newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

క్రిష్ నోరు మూయించేసిన బాలయ్య

11-02-201911-02-2019 13:24:06 IST
2019-02-11T07:54:06.733Z11-02-2019 2019-02-11T07:54:01.491Z - - 21-08-2019

క్రిష్ నోరు మూయించేసిన బాలయ్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
‘మణికర్ణిక’ సినిమా విడుదలైనప్పుడు దర్శకుడు క్రిష్ చేసిన హడావుడి అంతాఇంతా కాదు. దర్శకురాలిగా కంగనా తన పేరు ఎలా వేసుకుంటుందని... అలా చేసినందుకు ఆమె సిగ్గుపడాలని మండిపడ్డాడు. తాను దర్శకత్వం వహించిన 70 శాతానికి పైగా సన్నివేశాల్నే చిత్రంలో వినియోగించుకున్నారని, మిగిలిన పార్ట్‌ని క్లోజప్ షాట్‌లో కంగనా డైరెక్ట్ చేసిందని, ఆ మాత్రం దానికే డైరెక్షన్ క్రెడిట్ ఎలా తీసుకుంటుందంటూ ఉవ్వెత్తున ఎగిశాడు. ఇవిగో సాక్ష్యాలంటూ కొన్ని స్ర్కీన్‌షాట్స్‌తోనూ ట్విట్టర్‌లో నానాయాగీ చేశాడు.

ఆ సమయంలో కంగనారనౌత్ మౌనంగా ఉంది. కంగనా చెల్లెలు రంగోలి కాస్త ధీటుగానే సమాధానాలిచ్చే ప్రయత్నం చేసింది కానీ... క్రిష్ డామినేషన్ ఎక్కువగా ఉండడంతో ఆమె కౌంటర్స్ పేలలేదు. మెజారిటీ తారలు క్రిష్‌కే మద్దతు తెలపడంతో... ఆ టైంలో అతడి హవానే నడిచింది. కానీ... కంగనా మీడియా ముందుకొచ్చాక క్రిష్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడం చర్చనీయాంశంగా మారింది. క్రిష్ ఏవేవో కల్పించి చెప్తున్నాడని, తాను 70 శాతం డైరెక్ట్ చేశానని అతడు చెప్తున్న మాటల్లో నిజం లేదని, తానే ఈ చిత్రానికి దర్శకురాలినని కంగనా కుండబద్దలు కొట్టింది. అతనిపై కొన్ని వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించింది.

రిలీజ్ టైంలో అంత రచ్చ చేసిన క్రిష్... ఇప్పుడు కంగనా ఇంతలా ఆరోపణలు చేస్తున్న తరుణంలో ఎందుకు మౌనంగా ఉన్నాడని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బహుశా కంగనా చెప్తోంది నిజమేనా? క్రిష్ కేవలం క్రెడిట్స్ కొట్టేయాలని మీడియా ముందుకొచ్చి రచ్చ చేశాడా? అనే గుసగుసలు వినిపించాయి. అసలెందుకు క్రిష్ సైలెంట్‌గా ఉన్నాడనే విషయంపై ఆరాతీయగా... తెరవెనుక బాలయ్య హ్యాండ్ ఉందని ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఆయన కొన్ని సూచనలు ఇవ్వడం వల్లే... కంగనా తనపై ఆరోపణలు చేస్తున్నా, క్రిష్ మౌనంగా ఉన్నాడని ఓ ప్రచారం చక్కర్లు కొడుతోంది.

అసలు బాలయ్య ఏం చెప్పాడనేగా మీ సందేహం? ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం డిజాస్టర్‌గా నిలవడం బాలయ్యను బాధించింది. ‘మహానాయకుడు’ విషయంలోనూ అదే రిపీట్ అవ్వకూడదని ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమాలో కొన్ని మార్పులు చేయడమే కాదు... ‘మణికర్ణిక’ వివాదంపై స్పందించొద్దని సూచించారట! కంగనా కౌంటర్లపై క్రిష్ స్పందిస్తే... అది తన ‘మహానాయకుడు’ చిత్రంపై వ్యతిరేక ప్రభావం చూపుతుందేమోనన్న ఉద్దేశంతో బాలయ్య అతని నోరు మూయించేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. వీలైతే సినిమా విడుదలయ్యాక ఏమైనా చేసుకొమ్మని ఆయన క్రిష్‌కి చెప్పినట్లు తెలుస్తోంది.

అందుకే... కంగనా కౌంటర్లకు క్రిష్ స్పందించకుండా మిన్నకుండిపోయాడని తెలిసింది. ‘మహానాయకుడు’ పనులు ముగిశాక... బాలీవుడ్‌కి వెళ్లి మళ్ళీ ‘మణికర్ణిక’ విషయంపై పంచాయితీ పెట్టాలని క్రిష్ నిర్ణయించుకున్నట్లు సమాచారం!


Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle