newssting
BITING NEWS :
*హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో కారు బీభత్సం. అదుపుతప్పి హోటల్ లోకి దూసుకెళ్లిన కారు. తప్పిన ప్రమాదం, కారు వదలి పరారైన యువకులు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లుగా అనుమానం * అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న ట్రంప్. ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా మొతేరా స్టేడియానికి ట్రంప్. మధ్యాహ్నం 12:30 గంటలకు నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం*విశాఖ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌పై స్పందించిన నేవీ..మిలీనియం టవర్స్‌లో సచివాలయం పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం*జనవరి 10న అమరావతి రైతుల మీద జరిగిన లాఠీఛార్జ్‌పై విచారణ ప్రారంభం..హైకోర్టు ఆదేశాల మేరకు తుళ్లూరులో విచారణ ప్రారంభించిన పోలీసులు..గుంటూరు అడిషనల్‌ ఎస్పీ స్వామిశేఖర్‌ నేతృత్వంలో కొనసాగుతున్న ఎంక్వైరీ *సికింద్రాబాద్ : బోయిన్ పల్లిలోనీ ఓ కెమికల్ గో డౌన్ లో భారీ అగ్నిప్రమాదం*చైనాలో 2400 పైగా చేరిన కోవిద్ 19 వైరస్ మృతులు. 78 వేలకు చేరిన వైరస్ బాధితుల సంఖ్య. ఇటలీలో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు మృతి

జబర్దస్త్ అభిమానులకు అనసూయ షాక్

14-02-202014-02-2020 09:42:18 IST
Updated On 14-02-2020 13:41:32 ISTUpdated On 14-02-20202020-02-14T04:12:18.982Z14-02-2020 2020-02-14T04:12:14.535Z - 2020-02-14T08:11:32.166Z - 14-02-2020

జబర్దస్త్ అభిమానులకు అనసూయ షాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీరియస్ అంశాల కంటే కామెడీ, ఎంటర్టైన్ మెంట్ కే జనం ఓటేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సినిమాల్లో అయినా, బుల్లితెర షోలలో అయినా కామెడీకి పెద్ద పీట వేస్తున్నారు. తెలుగు టెలివిజన్ రంగంలో విశేష ఆదరణని సంపాదించుకుంది జబర్దస్త్ షో. తిరుగులేని  పాపులారిటీని సంపాదించుకుని దూసుకుపోతోంది. ఈ షో నుంచి నవ్వుల బాబు నాగబాబుతో సహా పలువురు టీం లీడర్స్ బయటకు వెళ్ళినప్పటికీ ఈ షోకి మాత్రం ఎక్కడ కూడా క్రేజ్ తగ్గకపోవడం విశేషం.

నాగబాబు స్థానంలో వారానికో పాపులర్ సెలబ్రిటీని తీసుకువచ్చి షోని రక్తికట్టిస్తున్నారు. ఈ షోకి యాంకర్ గా వ్యవహరిస్తోంది అనసూయ. గ్లామరస్ గా కనిపించడమే కాదు, అప్పుడప్నుడు షోలో స్కిట్లు చేస్తూ తెగ నవ్విస్తోంది అనసూయ. లక్షలాదిమంది యూట్యూబ్ లో ఈ షోని వీక్షిస్తున్నారు. తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలో జబర్దస్త్ షో నుంచి యాంకర్ అనసూయ తప్పుకుంటోందని ప్రచారం సాగుతోంది. 

సినిమాల కారణంగా అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తోంది అనసూయ. తాజాగా ఆమె ఈ షో నుంచి విరామం తీసుకోబోతోందని, సినిమాల్లో బిజీ అయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి. అనసూయ జబర్దస్త్ షో పాటు జీ తెలుగులో ప్రసారం అయ్యే లోకల్ గ్యాంగ్ లో జడ్జిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

జబర్దస్త్ నిర్వాహకుల కండిషన్స్ ప్రకారం షోలో మెయిన్ లీడ్స్ అయిన వారు వేరే కామిడీ షోలో కనిపించేందుకు వీలులేదని నియమాలు విధించారు. ఈ కండిషన్స్ తో సమస్య వచ్చినందుకే నాగబాబుతో సహా పలువురు జబర్దస్త్ షో నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలోనే అనసూయ కూడా అప్పట్లోనే అదిరింది షో కి వెళ్లిపోనుందని వార్తలు వచ్చాయి. కానీ అలా జరగలేదు. జీ టీవీ షోలో కనిపిస్తున్న అనసూయను తప్పించేందుకు రంగం సిద్ధం అయింది. 

జబర్దస్త్ షో నుంచి పూర్తిగా అనసూయని తప్పించడానికి రంగం సిద్ధం అయింది. అనసూయ ప్లేస్ లో మాధవీలతని తీసుకోనున్నారు. అనసూయ వెళ్లిపోతే మాధవీలత ఈ షోని ఎలా రక్తికట్టిస్తుందో చూడాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle