newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

తారక్ ఈజ్ బ్యాక్... రెడీ బిగ్‌బాస్

09-02-201909-02-2019 16:53:43 IST
2019-02-09T11:23:43.678Z09-02-2019 2019-02-09T11:23:41.345Z - - 21-08-2019

తారక్ ఈజ్ బ్యాక్... రెడీ బిగ్‌బాస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
‘బిగ్‌బాస్’ తొలి సీజన్ ఘనవిజయం సాధించడంలో జూనియర్ ఎన్టీఆర్‌దే ప్రధానపాత్ర అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తనదైన మేనరిజం, కామిక్ టైమింగ్స్‌తో ప్రేక్షకుల మనసు దోచుకుని... తెలుగు టెలివిజన్ చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో టిఆర్‌పి రేటింగ్స్ తెచ్చిపెట్టాడు.

అయితే... రెండో సీజన్ విషయంలో టిఆర్‌పి తేడా కొట్టేసింది. నేచురల్ స్టార్ నాని ‘హోస్ట్’గా ఆ ప్రోగ్రామ్‌ని సక్సెస్ చేయాలని శాయశక్తులా ప్రయత్నించాడు కానీ... తారక్ స్థాయిని టచ్ చేయలేకపోయాడు. దానికితోడు... అనుకోని పరిణామాల కారణంగా ‘పక్షపాత’ ఆరోపణలూ ఎదుర్కొన్నాడు. దీంతో నొచ్చుకున్న నాని... అసలు ‘బిగ్‌బాస్’ షోకే వ్యాఖ్యతగా నిర్వర్తించకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ దెబ్బతో మూడో సీజన్‌కి హోస్ట్‌గా ఎవరు వ్యవహరిస్తారనే విషయం మిస్టరీగానే మిగిలిపోయింది.

ఆమధ్య తిరిగి తారక్ హోస్ట్‌గా రిటర్న్ అవుతాడని రూమర్స్ వచ్చాయి. కానీ... జక్కన్నతో సినిమా అంటే అంత సులువుగా తెగని పని కాబట్టి కుదరకపోవచ్చనే వాదనలు వినిపించాయి. ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్‌తో పాటు పలువురి నటుల పేర్లు తెరమీదకొచ్చాయి. దాదాపు వెంకటేష్ కన్ఫమ్ అవ్వొచ్చనే ప్రచారం జోరుగా సాగింది. కానీ... ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని ‘ఎఫ్2’ ప్రమోషన్స్‌లో వెంకీ క్లారిటీ ఇచ్చేశారు. దాంతో మూడో సీజన్‌కి హోస్ట్ ఎవరనే ప్రశ్న మళ్ళీ సస్పెన్స్‌గా మారింది.

ఇన్నాళ్ళ తర్వాత ఆ మిస్టరీ వీడినట్లు సమాచారం! ఫస్ట్ సీజన్‌ని సక్సెస్‌ఫుల్‌గా హ్యాండిల్ చేసిన తారకే తిరిగి మూడో సీజన్‌కి హోస్ట్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ తారక్, బిగ్‌బాస్ యాజమాన్యం మధ్య చర్చలు కూడా జరిగాయని... సీజన్ మొత్తానికి రెమ్యునరేషన్ కింద రూ.20 కోట్లు తీసుకునేలా ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి... ఇది నిజమో, కాదో తెలియాలంటే... కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే!


Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle