newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

డిటెక్టివ్ పాత్రలో మాస్ మహారాజా...హిట్ కోసం తపన

01-08-202001-08-2020 08:45:45 IST
2020-08-01T03:15:45.484Z01-08-2020 2020-08-01T03:15:40.051Z - - 07-08-2020

డిటెక్టివ్ పాత్రలో మాస్ మహారాజా...హిట్ కోసం తపన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకప్పుడు మాస్ మహారాజా రవితేజ సినిమా విడుదలయితే మినిమం గ్యారంటీ అనే భావన వుండేది. కానీ రానురాను సినిమాలు తగ్గుతున్నాయి. సక్సెస్ రేటు కూడా తగ్గుతోంది.  రవితేజ యాక్షన్‌ సీక్వెన్స్‌ కానీ, కామెడీ కానీ, ఎమోషనల్‌ సీన్స్ వెరైటీగా వుంటాయి. పక్కా మాస్ ఫార్ములాతో ఖతర్నాక్ గా అలరిస్తుంటాడు. ఇటీవల 'డిస్కో రాజా'తో ప్రేక్షకుల్ని నిరాశపరిచిన రవితేజ ప్రస్తుతం 'క్రాక్‌' అనే సినిమా చేస్తున్నాడు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ పోలీసు పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ తర్వాత త్రినాథరావు నక్కిన సినిమా ఉండబోతోందనే టాక్ వినబడుతోంది. 

త్రినాథరావు నక్కిన కామెడీకి ప్రత్యేకత వుంటుంది. వినోదాత్మక దర్శకుడిగా మంచి పేరుతెచ్చుకున్నారు త్రినాథ్. వీరిద్దరి కలయికలో ఓ సినిమా రూపొందుతోందని చాలా రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. రవితేజ కోసం త్రినాథరావు నక్కిన మంచి వినోదాత్మక కథను సిద్ధం చేశాడు. అందులో రవితేజ పాత్ర డిటెక్టివ్‌ తరహాలో వుంటుందని తెలుస్తోంది.

సింపుల్‌గా చెప్పాలంటే 'చంటబ్బాయ్‌'లో చిరంజీవి పాత్రలా అన్నమాట. ఈ విషయంలో స్పష్టత లేనప్పటికీ... రవితేజ త్వరలో 'చంటబ్బాయ్‌' అవ్వబోతున్నాడని టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ఇందులో రవితేజ ఎలా నటించి మెప్పిస్తాడోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రాక్ మూవీ పూర్తయ్యాక ఈ మూవీ తెరపైకి రానుంది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle