newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

నయనతార క్రేజ్ తగ్గలేదుగా..!

20-05-201920-05-2019 12:47:00 IST
Updated On 20-05-2019 12:48:54 ISTUpdated On 20-05-20192019-05-20T07:17:00.214Z20-05-2019 2019-05-20T07:16:58.099Z - 2019-05-20T07:18:54.882Z - 20-05-2019

నయనతార క్రేజ్ తగ్గలేదుగా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్లు చాలా తక్కువనే చెప్పాలి. మొత్తం లెక్కేస్తే ఆరేడుగురు కూడా ఉండరంటే అతిశయోక్తి కాదు. కానీ వాళ్ల రెమ్యున‌రేష‌న్స్ మాత్రం ఆకాశాన్ని తాకేస్తున్నాయి. బాలీవుడ్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో మ‌న ద‌గ్గర కూడా ముద్దుగుమ్మలు భారీ రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్నారు.

ఈ జాబితాలో ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉంది అందాల భామ స్వీటీ అనుష్క. వ‌య‌సు 35 దాటినా కూడా ఇప్పటికీ అనుష్క అంటే అదే ఇమేజ్ ఉంది. ముఖ్యంగా అనుష్క సినిమాలో ఉంటే హీరోతో ప‌నిలేదు. 

ఈమె ఒక్కో సినిమాకు దాదాపు 3.5 నుంచి 4 కోట్ల వ‌ర‌కు తీసుకుంటుంద‌ని తెలుస్తుంది. స్వీటీ తర్వాత స్థానం న‌య‌న‌తారది. ఆమె కూడా అంతే. నయన్ సినిమాకు రెండున్న‌ర నుంచి 4 కోట్ల వ‌ర‌కు పారితోషికం అందుకుంటుంది. సైరా కోసం 3 కోట్ల వ‌ర‌కు న‌య‌న‌తారకు ఇచ్చార‌ని తెలుస్తుంది.

Image result for నయనతార న్యూ మూవీ

Image result for నయనతార న్యూ మూవీ

న‌య‌న‌తార సినిమా అంటే తెలుగు, త‌మిళం అనే భాషాభేదం ఉండ‌దు. అన్ని చోట్లా ఆమెకు లక్షలాదిమంది అభిమానులున్నారు. హీరో ఓరియెంటెడ్ సినిమా చేసినా కూడా చివ‌రికి న‌య‌న్ వ‌చ్చిందంటే అది లేడీ ఓరియెంటెడ్ సినిమా అయిపోతుందంటున్నారు. తాజాగా ఆమె మిస్టర్ లోకల్ మూవీలో నటించింది. శివకార్తికేయన్‌, నయనతార హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్‌ లోకల్ మూవీలో నయనతార లుక్ అదిరిపోయిందంటున్నారు. 

Image may contain: 1 person

ఈమూవీ ఈమధ్యే విడుదలైంది. కార్తికేయన్‌, నయన్‌ కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రమిది. వీరిద్దరూ ‘వెలైక్కారన్‌’ సినిమాలో నటించి అలరించారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ సొంతం చేసుకుందని అంటున్నారు. శివకార్తికేయన్ కంటే నయనతార యాక్షన్ హైలైట్ అంటున్నారు. ఈ మూవీకోసం నయన్ భారీగానే రెమ్యునరేషన్ తీసుకుందని అంటున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్ళయినా ఆమె నిత్యనూతనంగా ఉంటోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle