newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

గ్యాంగ్ లీడర్ కోసం నాని నయా ట్రెండ్

21-08-201921-08-2019 11:20:49 IST
2019-08-21T05:50:49.193Z21-08-2019 2019-08-21T05:50:46.396Z - - 20-09-2019

గ్యాంగ్ లీడర్ కోసం నాని నయా ట్రెండ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నేచురల్ స్టార్‌గా పేరు తెచ్చుకుని, ఆ తరువాత కమర్షియల్ పంథాలో పడి తన సహజత్వాన్నికోల్పోయిన నాని 'జెర్సీ' సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. మూస పద్దతిలో కాకుండా డిఫరెంట్ కథతో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో కూడా విభిన్నమైన కథని ఓకే చేశాడు. 'గ్యాంగ్ లీడర్' గా వస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. 

సీనియర్ నటీమణులు లక్ష్మి, శరణ్య ప్రధాన పాత్రలో పోషించిన ఈ సినిమాలో 'RX 100' హీరో కార్తికేయ నెగటివ్ రోల్ లో నటించడం విశేషం. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలోని రెండు పాటలను ఇప్పటికే విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన "హోయినా.. హోయినా" పాట కూడా మంచి రెస్పాన్స్ పట్టేసింది.  

చిత్ర యూనిట్ ఈ పాటపై ఓ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఏదైనా ట్రావెల్ చేస్తూ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ప్రయాణిస్తూ ఎవరైనా సరే ఈ లిరిక్ ని హమ్ చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేసి తనకి లింక్ చేయమన్నాడు..ఇంతకీ ఇదంతా ఎందుకా అనుకుంటున్నారా..? గ్యాంగ్ లీడర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని తన ఫ్యాన్స్ కోసం ఈ సాంగ్ ని పాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. సాంగ్ ఛాలెంజ్ అంటూ ఇప్పుడు అందరూ ఈ పాటని హమ్ చేస్తూ తెగ వీడియోలు చేసేస్తున్నారు. 

ఇలా వచ్చిన వీడియోల్లో ద బెస్ట్ వీడియో చేసిన వాళ్లని నాని ప్రత్యేకంగా కలుస్తాడట. అంతేకాదు, సినిమా యూనిట్ తో కలిసి సినిమా చూసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాడు.ఇప్పుడు నాని చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరికెందుకు ఆలస్యం.. మీరు కూడా చేయండి వీడియోని. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాని సెప్టెంబర్ 13న విడుదల చేస్తున్నారు. 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle