newssting
BITING NEWS :
*టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో పర్యటన* క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో సినీ నిర్మాతల భేటి...హాజ‌రైన దగ్గుపాటి సురేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జి *నేడు 72వ రోజు రాజధాని ప్రాంత రైతుల ఆందోళన *వాళ కర్నూలులో సీఎం జగన్ పర్యటన...ఎమ్మెల్మే శ్రీదేవి కుమారుడి విహహానికి హాజరు కానున్న జగన్*నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్న కాంగ్రెస్ నేతలు..ఢిల్లీలో అల్లర్లపై రాష్ట్రపతికి ఫిర్యాదు *నేడు రాజధానికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ..హైకోర్టులో వాదనలను వినిపించనున్న ప్రభుత్వ తరపు న్యాయవాది *ఇవాళ గుంటూరు జైలు నుంచి రాజధాని రైతుల విడుదల *రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి *మహిళల టీ-20 ప్రపంచకప్...నేడు భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్

జిమ్‌లో జారిపడ్డ దీపికా.. రణవీర్ చిలిపి సలహా?

15-05-201915-05-2019 13:18:17 IST
Updated On 15-05-2019 13:19:38 ISTUpdated On 15-05-20192019-05-15T07:48:17.591Z15-05-2019 2019-05-15T07:48:05.817Z - 2019-05-15T07:49:38.887Z - 15-05-2019

జిమ్‌లో జారిపడ్డ దీపికా.. రణవీర్ చిలిపి సలహా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దీపికా పదుకునె మరియు రణ్ వీర్ సింగ్ అత్యంత ప్రముఖ జంటగా చిత్ర పరిశ్రమలో ఓ పేరు తెచ్చుకున్నారు. వాళిద్దరూ ఎక్కడ కనిపించినా సోషల్ మీడియాలో ఆ ఫోటోలు, అభిమానుల కామెంట్లు కుప్పలు తెప్పలుగా వచ్చిపడతాయి. అందాల భామ దీపికా పదుకునె ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు తన ఎక్స్‌ట్రా క్యాలరీలను తగ్గించుకునే పనిలో పడింది. తన పర్సనల్ ట్రెయినర్ నామ్ దగ్గర కొత్త వర్కవుట్లు చేస్తోంది. ఈమధ్య ఫిగర్ కోసం జిమ్‌ల వెంట పడుతోంది. 

అంతవరకూ బాగానే ఉంది. కానీ జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ వెనక్కి పడింది. అయితే తన చేతుల సాయంతో మళ్ళీ యథాస్థానానికి వచ్చింది. ఈ ఫోటోలను దీపికా ఇన్ స్టా గ్రాంలో షేర్ చేసింది. ఈ ఫోటోలకు రణవీర్ చిలిపిగా బదులిచ్చాడు. మంచి ఫాంలో ఉన్న నీవు, వర్కవుట్స్ చేస్తూ నువ్వు అలసిపోతున్నావ్. నీవింకా స్లిమ్‌గా కనబడడానికి నావంతు సాయం చేస్తా అంటూ చిలిపిగా కామెంట్ చేశాడు. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. 

బాలీవుడ్ సినీపరిశ్రమలో అధికమొత్తంలో పారితోషికం తీసుకునే భామల్లో దీపికా పదుకొనె ఒకరు. బాలీవుడ్ అందాల తారల్లో తనదైన నటనశైలితో ఒయలొలికించడం దీపిక సొంతం. తన నటనకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు ఎన్నో అవార్డులను చేజిక్కుంచుకుంది.

బాలీవుడ్, టాలీవుడ్ నటీనటులను ఇబ్బంది పెట్టిన మీటూ పై కూడా ఆమధ్య దీపికా స్పందించింది. తాను కూడా అనేక ఇబ్బందులకు గురయ్యానని, అయితే ఆత్మవిశ్వాసం మాత్రం వీడలేదని దీపికా పేర్కొంది. పద్మావత్ మూవీలో ఆమె నటించినందుకు కొన్ని సంఘాలు ఆమెపై తీవ్ర విమర్శలు చేశాయి, బెదిరింపులకు పాల్పడ్డాయి. కానీ దీపికా మాత్రం అన్నీ ధైర్యంగా ఎదుర్కొంది.

Image may contain: 1 person, sitting and indoor

 ప్రస్తుతం దీపికా యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న 'చాపక్‌' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. 2ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. ఇందులో లక్ష్మీ అగర్వాల్‌ పాత్రలో దీపిక పదుకునె నటిస్తోంది. అంతేకాదు, ఈ సినిమాతో దీపిక నిర్మాతగానూ మారారు. మేఘనా గుల్జార్‌ ‘చాపక్‌’కు దర్శకత్వం వహిస్తున్నారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle