newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

దటీజ్ బన్నీ పవర్.. అల వైకుంఠపురంలో కలెక్షన్ల సునామీ

13-01-202013-01-2020 09:48:42 IST
Updated On 13-01-2020 10:58:22 ISTUpdated On 13-01-20202020-01-13T04:18:42.210Z13-01-2020 2020-01-13T04:18:20.948Z - 2020-01-13T05:28:22.256Z - 13-01-2020

దటీజ్ బన్నీ పవర్.. అల వైకుంఠపురంలో కలెక్షన్ల సునామీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అల్లు అర్జున్ చాలా గ్యాప్ తర్వాత నటించిన అల వైకుంఠపురంలో మూవీ బ్లాక్ బస్టర్ కలెక్షన్ల వైపు దూసుకుపోతోంది. అల వైకుంఠపురములో సినిమా బాహుబలిని దాటేసింది. ప్రీమియర్స్ కలెక్షన్స్ విషయంలో అల వైకుంఠపురములో సినిమా బాహుబలికి షాకిచ్చింది. అది ఇక్కడ కాదులెండి. న్యూజిల్యాండ్‌లో ‘అల వైకుంఠపురంలో’ రికార్డు క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఐదు షోలకే 34,625 డాలర్లు వసూలు చేసింది. 1

గతంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ ప్రీమియర్ షోలకు న్యూజిల్యాండ్‌లో 21,290 డాలర్లు మాత్రమే రాబట్టాయి. దీంతో బాహుబలి ప్రీమియర్స్ కలెక్షన్స్ ని అల వైకుంఠపురములో దాటేసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. గల్ఫ్ దేశాల్లో కూడా ‘అల వైకుంఠపురంలో’ సినిమాకు 'బాహుబలి' కంటే మంచి కలెక్షన్స్ వస్తున్నాయని చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే ఈ సినిమాతో 'బన్నీ-త్రివిక్రమ్' కు హ్యాట్రిక్ కొట్టేశారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ హిట్ అనే టాక్ వస్తూనే వుంది. తాజాగా అల వైకుంఠపురములో కూడా పాత రికార్డులను బ్రేక్ చేసేలా వుంది. 

మహేష్ సరిలేరు నీకెవ్వరు మూవీ కంటే బన్నీ మూవీ తన సత్తా చాటుతోంది. ప్రీమియర్స్ ద్వారా ఈ సినిమా 5,90,216 డాలర్ల వసూళ్లు చేసింది. దీంతో 'అల..వైకుంఠపురములో' సినిమా మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రికార్డును బ్రేక్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పక్కా క్లాస్ చిత్రంగా రావడంతో బాటు త్రివిక్రమ్ కు ఉన్న ఇమేజ్ రీత్యా ఈ సినిమా ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ వచ్చాయని ఫిలిం వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle