newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

చందమామను చూపించావు సుశాంత్.. ఎలా మర్చిపోను.. శ్రద్ధా కపూర్ నివాళి

19-06-202019-06-2020 08:05:32 IST
Updated On 19-06-2020 11:25:56 ISTUpdated On 19-06-20202020-06-19T02:35:32.318Z19-06-2020 2020-06-19T02:35:28.624Z - 2020-06-19T05:55:56.523Z - 19-06-2020

చందమామను చూపించావు సుశాంత్.. ఎలా మర్చిపోను.. శ్రద్ధా కపూర్ నివాళి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హీరో సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ ఎక్కడైనా.. ఎప్పుడైనా పాటపాడుతూ అందుకనుగుణంగా డ్యాన్స్‌ చేసేవాడని.. ప్రతిరోజూ చాలా హుషారుగా ఉండేవాడని అంటున్నారు హీరోయిన్‌ శ్రద్ధాకపూర్‌. ‘చిచోరే’లో తన సహనటుడైన సుశాంత్‌తో ఉన్న జ్ఞాపకాలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. సుశాంత్‌ మానవత్వం, తెలివి, జీవితంపై ఆసక్తిగల వ్యక్తి అని ఆమె గుర్తుచేసుకున్నారు. అంతేకాక  టెలిస్కోప్‌ నుంచి సుశాంత్‌ తనకు చందమామను చూపించాడని.. ఆ అనుభవాన్ని ఎప్పటికి మర్చిపోలేనన్నారు శ్రద్ధ. 

ఈ క్రమంలో ‘ఏమి జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. కానీ, ఇది చాలా కష్టంగా అనిపిస్తున్నది. అంతా శూన్యంలా తోస్తోంది.. సుశాంత్‌.. డియర్‌ సుశ్‌..’ అంటూ శ్రద్ధ వ్యాఖ్యానించారు. 2019లో విడుదలైన చిచోరే సినిమాలో శ్రద్ధాకపూర్, సుశాంత్‌ సరసన నటించిన సంగతి తెలిసిందే. 

కాగా, సినిమా షూటింగ్‌ అప్పుడు సుశాంత్‌ను తాను సెట్‌లో గమనిస్తుండేదానినని, అతడితో మాట్లాడేందుకు ఇష్టపడేదానినని శ్రద్ధా కపూర్‌ గుర్తుచేసుకున్నారు. తాము ఎక్కువగా విశ్వం, లైఫ్‌ ఫిలాసఫీల గురించి చర్చించుకునేవాళ్లమని ఆమె తెలిపారు. అతనితో ఉన్నంతసేపు గమ్మత్తైన ప్రదేశంలో ఉన్నట్లు అనిపించేదన్నారు. పని విషయంలో సుశాంత్‌ ఎంతో అంకితభావం ప్రదర్శించేవాడని తెలిపారు. తనతో పాటు తన చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించేవాడని గుర్తు చేసుకున్నారు. 

ఒకసారి ‘చిచోరే’ టీమ్‌ అంతా సుశాంత్‌ ఇంటికి వెళ్లారని.. అక్కడి ప్రకృతి సౌందర్యానికి తాము ఫిదా అయ్యామన్నారు. సుశాంత్‌ తనకు తానే సాటి అని తెలిపారు. మెసేజ్‌తో పాటు చిచోరే షూటింగ్‌ సమయంలో తీసుకున్న ఫోటోని, విన్సెంట్ వాన్ గోహ్ ‘స్టారి నైట్’ ఫోటోతో కలిపి ఉన్న చిత్రాన్ని పోస్ట్‌ చేశారు. శ్రద్ధా కపూర్‌ మెసేజ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. 

తనచుట్టూ ఉన్న వారిని ఎప్పుడూ సంతోషంలో ఉంచడానికి ప్రయత్నించే సుశాంత్ చిరునవ్వును ఎన్నడూ మర్చిపోలేను. షూటింగ్ సమయంలో అంతరిక్షం గురించి, వివిధ తత్వశాస్త్రవేత్తల గురించి అతడు చెబుతున్న విషయాలు నాముందు ఒక మంత్రజగత్తును సృష్టించి వదిలేవి. టెలిస్కోప్ నుంచి చందమామను చూపించినప్పుడు నాకు మాటలు రాలేదు. అంతరిక్ష పదార్థాన్ని అంత సన్నిహితంగా ఎన్నడూ చూడలేదు. తన అనుభూతిని మాకందరికీ పంచిపెట్టాలని సుశాంత్ ప్రయత్నించేవాడు అంటూ చిచ్చోర్ చిత్ర షూటింగ్ సమయం నాటి సుశాంత్ జ్ఞాపకాలను ఆ చిత్రంలో హీరోయిన్ పాత్రధారి శ్రద్ధా కపూర్ వివరంగా పంచుకున్నారు.

సాహాలో ప్రభాస్‌ సరసన కథానాయికగా నటించి మంచి పేరు సంపాదించిన శ్రద్ధాకపూర్ వెంటనే చిచ్చోర్ పూర్తి చేసి మంచి హిట్‌ను సాధించడం విశేషం.

ఐశ్యర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్.. బంగ్లా అంతా కంటైన్మెంట్ జోన్!

ఐశ్యర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్.. బంగ్లా అంతా కంటైన్మెంట్ జోన్!

   14 hours ago


కీర్తి, రష్మికలకు సమంత ఛాలెంజ్ .. మామ నాగ్‌తో కలిసి మొక్కలకు నీళ్ళు

కీర్తి, రష్మికలకు సమంత ఛాలెంజ్ .. మామ నాగ్‌తో కలిసి మొక్కలకు నీళ్ళు

   21 hours ago


అనుపమ్ ఖేర్ ఫ్యామిలీకి కరోనా సెగ

అనుపమ్ ఖేర్ ఫ్యామిలీకి కరోనా సెగ

   a day ago


ముంబైలో కరోనా టెర్రర్.. ఉలిక్కిపడ్డ బాలీవుడ్

ముంబైలో కరోనా టెర్రర్.. ఉలిక్కిపడ్డ బాలీవుడ్

   12-07-2020


బిగ్ బికి కోవిడ్ పాజిటివ్.. కొడుకు అభిషేక్ కి కూడా

బిగ్ బికి కోవిడ్ పాజిటివ్.. కొడుకు అభిషేక్ కి కూడా

   12-07-2020


అది ప్రభాస్‌కే సాధ్యం.. రాధేశ్యామ్ రికార్డుల మోత

అది ప్రభాస్‌కే సాధ్యం.. రాధేశ్యామ్ రికార్డుల మోత

   11-07-2020


పెళ్ళిపై దృష్టి మళ్లిందా...రకుల్ ప్లానేంటి?

పెళ్ళిపై దృష్టి మళ్లిందా...రకుల్ ప్లానేంటి?

   11-07-2020


ఓటీటీలో విడుదలైనా తగ్గని ‘కీర్తి’.. చేతినిండా సినిమాలు

ఓటీటీలో విడుదలైనా తగ్గని ‘కీర్తి’.. చేతినిండా సినిమాలు

   10-07-2020


ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగే.. రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ అదుర్స్

ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగే.. రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ అదుర్స్

   10-07-2020


వర్మ మరో సెన్సేషన్... పవర్ స్టార్ ఫస్ట్ లుక్ విడుదల

వర్మ మరో సెన్సేషన్... పవర్ స్టార్ ఫస్ట్ లుక్ విడుదల

   09-07-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle