newssting
BITING NEWS :
*దిశ ఘటన మరువక ముందే మరో విషాదం... ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి*హైదరాబాద్‌ టీ-20లో టీమిండియా ఘన విజయం.. వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టిన భారత జట్టు *హైదరాబాద్‌: ఎన్‌కౌంటర్‌ ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ.. నిందితుల మృతహాలను ఈ నెల 9 వరకు భద్రపరచాలన్న హైకోర్టు... 9న ఉదయం 10.30 గంటలకు విచారణ *కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.*నెల్లూరు నగరం మాఫియాలకు అడ్డగా మారింది: వైకాపా నేత, ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి*చింతపల్లిలో దారుణం.. కుక్కలకు బలయిన శిశువు *కర్నూలు: ఉల్లి కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన*ఇవాళ జార్ఖండ్ లో రెండవ విడత పోలింగ్ *దిశ నిందితులు కరుడుగట్టిన నేరస్తులు : సీపీ సజ్జనార్

చిరంజీవి-కొరటాల మూవీ ఇంట్రస్టింగ్ అప్డేట్..

02-12-201902-12-2019 14:50:59 IST
2019-12-02T09:20:59.429Z02-12-2019 2019-12-02T09:20:54.790Z - - 07-12-2019

చిరంజీవి-కొరటాల మూవీ ఇంట్రస్టింగ్ అప్డేట్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తొలి తెలుగు తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథగా వచ్చిన 'సైరా' సినిమాతో మెగాస్టార్ చిరంజీవి సినీ అభిమానులను మరోమారు అలరించాడు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 105 కోట్ల షేర్ వసూల్ చేసి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసిన చిత్రాలలో 'సైరా' మూడవ స్థానంలో నిలిచింది.

ఈ జాబితాలో 'బాహుబలి-2', 'బాహుబలి-1' మొదటి రెండు స్థానాలలో ఉన్నాయి. ఆ సినిమా పూర్తి కాగానే తన 152వ చిత్రాన్ని వరుస హిట్స్ సాధిస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. దీంతో ఈ సినిమా షూటింగ్ కోసం మెగా అభిమానులు ఎదురుచూశారు.

కానీ ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కలేదు. దీంతో మెగా అభిమానులు నిరాశలో పడిపోయారు. వారి బాధను డబల్ చేస్తూ గత కొద్దీ రోజులుగా ఫిలిం వర్గాలలో కొన్ని కథనాలు ప్రచారం జరిగాయి. దర్శకుడు కొరటాలతో చిత్ర యూనిట్ కు చెడిందని అందుకే ఈ సినిమా ఆగిపోనుందనే వార్తలు వినబడ్డాయి. కానీ ఆ వార్తలకు చెక్ చెప్పేలా కొరటాల శివ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. 

'ఆర్ఆర్ఆర్' సినిమా తరహాలోనే కొరటాల మీడియా సమావేశంలో క్యాస్టింగ్, స్టోరీ లైన్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా 'మెలోడీ బ్రహ్మ' మణిశర్మను తీసుకున్నారు. ఇప్పటికే మణిశర్మ మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు.

ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ కు వేదికగా బ్యాంకాక్ నిలిచింది. ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ లో మణిశర్మతో బాటు చిరంజీవి, కొరటాల పాల్గొంటున్నారు. మణిశర్మ-చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ ఆల్బమ్స్ లాగా ఈ సినిమా ఆల్బమ్ కూడా ఉండనుందని సమాచారం. దాదాపు 14 సంవత్సరాల తరువాత చిరంజీవితో పనిచేసే అవకాశం రావడంతో మణిశర్మ కూడా అంతే ఉత్సాహంగా పని చేస్తున్నాడని తెలుస్తోంది.

చిరంజీవి అభిమానులకు ఇచ్చిన హామి మేరకు ఈ సినిమాలో మాస్ సాంగ్స్ ఉండనున్నాయి. గోవింద, ఆచార్య అనే రెండు పాత్రలలో నటించనున్న చిరంజీవికి హీరోయిన్ గా త్రిషను ఇప్పటికే ఎంపిక చేశారు. మరో హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ అన్వేషణలో ఉంది. రెండో హీరోయిన్ గా 'ఇలియానా', 'ఐశ్వర్య రాయ్' పేర్లను చిత్ర యూనిట్ పరిశీలిస్తోందని సమాచారం. నక్సలైట్ పాత్ర 'గోవింద' కోసం చిరంజీవి వెయిట్ తగ్గే పనిలో ఉన్నాడు.

తన మేక్ ఓవర్ లో మార్పులు కోసం చిరంజీవి టైం తీసుకోవడంతో షూటింగ్ ఆలస్యమవుతోందని చిత్ర యూనిట్ నుండి సమాచారం అందుతోంది. డిసెంబర్ చివరి వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 'గోవిందా ఆచార్య' అనే టైటిల్ ను ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ పరిశీలిస్తోంది. కొణిదెల ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ సినిమాని 2020 ఆగష్టు 14న విడుదల చేస్తున్నారు. 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle