newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

‘జెర్సీ’ నాని గెలుపు దాహం తీరుస్తుందా?

15-04-201915-04-2019 08:23:48 IST
2019-04-15T02:53:48.534Z15-04-2019 2019-04-15T02:53:42.743Z - - 22-07-2019

‘జెర్సీ’ నాని గెలుపు దాహం తీరుస్తుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నాచురల్ స్టార్ నాని క్రికెటర్‌గా నటించిన చిత్రం 'జెర్సీ'. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన చిత్రాలు దాదాపు హిట్ గా నిలిచాయి. 'నేను లోకల్, ఎం.సి.ఏ, నిన్ను కోరి' సినిమాల విషయంలో నాని విమర్శలు ఎదురుకోవాల్సి వచ్చింది. ఒకే తరహా సినిమాలు వరుసగా చేసుకుంటూ వస్తున్నాడనే విమర్శలు ఎదురుకున్నాడు. దాంతో నాని వైవిధ్యం కోసం 'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' లాంటి సినిమాలు చేశాడు. 

కానీ ఈ సినిమాలు ఫ్లాప్‌గా నిలిచాయి. తన పాత్ర వైవిధ్యభరితంగా ఉండాలనే ఉద్దేశంతో 'మళ్ళీ రావా' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి చెప్పిన కథని ఓకే చేశాడు. కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి తమిళ రాక్ స్టార్ అనిరుద్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పాటలు ఈ సినిమాపై పాజిటివ్ బజ్ తీసుకురాలేకపోయాయి.

అనిరుద్ సెలక్షన్ రాంగ్ సెలక్షన్ అని ఎన్నో విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. దీంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. ట్రైలర్‌ను సూపర్‌గా కట్ చేయడంతో అప్పటివరకు లేని అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి. 

24 గంటల్లో ఈ సినిమా ట్రైలర్ 4 మిలియన్స్ వ్యూస్ సాధించింది. ఏప్రిల్ 19న ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంలో సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను సోమవారం హైదరాబాద్‌లో శిల్పకళా వేదికగా ఈ వేడుక జరగనుంది. 'జెర్సీ' సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

ఇదే బ్యానర్‌‌లో వెంకటేష్ 'బాబు బంగారం' సినిమా చేసిన సంగతి తెలిసిందే. చిత్ర యూనిట్‌తో ఉన్న అనుబంధం కారణంగా ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ పోస్టర్ విడుదల చేసింది. నాని ఆశించిన విజయాన్ని 'జెర్సీ' సినిమా ఇస్తుందోమో చూడాలి..!

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle