newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

త్రిష... కాజల్ అగర్వాల్... ఇప్పుడు తమన్నా?

30-03-202030-03-2020 10:27:41 IST
Updated On 30-03-2020 11:02:28 ISTUpdated On 30-03-20202020-03-30T04:57:41.075Z30-03-2020 2020-03-30T04:56:23.704Z - 2020-03-30T05:32:28.304Z - 30-03-2020

త్రిష... కాజల్ అగర్వాల్... ఇప్పుడు తమన్నా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మెగాస్టార్ మూవీస్ అంటే అదో క్రేజ్. ఆయనతో కలిసి నటించాలని సినీ భామలంతా తెగ తాపత్రయపడతారు. చిరు సినిమాల్లో ఏదో ఒక సామాజిక సందేశం ఉంటుంది. తాజాగా, చిరు నటిస్తున్న మూవీ 152 విలక్షణ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ పాత్ర కోసం త్రిషను తీసుకున్నారు.అయితే కొన్ని కారణాలతో ఆమె తప్పుకుంటున్నట్టు ప్రకటించి అభిమానులకు షాకిచ్చింది.

త్రిషకు చిరుతో సినిమాలు చేయడం కొత్తేం కాదు. త్రిష స్థానంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ కన్ఫర్మ్ అనే వార్తలు హల్ చల్ చేశాయి. మళ్ళీ హీరోయిన్ విషయంలో ట్విస్ట్ ఇచ్చారు. కాజల్ అగర్వాల్ -చిరంజీవి కెమిస్ట్రీ చాలా బాగా వర్కవుట్ అవుతుందనే లోపు మళ్ళీ ఈక్వేషన్స్ మారిపోయాయి.

సినిమాకోసం కాజల్ భారీగా రెమ్యూనరేషన్ అడిగిందట. పెద్దగా అవకాశాలు లేని ఈ చందమామ. చిరుమూవీ అనేసరికి కొండెక్కి కూర్చుందిట. ఏకంగా కోటిన్నర రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో నిర్మాతలు కళ్ళు తేలేశారని  ఫిలిం వర్గాలలో ప్రచారం జరుగుతోంది. మరి నిజంగానే కాజల్ కు అంత రెమ్యునరేషన్ ఇస్తే మాత్రం అది నిజంగా ఎక్కువే మరి. 

దీంతో కాజల్ కాల్ షీట్ల కోసం ప్రయత్నం చేయడం మానేశారు. మరో హీరోయిన్ కోసం కొరటాల శివ ప్రయత్నం చేశారు. మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తే వారి స్టార్ తిరుగుతుందని అంటారు. అందుకే మెగాస్టార్ సరసన తమన్నా గురించి ఆలోచించారు.

ఈమధ్యే విడుదలైన  సైరా మూవీలో ఆమె నటించింది. అయితే  వీళ్లిద్దరి మధ్యన డ్యూయట్ సాంగ్ లేకపోవడం అనేది ఫ్యాన్స్ ని నిరాశకు గురిచేసింది. దీనికోసం మెగాస్టార్ కి సలహాలు సైతం ఇస్తున్నారు. మరి మెగాస్టార్ దీనిపై దృష్టిపెట్టడం ఖాయం అంటున్నారు. దీంతో మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకోవడం పక్కా అంటున్నారు. అదే జరిగితే మళ్లీ క్రేజీ కాంబినేషన్ అభిమానులకు నేత్రానందం కలిగించడం ఖాయం. 

 

గొప్ప మనసు చాటుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఏపీ కి రూ. కోటి విరాళం

గొప్ప మనసు చాటుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఏపీ కి రూ. కోటి విరాళం

   3 hours ago


వరుస ప్లాపుల నుంచి దిల్ రాజును కాపాడిన బాలయ్య అఖండ

వరుస ప్లాపుల నుంచి దిల్ రాజును కాపాడిన బాలయ్య అఖండ

   6 hours ago


ఆర్ఆర్ఆర్ ని తలదన్నేలా అల్లు అర్జున్ పుష్ప ట్రైలర్

ఆర్ఆర్ఆర్ ని తలదన్నేలా అల్లు అర్జున్ పుష్ప ట్రైలర్

   7 hours ago


ఊర మాస్ గా అల్లు అర్జున్.. పుష్ప ది రైజ్  ట్రైలర్ విడుదల

ఊర మాస్ గా అల్లు అర్జున్.. పుష్ప ది రైజ్ ట్రైలర్ విడుదల

   9 hours ago


ట్రెండ్ సెట్టింగ్ మూవీ శివ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ

ట్రెండ్ సెట్టింగ్ మూవీ శివ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ

   9 hours ago


సంచలనం సృష్టిస్తున్న బాలయ్య అఖండ మూవీ కలెక్షన్స్

సంచలనం సృష్టిస్తున్న బాలయ్య అఖండ మూవీ కలెక్షన్స్

   a day ago


ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్ అధికారిక విడుదల తేదీ వెల్లడి

ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్ అధికారిక విడుదల తేదీ వెల్లడి

   06-12-2021


అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

   02-12-2021


నన్ను ఇకపై ‘తల’ అని పిలవవద్దు.. ఫాన్స్ కు హీరో అజిత్ విన్నపం

నన్ను ఇకపై ‘తల’ అని పిలవవద్దు.. ఫాన్స్ కు హీరో అజిత్ విన్నపం

   01-12-2021


సిరివెన్నెల సీతారామశాస్త్రికి సినీ ప్రముఖులు నివాళులు

సిరివెన్నెల సీతారామశాస్త్రికి సినీ ప్రముఖులు నివాళులు

   01-12-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle