newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

చిరు ఇంట్లో తలసాని భేటీ.. సినిమా షూటింగుల సాధ్యాసాధ్యాలపై చర్చ

21-05-202021-05-2020 13:54:20 IST
Updated On 21-05-2020 14:50:41 ISTUpdated On 21-05-20202020-05-21T08:24:20.125Z21-05-2020 2020-05-21T08:24:00.621Z - 2020-05-21T09:20:41.227Z - 21-05-2020

చిరు ఇంట్లో తలసాని భేటీ..  సినిమా షూటింగుల సాధ్యాసాధ్యాలపై చర్చ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా లాక్ డౌన్ సందర్భంగా సినిమా షూటింగులు ఆగిపోయాయి. కార్మికులు రోడ్డున పడ్డారు. సినిమా ప్రముఖులు వారిని ఆదుకుంటున్నారు. ఇదిలా ఉంటే జూబ్లిహిల్స్ లోని ప్రముఖ నటుడు చిరంజీవి నివాసంలో సినీ ప్రముఖుల తో సమావేశమైన  సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు అల్లు అరవింద్,సురేష్ బాబు, సి.కళ్యాణ్,దిల్ రాజు, జెమిని కిరణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకులు రాజమౌళి, వ్.వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్ శంకర్, కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు.

చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులతో భేటీ తర్వాత తెలంగాణ మంత్రి తలసాని మాట్లాడారు. సినిమా పరిశ్రమ ఇబ్బందుల గురించి సీఎం కేసీయార్ కు వివరిస్తానని, సాధ్యమయినంత త్వరగా షూటింగులు ప్రారంభించే అవకాశాలు పరిశీలిస్తామన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుని షూటింగులు, థియేటర్ల పునఃప్రారంభంపై ముందుకు వెళ్తామని తెలిపారు. షూటింగుల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించామని చెప్పారు.

సినిమాల చిత్రీకరణపై ప్రాధాన్యాతలు గుర్తించాలని, వాటిపై మరింత చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మాక్ షూటింగుల గురించి చర్చిస్తామన్నారు. కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్‌తో చిరంజీవి కమిటీ ఏర్పాటు చేసి సినీ కార్మికులను ఆదుకున్నారని ఆయన గుర్తు చేశారు. మొత్తం 14 వేల మంది సినీ కార్మికులను ఆదుకున్నారని అన్నారు. ప్రభుత్వం కూడా వారిని ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు.

లాక్ డౌన్ తర్వాత షూటింగ్ ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు పరిశీలిస్తామన్నారు. లాక్ డౌన్ ముగిసేలోపు కరోనాపై జాగ్రత్తలు పాటిస్తూ మాక్ షూటింగులు చేస్తామన్నారు. సినీ పరిశ్రమపట్ల ప్రభుత్వం సానుకూలంగా వుంది. త్వరగా ఈ సంక్షోభం నుంచి బయటపడాలన్నారు. 

హాట్ ఆంటీ వంద ముద్దుల క‌థ‌

హాట్ ఆంటీ వంద ముద్దుల క‌థ‌

   a day ago


చెత్తగా సల్మాన్ సినిమా.. ప్రభుదేవాను ఏకంగా డైరెక్షన్ మానేయమంటున్నారు

చెత్తగా సల్మాన్ సినిమా.. ప్రభుదేవాను ఏకంగా డైరెక్షన్ మానేయమంటున్నారు

   17 hours ago


ఆర్.ఆర్.ఆర్. థియేటర్ల లోనే చూడాలి.. ఆడియన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తారు: తారక్

ఆర్.ఆర్.ఆర్. థియేటర్ల లోనే చూడాలి.. ఆడియన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తారు: తారక్

   13-05-2021


బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ

బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ

   12-05-2021


కన్నుమూసిన టిఎన్ఆర్.. ప్రముఖుల సంతాపం

కన్నుమూసిన టిఎన్ఆర్.. ప్రముఖుల సంతాపం

   10-05-2021


విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్

విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్

   09-05-2021


కరోనా బారిన పడిన కంగనా.. వెంటాడుతున్న కేసులు కూడా..!

కరోనా బారిన పడిన కంగనా.. వెంటాడుతున్న కేసులు కూడా..!

   08-05-2021


ఖానా ఖాతాహై.. పానీ పీతే హై కాదు

ఖానా ఖాతాహై.. పానీ పీతే హై కాదు

   08-05-2021


హీరో సిద్ధార్థను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనవసరంగా గెలికారా..?

హీరో సిద్ధార్థను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనవసరంగా గెలికారా..?

   07-05-2021


రవితేజ ‘ఖిలాడి’ కి కరోనా బ్రేక్

రవితేజ ‘ఖిలాడి’ కి కరోనా బ్రేక్

   05-05-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle