newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

డిజిటల్ తెరపైకి డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్

25-05-202025-05-2020 17:05:25 IST
Updated On 25-05-2020 18:16:33 ISTUpdated On 25-05-20202020-05-25T11:35:25.726Z25-05-2020 2020-05-25T11:35:08.985Z - 2020-05-25T12:46:33.926Z - 25-05-2020

డిజిటల్ తెరపైకి డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈమధ్యకాలంలో సినిమా హీరోలు వెబ్ సిరీస్ లపై కన్నేశారు. మరికొందరు తమ సినిమాలను థియేటర్లలోనే రిలీజ్ చేయాలనే పంతం నుంచి పక్కకు జరిగి.. ఓటీటీ ప్లాట్ ఫాంలపై కూడ విడుదల చేయడానికి రెడీ అయ్యారు. తాజాగా ఓ డైరెక్టర్ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ అవుతోంది. మాస్ యాక్షన్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ త్వరలోనే డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ పైకి రాబోతున్నారనే వార్త సంచలనం అవుతోంది. 

కరోనా వైరస్ కారణంగా జనమంతా ఇళ్ళకే పరిమితం అయిన నేపథ్యంలో వారిని అలరించేందుకు అన్ని సంస్థలు డిజిటల్ వేదికలను ఉపయోగించుకుంటున్నాయి. దీనికి సంబంధించి ఒక కంటెంట్ ని కూడా రెడీ చేసాడట పూరీ జగన్. చాలా బోల్డ్ కంటెంట్ ఇందులో ఉంటుందని, స్వేచ్ఛగా మనకి కావాల్సిన డైలాగ్స్ సెన్సార్ లేకుండా ఇక్కడ రాస్కోవచ్చని ఇటు అడుగులు వేసినట్లుగా చెబుతున్నారు.

నిజానికి పూరీ జగన్నాథ్ సినిమాల్లో హీరోలు చెప్పే డైలాగ్స్, విలన్స్ చెప్పే డైలాగ్స్ కాస్త ఓవర్ డోస్ లోనే ఉంటాయి. హీరో రెబల్ గా కనిపిస్తాడు.. విలన్ అందుకు థీటుగా ఉంటాడు. ఇక హీరోయిన్ తో హీరో చేసే రొమాన్స్ శృతి, లయ అన్ని దాటి పీక్స్ లో వుంటాయి. అంతేకాదు పూరీ మూవీస్ లో హీరోయిన్ల అందాల విందు మామూలుగా వుండదు.

పూరీ చేతిలో పడ్డ హీరోయిన్లకు తర్వాత భారీ ఆఫర్లు వచ్చాయనేది జగద్వితమే. ఇలియానా, అనుష్క , ప్రియమణి, హన్సిక హీరోయిన్స్ దగ్గర్నుండీ నిన్న మొన్నటి నిథి అగర్వాల్ దాకా అందరి హీరోయిన్స్ ని చాలా గ్లామరస్ గా చూపించారు. ఇప్పుడు ఇదే ఊపులో లాక్ డౌన్ లో సమయంలో వెబ్ సీరిస్ కి తగ్గట్లుగా మాఫియా బ్యాక్ గ్రౌండ్లో ఉండే క్యారెక్టర్స్ తో ఒక బోల్డ్ స్టోరీని రెడీ చేసినట్లుగా సమాచారం. యూత్ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చివరిదశకు వచ్చింది. అనంతరం ఈవెబ్ సీరిస్ పై ఫోకస్ పెట్టనున్నాడు. విజయ్ తో తీస్తున్న ఫైటర్ సినిమాని హీందీలో కూడా రిలీజ్ చేస్తున్నాడు. అన్ని అనుకూలిస్తే త్వరలో పూరీ పవర్ డిజిటల్ తెరను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 

ఐశ్యర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్.. బంగ్లా అంతా కంటైన్మెంట్ జోన్!

ఐశ్యర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్.. బంగ్లా అంతా కంటైన్మెంట్ జోన్!

   14 hours ago


కీర్తి, రష్మికలకు సమంత ఛాలెంజ్ .. మామ నాగ్‌తో కలిసి మొక్కలకు నీళ్ళు

కీర్తి, రష్మికలకు సమంత ఛాలెంజ్ .. మామ నాగ్‌తో కలిసి మొక్కలకు నీళ్ళు

   a day ago


అనుపమ్ ఖేర్ ఫ్యామిలీకి కరోనా సెగ

అనుపమ్ ఖేర్ ఫ్యామిలీకి కరోనా సెగ

   a day ago


ముంబైలో కరోనా టెర్రర్.. ఉలిక్కిపడ్డ బాలీవుడ్

ముంబైలో కరోనా టెర్రర్.. ఉలిక్కిపడ్డ బాలీవుడ్

   12-07-2020


బిగ్ బికి కోవిడ్ పాజిటివ్.. కొడుకు అభిషేక్ కి కూడా

బిగ్ బికి కోవిడ్ పాజిటివ్.. కొడుకు అభిషేక్ కి కూడా

   12-07-2020


అది ప్రభాస్‌కే సాధ్యం.. రాధేశ్యామ్ రికార్డుల మోత

అది ప్రభాస్‌కే సాధ్యం.. రాధేశ్యామ్ రికార్డుల మోత

   11-07-2020


పెళ్ళిపై దృష్టి మళ్లిందా...రకుల్ ప్లానేంటి?

పెళ్ళిపై దృష్టి మళ్లిందా...రకుల్ ప్లానేంటి?

   11-07-2020


ఓటీటీలో విడుదలైనా తగ్గని ‘కీర్తి’.. చేతినిండా సినిమాలు

ఓటీటీలో విడుదలైనా తగ్గని ‘కీర్తి’.. చేతినిండా సినిమాలు

   10-07-2020


ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగే.. రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ అదుర్స్

ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగే.. రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ అదుర్స్

   10-07-2020


వర్మ మరో సెన్సేషన్... పవర్ స్టార్ ఫస్ట్ లుక్ విడుదల

వర్మ మరో సెన్సేషన్... పవర్ స్టార్ ఫస్ట్ లుక్ విడుదల

   09-07-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle