newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

తారక్‌కి చరణ్ రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా?

21-05-202021-05-2020 11:32:05 IST
Updated On 21-05-2020 11:41:30 ISTUpdated On 21-05-20202020-05-21T06:02:05.650Z21-05-2020 2020-05-21T06:01:56.572Z - 2020-05-21T06:11:30.563Z - 21-05-2020

తారక్‌కి చరణ్ రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మనం ఎవరికైనా ఒక గిఫ్ట్ ఇస్తే.. దానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం సంస్కారం. ఇప్పుడు అదే పనిలో వున్నాడు మెగా హీరో రాంచరణ్ తేజ్. బుధవారం ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రామ్ చరణ్, చిరంజీవి, సాయి ధరమ్ తేజ్ వంటివారు చేసిన ట్వీట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అందులో మరీ ముఖ్యంగా రామ్ చరణ్ చేసిన ట్వీట్.. ఓ విషయాన్ని గుర్తు చేశాయి.  ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి గతంలో రాంచరణ్ బర్త్ డే సందర్భంగా బీమ్ ఫర్ రామరాజు అంటూ ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. అందులో తారక్ వాయిస్ ఓవర్ హైలైట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ వీడియోలో అల్లూరిగా రామ్ చరణ్ కనిపిస్తే.. భీమ్‌గా ఎన్టీఆర్ వినిపించాడు. అప్పుడే అంతా భావించారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా భీమ్ కనిపిస్తాడని, అల్లూరి వినిపిస్తాడని ఊహించారు. కానీ ఎన్టీఆర్ బర్త్ డేకి షాకిచ్చింది. దీనిపై రామ్ చరణ్ స్పందిస్తూ.. ‘హ్యాపీ బర్త్ డే మై డియర్ బ్రదర్ తారక్.. నాకు తెలుసు నీకో రిటర్న్ గిఫ్ట్ బాకీ ఉన్నాను.. బెస్ట్ ఇస్తాను అని నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను.. ముందున్నాయ్ అసలైన వేడుకలు'అంటూ ట్వీట్ చేశాడు. 

లాక్ డౌన్ కారణంగా ఎన్టీఆర్ కోసం గిఫ్ట్ రెడీ చేయలేకపోయామని ఆర్ఆర్ఆర్ టీమ్ అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇటు తారక్ బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులంతా అభినందనలతో ముంచెత్తారు. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా  ‘హ్యాపీ బర్త్ డే భీమ్.. నీవు కన్న కలలన్నీ నిజం కావాలని కోరుకుంటున్నా'ని ట్వీట్ చేశారు. సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.. ‘తెలుగు ఇండస్ట్రీలోని అద్భుతమైన నటుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ కోరికలన్నీ నెరవేరాలి తారక్' అని కోరుకున్నాడు.

తమన్నా,సమంత, పూరి జగన్, అల్లు శిరీష్. రాజమౌళి ఎన్టీఆర్ బర్త్ డేపై స్పందించారు. ఆర్ఆర్ఆర్ నిర్మాత రాజమౌళి అయితే బాగా ఎమోషనల్ అయ్యాడు. ‘‘నా సినీ ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి నువ్ నా భాగస్వామిగా ఉన్నావ్.. అందుకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ బర్త్ డే డియర్ తారక్. నీ కంటే మంచి భీమ్‌ను నేను కనిపెట్టలేను' అని చెప్పుకొచ్చాడు. ఇటు సోషల్ మీడియా తారక్ బర్త్ డే సందేశాలతో షేక్ అయింది. మొత్తం మీద ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఎలాంటి అప్ డేట్ లేకపోవడం, సినిమా విడుదల కూడా ఆలస్యం కానుండడంతో తారక్ అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle