newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

తృటిలో తప్పిన ప్రమాదం.. రాజ్ తరుణ్ సేఫ్

20-08-201920-08-2019 12:58:26 IST
Updated On 20-08-2019 13:36:28 ISTUpdated On 20-08-20192019-08-20T07:28:26.489Z20-08-2019 2019-08-20T07:28:24.198Z - 2019-08-20T08:06:28.920Z - 20-08-2019

తృటిలో తప్పిన ప్రమాదం.. రాజ్ తరుణ్ సేఫ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈమధ్యకాలంలో అవుటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు సర్వ సాధారణం అయిపోయాయి. కుర్రహీరో రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైంది. అయితే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు రాజ్ తరుణ్. అయితే తరుణ్ అని పేరు రావడంతో వేరే హీరో అనుకున్నారు. పేర్లు ఒకటే కావడంతో ఈ కన్ఫ్యూజన్ ఏర్పడింది. నార్సింగ్ సమీపంలో అల్కాపూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన మంగళవారం తెల్లవారు జామున జరిగింది. రాజ్‌తరుణ్‌ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినట్టు తెలిసింది.

టీఎస్ 09 ఈఎక్స్ 1100 నంబరుతో ఉన్న వోల్వో లగ్జరీ కారు రంగారెడ్డి జిల్లా అల్కాపురి టౌన్‌షిప్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.  యాక్సిడెంట్‌  అనంతరం ఆయన వేరే కారులో వెళ్లిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. కారుని రోడ్డు పక్కనే వదిలేసి వెళ్లడంపై అనుమానాలు కలుగుతున్నాయి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle