newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

గాడ్సేపై నాగబాబు సానుభూతి.. దేశభక్తుడని కితాబు!

20-05-202020-05-2020 15:41:22 IST
Updated On 20-05-2020 16:00:48 ISTUpdated On 20-05-20202020-05-20T10:11:22.614Z20-05-2020 2020-05-20T10:11:19.747Z - 2020-05-20T10:30:48.200Z - 20-05-2020

గాడ్సేపై నాగబాబు సానుభూతి.. దేశభక్తుడని కితాబు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మన జాతిపిత.. ప్రతి భారతీయుడు నిద్రలేచి రోజుకి ఒక్కసారైనా మన నోట్ల మీద ఆయన్ని చూడకుండా పొద్దుపోని మహాత్ముడిని కిరాతకంగా హత్యచేసి చంపారని అందరికీ తెలిసిందే. గాంధీని నాథురాం గాడ్సే అనే వ్యక్తి చంపారని.. అయన రాక్షసుడని ప్రతివ్యక్తికి విద్యార్థి దశలోనే మన టీచర్లు మన మనసులలో బలమైన ముద్రవేశారు.

కానీ అప్పుడప్పుడు గాంధీని చంపినా గాడ్సే కూడా గొప్పవాడే అని కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పటికే తమని తాము తెలివిగల వారిగా చెప్పుకొనే కొందరు ఈ తరహా వ్యాఖ్యలు చేయగా.. హిందూ మహాసభ గతంలో ఓ సందర్భంలో ఏకంగా గాడ్సేకి గుడిని కట్టేశారు. ఇక ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ పెద్ద తలకాయల ఫ్యామిలీలలో ఓ ఫ్యామిలీకి చెందిన ఒకాయన మరోసారి గాడ్సేని దేశభక్తుడని కితాబిచ్చేశారు.

మెగా అన్నదమ్ములలో నాగబాబు కొన్నేళ్లుగా వివాదాలు ఎక్కడ ఉన్నాయో తేరాపరా చూసి మరీ కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే వివాదాల పుట్ట వర్మతో సహా పలు వివాదాలలో ఫింగర్ ఎట్టిన నాగబాబుకి తాజాగా గాంధీని చంపిన గాడ్సేపై సానుభూతి పుట్టుకొచ్చింది. తాజాగా అయన పుట్టినరోజని ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఈ మెగా బ్రదర్ గాడ్సే గొప్ప దేశభక్తుడని కితాబిచ్చేశారు.

ఇదేంటి మాకెవరు గాడ్సే గొప్పోడని చెప్పలేదే అనుకుంటున్నారా? గాంధీ హత్య విషయంలో అప్పటి మీడియా నిజాలు దాచిపెట్టిందని.. ఇంకా చెప్పాలంటే అప్పటి మీడియా ప్రభుత్వ అనుకూల వాదనే వినిపించడంతోనే గాడ్సే విలన్‌గా దేశ ప్రజల్లో ముద్ర పడిపోయాడని నాగబాబు తనని తాను సమర్ధించుకున్నారు.

నిజానికి గాంధీని గాడ్సే హత్య చేయడం వల్ల అపఖ్యాతి పాలవుతానని తెలిసినా.. చంపాడంటే దానికి బలమైన కారణాలు ఉన్నాయని సానుభూతి ప్రకటించేశారు. తాను గాడ్సే మ‌ర‌ణ వాంగ్మూలం చ‌దివగా చాలా బాధ‌నిపించిందని.., గాంధీని చంప‌టం త‌ప్ప గాడ్సేకు ఎలాంటి క్రిమిన‌ల్ హిస్ట‌రీ లేదని, గాడ్సే నిజమైన దేశభక్తుడన్నారు. ఒకవేళ ఆనాడు గాడ్సే పక్కన మాట్లాడేవాళ్ళు ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు.

అయితే అసలు ఈయనకి ఇప్పుడు గాడ్సే మీద ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందా? అని విశ్లేషణలు షరామామూలే. కాగా దీనివెనుక కూడా ఓ రాజకీయ కోణం ఉందన్నది కొందరి వాదన. దేశంలో కొందరు ఆర్ఎస్ఎస్ వాదులు.. బీజేపీ నేతలు కొందరు గాడ్సేని వెనకేసుకొస్తుంటారు. ఈక్రమంలోనే గతంలో చాలా సందర్భాలలో వివాదాస్పద ప్రకటనలు కూడా బయటకొచ్చాయి. అప్పుడే బీజేపీ అధిష్టానం వారిపై తీవ్రంగా స్పందించింది. అలాంటి వ్యాఖ్యలకు సిద్ధపడితే సస్పెండ్ చేసేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరించింది.

కాగా ఇప్పుడు నాగబాబు జనసేనలో యాక్టివ్ గా ఉన్నారు. జనసేన బీజేపీతో భాగస్వామిగా ఉంది. గతంలో జనసేన ఆవిర్భావ సమయంలో గాంధీ ఫోటోను వాడుకున్నారు. కాగా ఇప్పుడు ఆ ముద్రని చెరిపేసేందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేశారన్నది కొందరి వాదన. ఇక మరికొందరైతే ఇలాంటి వ్యాఖ్యలే పబ్లిసిటీకి దగ్గరని కొందరు భావిస్తున్నారని.. నాగబాబు కూడా ఆ కోవలోకే వస్తారేమోననే వాళ్ళు ఉన్నారు. మరి ఆంతర్యమేంటో ఆ టవర్ స్టార్ కే తెలియాలి!

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle