newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

గ్లామర్.. లక్.. కలిస్తే ఐశ్వర్యా రాజేష్

21-07-201921-07-2019 09:59:18 IST
Updated On 21-07-2019 10:03:05 ISTUpdated On 21-07-20192019-07-21T04:29:18.569Z21-07-2019 2019-07-21T04:29:06.253Z - 2019-07-21T04:33:05.346Z - 21-07-2019

గ్లామర్.. లక్.. కలిస్తే ఐశ్వర్యా రాజేష్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈ రోజుల్లో హీరోయిన్ల‌కు ఒక‌టి రెండు అవ‌కాశాలు వ‌స్తేనే అబ్బో అంటున్నారు. అలాంటిది ఒకేసారి డ‌జ‌న్ సినిమాల్లో న‌టించే అవ‌కాశం వ‌స్తే ఎలా ఉంటుందో ఒక్క‌సారి ఊహించుకోండి. స్టార్ హీరోయిన్ల‌కు కూడా ఈ ఫీట్ అద్భుత‌మే.

అయితే ఇప్పుడు ఈ అద్భుత‌మే ఓ హీరోయిన్ చేస్తూ ఇండస్ట్రీ వర్గాలకు షాక్ కు గురి చేసింది. ఆమె ఎవరో కాదు ఐశ్వ‌ర్యా రాజేష్. ఇండ‌స్ట్రీలో ఎవ‌రి టైమ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ‌రూ ఊహించ‌లేరు. 

Image may contain: 1 person, standing

ఇప్పుడు ఐశ్వ‌ర్య రాజేష్ విష‌యంలో ఇదే జ‌రుగుతోంది. గ్లామ‌ర్ ఉన్నా కూడా అదృష్టం క‌లిసిరాక కొన్నేళ్ల పాటు వెలుగులోకి రాలేదు ఐశ్వ‌ర్య‌.కానీ వ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని దుమ్మురేపుతోంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడు త‌మిళ‌నాట స్టార్ హీరోయిన్ అయిపోయింది. 

అక్క‌డ వ‌ర‌స సినిమాల‌తో బిజీ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఏకంగా 11 సినిమాలున్నాయి. ఇదే ఇప్పుడు సంచ‌ల‌నం. ఇప్ప‌టికే 4 త‌మిళ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజీలో ఉండ‌గా.. మ‌రోవైపు నాలుగు సినిమాల‌ను కొత్త‌గా ప‌ట్టాలెక్కించ‌డానికి సిద్ధంగా ఉంది.

ఇవే కాకుండా తెలుగులో కౌస‌ల్యా కృష్ణ‌మూర్తి, విజ‌య్ దేవ‌ర‌కొండ క్రాంతిమాధ‌వ్ సినిమాల్లో కూడా న‌టిస్తుంది. ఇక కమల్ హాసన్ భారతీయుడు 2లో కూడా ఐశ్వర్య రాజేష్ ఓ హీరోయిన్‌గా ఎంపికైంది. ఐశ్వ‌ర్య తెలుగ‌మ్మాయే.

ఈమె మూలాలు తెలుగులోనే ఉన్నాయి. హాస్య న‌టి శ్రీ‌ల‌క్ష్మి మేన‌కోడ‌లు. ఒక‌ప్పుడు తెలుగులో వ‌ర‌స సినిమాలు చేసి.. 38 ఏళ్ల వ‌య‌సులోనే క‌న్నుమూసిన న‌టుడు రాజేష్ కూతురే ఈ ఐశ్వ‌ర్య రాజేష్. మొత్తానికి మ‌న తెలుగ‌మ్మాయి కోలీవుడ్ మార్కెట్‌లో దుమ్మురేపుతోంది.

Image may contain: 1 person, closeup


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle