newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

‘తిప్పరా మీసం’ మూవీ రివ్యూ

08-11-201908-11-2019 15:27:28 IST
2019-11-08T09:57:28.527Z08-11-2019 2019-11-08T09:57:26.304Z - - 19-11-2019

 ‘తిప్పరా మీసం’ మూవీ రివ్యూ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు ఇండస్ట్రీలో సోలో హీరోగా వచ్చి సత్తా చాటిన హీరోలు చాలా తక్కువగా ఉంటారు. అయితే, మల్టీస్టారర్ సినిమాలు చేస్తూనే, హీరోగా, ఆర్టిస్ట్ గా పెద్ద సినిమాల్లో చిన్నక్యారెక్టర్స్ అయినా కూడా చేసే శ్రీవిష్ణు స్టైలే డిఫరెంట్. 'నీది నాది ఒకే కథ', 'బ్రోచేవారెవరురా' అంటూ వినూత్నమైన సినిమాని లో చేసి మంచి హిట్ అందుకున్న శ్రీవిష్ణు ఇప్పుడు  'తిప్పరా మీసం' అంటూ మంచి మాస్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఆడియన్స్ దృష్టిలో మీసం తిప్పాడా.. లేదా అనేది తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే..

కథ ఏంటంటే... 

మణి శంకర్ ( శ్రీవిష్ణు) డ్రగ్స్ కి బానిసై చిన్నప్పటి నుంచే చెడు సావాసాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో అతని ప్రవర్తనలో మార్పు తీసుకొని  వచ్చేందుకు తల్లి లలిత ( రోహిణి)  రీహ్యాబిలిటేషన్ సెంటర్ లో జాయిన్ చేయిస్తుంది. అక్కడ ఒంటరిగా ఉన్న మణికి తల్లి పట్ల  ద్వేషం ఏర్పడుతుంది. ఈ క్రమంలో అక్కడ్నుంచి పారిపోయి డిజెగా పబ్ లో జాయిన్ అవుతాడు. ఇష్టారాజ్యాంగా బతుకుతూ ఉంటాడు. ఈ క్రమంలో అతడు తన తల్లిపై కోర్డు కేస్ పెడతాడు. అసలు కన్నతల్లిపై కోర్టుకేస్ ఎందుకు పెట్టాడు. ? చివరకి మణి కథ ఏమైంది అనేది తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే..

 ప్లస్ పాయింట్స్…

ముందుగా మాట్లాడుకోవాల్సిన ప్లస్ పాయింట్ శ్రీవిష్ణు యాక్టింగ్, రోహిణి యాక్టింగ్ ఇద్దరూ కూడా చాలాబాగా నటించారు అనేకంటే జీవించారు అనొచ్చు. ముఖ్యంగా సినిమాలో లాస్ట్ 10 నిమిషాలు సినిమా మొత్తానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇదే సినిమాని నిలబెట్టింది. మొదటి ఫ్రేమ్ నుంచి కూడా సిద్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది.అంతే కాకుండా సంగీతం అందించిన సురేష్ బొబ్బిలి సినిమాకు మరింత ప్లస్ అయ్యారు.కేవలం పాటలు మాత్రమే కాకుండా మంచి నేపధ్య సంగీతం కూడా ఆయన అందించారు.

మైనస్ పాయింట్స్…

చెప్పాలంటే మైనస్ పాయింట్స్ చాలానే ఉన్నాయి. ముఖ్యంగా కథ ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ పాయింట్. ఫస్ట్ హాఫ్ లో కథ లేకుండా పోవడంతో  శ్రీవిష్ణు పాత్రనే హైలైట్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకున్నారు.  శ్రీవిష్ణు డ్రగ్ర్ కి బానిసై చేసే విన్యాసాలు ఆడియన్స్ కి విసుగు పుట్టించాయి. కథకి ఏమాత్రం సింక్ లేని సన్నివేశాల్లా అనిపిస్తాయి.

ప్రతి సీన్ ల్యాగ్ ఉంటుంది దీంతో ప్రేక్షకుడు అసహనానికి గురి అవుతాడు. ఇక స్క్రీన్ ప్లే గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. డబ్బుకోసం తల్లిని వేధించడంలోనే సగం సినిమా అయిపోతుంది. క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇది చాలామంది ముందుగానే ఊహిస్తారు కూడా. ఇక హీరోయిన్ పాత్రకి స్కోప్ లేదు. ఎడిటింగ్ కూడా షార్ప్ గా ఉంటే బాగుండేది.  స్క్రీన్ ప్లే కూడా అంతగా మెప్పించదు. దీంతో చాలా సన్నివేశాలు ఎందుకు వస్తాయో అర్ధం కాదు. ఈ విషయాల్లో కృష్ణ విజయ్ పలు జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది.

ఓవరాల్ గా చెప్పాలంటే శ్రీవిష్ణు యాక్టింగ్ ఇష్టపడే వారు ఈ సినిమాని చూడొచ్చు. లేదంటే అమెజాన్ ప్రైమ్ లో వచ్చేవరకూ వెయిట్ చేయండి. 

నటీనటులు: శ్రీవిష్ణు, నిక్కీ, రోహిణి తదితరులు    

సంగీతం: సురేష్ బొబ్బిలి                           

కెమెరా: సిద్  

దర్శకత్వం: కృష్ణ విజయ్                                   

నిర్మాత: రిజ్వాన్                                                

విడుదల తేదీ: 08/11/2019  

రన్ టైమ్: 158 నిమిషాలు  

రేటింగ్: 2/5 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle