newssting
BITING NEWS :
*ఇవాళ గురుపూర్ణిమ.. చంద్రగ్రహణం **దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

చిక్కుల్లో శ్యామ్ కె నాయుడు .... బెయిల్ మంజూరు, రద్దు

30-06-202030-06-2020 10:06:57 IST
Updated On 30-06-2020 10:30:52 ISTUpdated On 30-06-20202020-06-30T04:36:57.533Z30-06-2020 2020-06-30T04:36:50.153Z - 2020-06-30T05:00:52.820Z - 30-06-2020

చిక్కుల్లో శ్యామ్ కె నాయుడు .... బెయిల్ మంజూరు, రద్దు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సినిమా రంగంలో చిన్న వివాదం అయినా మీడియా పబ్లిసిటీతో పెద్ద రచ్చ రాజేస్తుంది. తనను మోసం చేశాడంటూ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుపై నటి సాయి సుధ హైదరాబాద్‌లోని ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై చాలాకాలం కేసు నమోదు కాలేదు. చివరకు కేసు నమోదు చేసిన పోలీసులు శ్యామ్ కె నాయుడుని అరెస్ట్ చేశారు. అయితే, రిమాండ్‌కు తరలించిన రెండు రోజులకే శ్యామ్ కె నాయుడు బెయిల్ మీద బయటకు వచ్చారు. 

శ్యామ్ కె నాయుడుపై ఈ సందర్భంగా అనేక విమర్శలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా బెయిల్ రావడంపై బాధితురాలు సాయి సుధ మండిపడుతోంది. సాయి సుధతో తాను రాజీ కుదుర్చుకున్నట్టు నాంపల్లి కోర్టులో శ్యామ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో బెయిల్ మంజూరైంది. ఈ కథ అంతటితో ఆగలేదు.  శ్యామ్‌కు బెయిల్ ఎలా ఇస్తారంటూ సాయి సుధ కోర్టుకెక్కారు. తాను రాజీపడినట్టు శ్యామ్ ఇచ్చిన పత్రాల్లో తన సంతకం ఫోర్జరీ జరిగిందని కోర్టుకు సుధ తెలపడంతో మళ్లీ వివాదం మొదటికొచ్చింది.

తన సంతకం, బెయిల్ కోసం దరఖాస్తు చేసిన పేపర్లపై ఉన్న సంతకాలను కోర్టులో సవాల్ చేయడంతో శ్యామ్ బెయిల్ రద్దయింది. దీంతో శ్యామ్ కె నాయుడు పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఆయన బెయిల్‌ను కూడా రద్దు చేసింది. అంతేకాకుండా, శ్యామ్ కె నాయుడుపై ఫోర్జరీ కేసును నమోదు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. బెయిల్ రావడంతో బయటకు వద్దామని భావించిన శ్యామ్ కె నాయుడు ఆటలు సాగలేదు.

2015 నుంచి శ్యామ్ కె నాయుడుతో సహజీవనం చేస్తున్నానని, తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడని అందుకు సాక్ష్యాలున్నాయని సాయిసుధ పోలీసులకు ఫిర్యాదుచేసింది.  శ్యామ్ అన్నయ్య, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు తమకు పెళ్లి చేయిస్తానని మాటిచ్చారన్నారు. పెళ్లి గురించి అడిగితే పట్టించుకోవడం లేదని ఆమె వాపోయింది.  శ్యామ్ కె నాయుడు, సుధను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు పిలిచిన పోలీసులు వారిద్దరి మధ్య సఖ్యత కుదుర్చేందుకు ప్రయత్నించిన ఫలితం లభించలేదు. దీంతో శ్యామ్ కె నాయుడుని అరెస్ట్ చేశారు. తాజాగా బెయిల్ పిటిషన్ కోసం సంతకం ఫోర్జరీ చేయడంతో చీటింగ్ కేసుని కూడా ఎదుర్కోవలసి వస్తోంది. త్వరలో శ్యామ్ కె నాయుడిని పోలీసులు జైలుకి పంపనున్నారు. 

మర్డర్ మూవీ...  ప్రణయ్ తండ్రి ఫిర్యాదు....వర్మపై ఎస్సీఎస్టీ కేసు

మర్డర్ మూవీ... ప్రణయ్ తండ్రి ఫిర్యాదు....వర్మపై ఎస్సీఎస్టీ కేసు

   10 hours ago


ట్విట్టర్లో మహేష్ దూకుడు.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్

ట్విట్టర్లో మహేష్ దూకుడు.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్

   04-07-2020


హాట్ ఫోటోలతో దుమ్మురేపుతున్న బిగ్ బాస్ బ్యూటీ

హాట్ ఫోటోలతో దుమ్మురేపుతున్న బిగ్ బాస్ బ్యూటీ

   04-07-2020


పసిపిల్లలపై అత్యాచారం.. హత్యలా.. జాతి వినాశనం ఖాయం.. సాయి పల్లవి ఆక్రోశం

పసిపిల్లలపై అత్యాచారం.. హత్యలా.. జాతి వినాశనం ఖాయం.. సాయి పల్లవి ఆక్రోశం

   04-07-2020


రాంచరణ్ లుక్ చూస్తే షాకవ్వాల్సిందే!

రాంచరణ్ లుక్ చూస్తే షాకవ్వాల్సిందే!

   03-07-2020


మరోసారి విక్రమ్ కుమార్ మూవీలో సమంత?

మరోసారి విక్రమ్ కుమార్ మూవీలో సమంత?

   03-07-2020


కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఇకలేరు

కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఇకలేరు

   03-07-2020


ఏపీ సీఎం జగన్‌ని పొగిడేసిన డైరెక్టర్ పూరీ

ఏపీ సీఎం జగన్‌ని పొగిడేసిన డైరెక్టర్ పూరీ

   02-07-2020


హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సోనాక్షి

హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సోనాక్షి

   02-07-2020


హీరోయిన్లే కాదు దర్శకులూ వారికి టార్గెట్టే

హీరోయిన్లే కాదు దర్శకులూ వారికి టార్గెట్టే

   02-07-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle