newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

టాలీవుడ్లో మరో పెళ్ళిసందడి... ఆ హీరోయిన్‌తో ఆది పెళ్లంట..!

01-08-202001-08-2020 08:58:55 IST
Updated On 01-08-2020 14:02:52 ISTUpdated On 01-08-20202020-08-01T03:28:55.611Z01-08-2020 2020-08-01T03:27:57.326Z - 2020-08-01T08:32:52.689Z - 01-08-2020

టాలీవుడ్లో మరో పెళ్ళిసందడి... ఆ హీరోయిన్‌తో ఆది పెళ్లంట..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టాలీవుడ్ లో పెళ్లిళ్ళ సందడి నడుస్తోంది. ఇప్పటికే నిఖిల్, నితిన్ పెళ్ళిళ్ళు అయిపోయాయి. నెక్స్ట్ దగ్గుబాటి వారి వారసుడు భళ్ళాలదేవుడు రానా పెళ్ళికి రెడీ అయ్యాడు. మిహికా బజాజ్ తో త్వరలో పెళ్లి జరగబోతోంది. తాజాగా మరో హీరో పెళ్లికొడుకు కాబోతున్నాడనే వార్త హల్ చల్ చేస్తోంది. రవిరాజా పినిశెట్టి కుమారుడిగా ఎంట్రీ ఇచ్చి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆదిపినిశెట్టి. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏదైనా సరే ఆది ఓకే చెప్పేస్తాడు. రంగస్థలం చిత్రంలో అశోక్ బాబుగా ఇండస్ట్రీని ఫిదా చేశాడు. అంతకు ముందు 'నిన్ను కోరి' సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసి నానితో పాటు క్రేజ్ సంపాదించాడు. 

తన బాడీ ఫిట్‌నెస్, విలనిజంతో సరైనోడు సినిమాలో ఎంతగా మెప్పించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయువ హీరో పెళ్లి వార్త ఇపుడు కోలీవుడ్‌, టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆది పినిశెట్టి హీరోయిన్ నిక్కీ గల్రానీని వివాహం చేసుకునేందుకు రెడీ అవుతున్నాడని అంటున్నారు. ఆది తండ్రి రవిరాజా ఇటీవల నిర్వహించిన బర్త్ డే వేడుకల్లో వారి ఫ్యామిలీ ఫొటోలో నిక్కీ కనిపించింది.

దీంతో ఈవార్తలకు మరింత బలం చేకూరింది. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక వీరి పెళ్లి ఉంటుందని సమాచారం. మలుపు, మరకతమణి చిత్రాల్లో ఆది, నిక్కీ గల్రానీ కలిసి నటించారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఆది, నిక్కీ గల్రానీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. నిక్కీ గల్రానీ అంటే ఆదికి ఇష్టమని, వీరిద్దరి పెళ్ళికి త్వరలో గ్రీన్ సిగ్నల్ రానుందని అంటున్నారు. అంతా సక్రమగా సాగితే త్వరలో మరో పెళ్లితంతు చూడొచ్చన్నమాట. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle