newssting
BITING NEWS :
బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కేసులో నేడు వెలువడనున్న తీర్పు. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును ప్రకటించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, విశ్వహిందూ పరిషత్‌ నేతలు విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంబర తదితరులు. వీరిలో అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌ మరణించగా కరోనాతో చికిత్స పొందుతున్న ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్. మిగిలిన వారిలో కొందరు నేడు కోర్టుకు హాజరయ్యే అవకాశం * పాకిస్థాన్ దేశంలోని మర్దాన్ నగరంలో జరిగిన పేలుడు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయాలు. గ్యాస్ వల్ల మర్దాన్ నగరంలోని జడ్జి బజార్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని చెప్పిన పాక్ పోలీసులు. ఈ పేలుడులో ఓ బాలుడితోపాటు మొత్తం నలుగురు మృతి. గాయపడిన 12 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు * ఒడిశాలో కరోనా వీర విజృంభణ. కరోనా బారిన పడ్డ ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో నాలుగు వందల మంది. అందులో 351 మంది సేవకులు, 53 మంది సిబ్బందికి వైరస్‌. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి. మరోవైపు ఒడిశా స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌ తో సహా మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ * బిహార్ ఎన్నికల్లో పోటీకి బీఎస్పీతో కలిసి ఆర్ఎల్ఎస్‌పీ ప్రత్యేక ఫ్రంట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బహుజనసమాజ్ పార్టీ, జనతాంత్రిక్ పార్టీతో కలిసి తాము ప్రత్యేక ఫ్రంట్ గా పోటీ చేస్తామని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వా ప్రకటన. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించిన ఉపేంద్ర * శీతాకాలంలో కరోనా వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ హెచ్చరిక. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ, నిపుణుల బృందం హెచ్చరిక. రాబోయే రెండు మూడు నెలలు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని కొనసాగించాలని డాక్టర్ పాల్ సూచన * హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున బలవంతంగా దహనం చేసినట్లుగా ఆరోపిస్తున్న బాధితురాలు కుటుంబ సభ్యులు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ మృతదేహాన్ని పోలీసులే బలవంతంగా దహనం చేశారని ఆరోపణ. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో నలుగురు మృగాలు యువతిపై అత్యాచారం చేసి నాలుక కోసి, గొంతు నులిమిన ఘటనతో కన్నుమూసిన 19ఏళ్ల యువతి * సూర్యాపేట‌ జిల్లాలోని కోదాడ‌లో అదుపుత‌ప్పి ఇంట్లోకి దూసెకెళ్లిన లీలాద‌రి ట్రావెల్స్ ప్రైవేటు బ‌స్సు. రాజ‌స్థాన్ నుంచి విశాఖ‌ప‌ట్నం ప్రయాణిస్తుండగా బుధవారం తెల్ల‌వారుజామున సూర్యాపేటలో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టిన బస్సు. రోడ్డు వెంబ‌డి ఉన్న రెండు విద్యుత్ స్తంభాల మ‌ధ్య‌లోనుంచి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు. ప్ర‌మాద సమ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉండగా నలుగురికి గాయాలు * దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌. నియోజకవర్గంపై దృష్టి సారించనున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానున్న గెలుపు * 288వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం *

తారక్, శృతికి మహేష్ బాబు ఛాలెంజ్

10-08-202010-08-2020 13:18:42 IST
2020-08-10T07:48:42.047Z10-08-2020 2020-08-10T07:44:15.815Z - - 30-09-2020

తారక్, శృతికి మహేష్ బాబు ఛాలెంజ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు సినిమా రంగంలో మహేష్ బాబు తీరే వేరుగా వుంటుంది. అందరు హీరోలు, హీరోయిన్లతో ఫ్రెండ్లీగా వుంటారు. రాజకీయనేతలతోనూ ఆయన అనుబంధం విడదీయలేనిది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీయార్ కి అత్యంత సన్నిహితుడుగా వుంటారు. సినిమా ఫంక్షన్లకు ఎప్పుడు పిలిచినా కేటీయార్ హాజరై ఆ ఫంక్షన్ సక్సెస్ అయ్యేలా చూస్తారు. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ మహేష్ పాల్గొంటారు. తాజాగా మహేశ్‌బాబు తన పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో మొక్క నాటారు. 

ఎంపీ సంతోష్ కుమార్‌ ప్రవేశపెట్టిన గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా ఆయన మొక్క నాటుతూ పుట్టినరోజును జరుపుకోవడానికి ఇంత కంటే మంచి మార్గం లేదన్నారు. మహేశ్‌ మొక్క నాటుతున్న వీడియోను ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ ఈ ఛాలెంజ్‌ను సరిహద్దులు దాటనివ్వాలని కోరారు.

Mahesh Babu accepts Green India Challenge

ఈ గ్రీన్‌ ఛాలెంజ్‌కు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాల్సిందిగా కోరారు. పచ్చని ప్రపంచం వైపునకు అడుగులు వేయాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటారు. అంతేకాదు తన మిత్రులు ఎన్టీఆర్‌, తమిళ హీరో థళపతి విజయ్‌, శృతి హాసన్‌కు ఆయన ఛాలెంజ్‌ విసిరారు. ఇప్పటికే సినిమా తారలంతా గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన సంగతి తెలిసిందే. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారికి మహేష్ ధన్యవాదాలు తెలిపారు. 

Image

థియేటర్ లో విడుదల కానున్న సుశాంత్ ఆఖరి చిత్రం..

థియేటర్ లో విడుదల కానున్న సుశాంత్ ఆఖరి చిత్రం..

   13 minutes ago


ఆదిపురుష్ లో అనుష్క.. అసలు నిజం ఇదే!

ఆదిపురుష్ లో అనుష్క.. అసలు నిజం ఇదే!

   19 minutes ago


టాలీవుడ్ లోకి "ఫిలిమ్" ఓటీటీ ఎంట్రీ, తొలి ప్రీమియర్ ఏ సినిమానో తెలుసా..?

టాలీవుడ్ లోకి "ఫిలిమ్" ఓటీటీ ఎంట్రీ, తొలి ప్రీమియర్ ఏ సినిమానో తెలుసా..?

   23 minutes ago


నిజమైన హీరో 'సోనూ సూద్'‌కి ఐరాస అవార్డు

నిజమైన హీరో 'సోనూ సూద్'‌కి ఐరాస అవార్డు

   3 hours ago


'చందమామ' మాన్య చిత్రకారులు శంకర్ గారు ఇక లేరు..

'చందమామ' మాన్య చిత్రకారులు శంకర్ గారు ఇక లేరు..

   3 hours ago


కార్తికేయ 2లో భారీ మార్పులు.. ఇంతకీ ఏంటా మార్పులు..?

కార్తికేయ 2లో భారీ మార్పులు.. ఇంతకీ ఏంటా మార్పులు..?

   4 hours ago


సేమ్ టీంతోనే ఎఫ్3..స్టార్ట్ అయిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ..!

సేమ్ టీంతోనే ఎఫ్3..స్టార్ట్ అయిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ..!

   6 hours ago


అందరి భద్రత గురించి ఆలోచిస్తా.. థియేటర్స్ తెరుచుకునే సమయం ఇదే

అందరి భద్రత గురించి ఆలోచిస్తా.. థియేటర్స్ తెరుచుకునే సమయం ఇదే

   6 hours ago


బాలయ్య.. ఆ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?

బాలయ్య.. ఆ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?

   15 hours ago


ఎస్వీ కృష్ణారెడ్డి హీరోగా సినిమానా..? వర్కవుట్ అవుతుందా..?

ఎస్వీ కృష్ణారెడ్డి హీరోగా సినిమానా..? వర్కవుట్ అవుతుందా..?

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle