newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

చిరు మూవీలో ఐష్.. అదిరిపోయే అప్ డేట్

11-07-201911-07-2019 15:53:48 IST
Updated On 12-07-2019 12:22:38 ISTUpdated On 12-07-20192019-07-11T10:23:48.857Z11-07-2019 2019-07-11T10:23:47.190Z - 2019-07-12T06:52:38.454Z - 12-07-2019

చిరు మూవీలో ఐష్.. అదిరిపోయే అప్ డేట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సై సైరా నర్సింహారెడ్డి అంటూ ప్రస్తుతం షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తన తర్వాత సినిమాకి రంగం సిద్ధం చేస్తున్నాడు. కొరటాల శివ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి ఒక సామాజిక అంశంతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ ని సెలక్ట్ చేస్తోంది చిత్రయూనిట్.

ఇందులో భాగంగానే ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారని తీసుకున్నట్టుగా  వార్తలు వినిపించాయి. ఈ సినిమాలో హీరో పాత్రతో పాటు మరో హీరోయిన్ పాత్రకి కూడా చాలా ప్రాముఖ్యత వుంటుందట. అందువలన ఐశ్వర్యరాయ్ అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని చరణ్ దగ్గర కొరటాల వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో కొరటాల ఇప్పటికే ఐశ్వర్యరాయ్ కు స్టోరీ చెప్పాడని ఆమె అంగీకారం కోసం చిత్ర యూనిట్ వెయిట్ చేస్తోంది. 

ఇక ఈ సినిమా కోసం కొరటాల శివ పూర్తి స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడని, ఆగష్టు లేదా సెప్టెంబర్ నెలల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోపక్కన ఆగష్ట్ 15వ తేదిన సైరా నర్సింహారెడ్డి సినిమాకి సంబంధించిన ఒక ట్రైలర్ ని విడుదల చేయబోతోంది సైరా టీమ్.

సైరా సినిమాని అక్టోబర్ 2వ తేదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సురేందరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, కిచ్చసుదీప్ లు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలవబోతున్నారు. సైరాలో కూడా చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle