకర్లు విష్ణు ప్రియ, ఝాన్సీలు తమకు బిగ్ బాస్‌కి వెళ్లే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు. దీంతో కొత్తపేర్లు మళ్లీ తెరమీదకు రానున్నాయి. 

అంతేకాదు ఓ ప్రముఖ ఛానెల్ యాంకర్ కూడా ఈ లిస్ట్ లో వుండబోతోంది. సీజన్ 2లో దీప్తి నల్లమోతు బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా రాగా.. సీజన్ 3లో జర్నలిస్ట్ జాఫర్ బిగ్ బాస్ కంటెంస్టెంట్‌గా హౌస్‌కి వెళ్లిన విషయం తెలిసింది. ఇదే సాంప్రదాయాన్ని మూడో సీజన్‌లోనూ కొనసాగిస్తూ ఈ ఛానల్ నుంచి మరో యాంకర్ బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా వెళ్లబోతోందని అంటున్నారు. ఆ ఛానల్ నుంచి బిగ్ బాస్‌ సీజన్ 4లో అడుగుపెట్టబోయే ఆ ప్రముఖ యాంకర్ ఎవరనేదానిపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇంతకుముందు సమంత ఈ షోని హోస్ట్ చేస్తుందని వార్తలు వచ్చాయి. కోడల్ని కాదని మామగారినే స్టార్ మా సై అంటోంది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle