newssting
BITING NEWS :
*దిశ ఘటన మరువక ముందే మరో విషాదం... ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి*హైదరాబాద్‌ టీ-20లో టీమిండియా ఘన విజయం.. వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టిన భారత జట్టు *హైదరాబాద్‌: ఎన్‌కౌంటర్‌ ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ.. నిందితుల మృతహాలను ఈ నెల 9 వరకు భద్రపరచాలన్న హైకోర్టు... 9న ఉదయం 10.30 గంటలకు విచారణ *కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.*నెల్లూరు నగరం మాఫియాలకు అడ్డగా మారింది: వైకాపా నేత, ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి*చింతపల్లిలో దారుణం.. కుక్కలకు బలయిన శిశువు *కర్నూలు: ఉల్లి కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన*ఇవాళ జార్ఖండ్ లో రెండవ విడత పోలింగ్ *దిశ నిందితులు కరుడుగట్టిన నేరస్తులు : సీపీ సజ్జనార్

‘జస్టిస్ ఫర్ దిశా’ ఘటనపై తల్లిడిల్లిన బాలీవుడ్

02-12-201902-12-2019 12:26:03 IST
2019-12-02T06:56:03.157Z02-12-2019 2019-12-02T06:55:58.383Z - - 07-12-2019

‘జస్టిస్ ఫర్ దిశా’ ఘటనపై తల్లిడిల్లిన బాలీవుడ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శంషాబాద్ బాధితురాలి పేరు మార్చారుపోలీసు అధికారులు.ఇకనుంచి ఆమె పేరును జస్టిస్ ఫర్ దిశా అని పిలవాలని సూచించారు సీపీ సజ్జనార్. ఇదిలా ఉంటే. బాలీవుడ్ ప్రముఖులు కూడా దిశాకు జరిగినయ అన్యాయం, హత్యాచారం పై ఘాటుగా స్పందించారు. రాంగోపాల్ వర్మ ఈ దారుణానికి పాల్పడ్డవారు పిచ్చికుక్కలతో సమానమని, అలాంటి వారిని చంపాలని డిమాండ్‌ చేయడం సమయం వృధా చేయడమే అన్నారు. మహిళలకు ఎలా రక్షణ కల్పించాలనే అంశంపై సమయం కేటాయించాలని, వారిని చంపేయడం, తగులబెట్టడం సరైంది కాదన్నారు. వారిని ప్రశ్నించడం, ఎంక్వయిరీ చేయడం వంటి అంశాలను టీవీల్లో ప్రసారం చేయాలని సూచించారు వర్మ. 

సైకియాట్రిస్ట్‌లు, సోషల్‌ సైంటిస్ట్‌లు వాళ్లను ప్రశ్నించడం ద్వారా వాళ్ళు ఎందుకలా మారిపోయారో, వారిలో రాక్షస నేర ప్రవృత్తి ఎలా వచ్చిందో తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు వర్మ. సల్మాన్‌ ఖాన్‌, షబనా అజ్మీ, వరుణ్‌ ధావన్‌ సహా బాలీవుడ్‌ ప్రముఖులు ఈ దారుణ ఘటనపై స్పందించారు. బేటీ బచావో కేవలం ప్రచార నినాదంగా పరిమితం కాకూడదని సల్మాన్‌ ఖాన్‌ ట్వీట్‌ చేశారు.

సమాజంలో ముసుగులతో సైతాన్లు తిరుగుతున్నాయని, అమాయక యువతి ప్రాణాలు కోల్పోతూ ఎదుర్కొన్న వేధింపులు, బాధ మనకు కనువిప్పు కలగాలన్నారు సల్మాన్ ఖాన్.ఈ దారుణానికి ఒడిగట్టిన ద్రోహులను కఠినంగా శిక్షించాలని నటి రిచా చద్దా డిమాండ్‌ చేశారు.

మహిళలపై జరుగుతున్న ఇంతటి ఘోరమయిన నేరాలను ఊహించేందుకే భయం వేస్తోందన్నారు యామీ గౌతమ్. దేశవ్యాప్తంగా మహిళలకు భద్రత, స్వేచ్ఛగా తిరిగే వాతావరణం కలిగించాలని బాలీవుడ్ ప్రముఖులు సూచించారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle