newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

క్రికెటర్ బయోపిక్‌లో అనుష్క

14-01-202014-01-2020 09:03:09 IST
2020-01-14T03:33:09.368Z14-01-2020 2020-01-14T03:27:56.801Z - - 18-01-2020

క్రికెటర్ బయోపిక్‌లో  అనుష్క
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈమధ్యకాలంలో బయోపిక్‌లు ఎక్కువగా రూపొందుతున్నాయి. నాని నటించిన జెర్సీ సినిమా మంచి విజయాన్ని సాధించింది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ, క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శ‌ర్మ ఓ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. భార‌త మ‌హిళా క్రికెట‌ర్ ఝుల‌న్ గోస్వామి బ‌యోపిక్‌లో ప్రధానపాత్ర పోషించేందుకు అనుష్క అంగీకరించింది. ఝుల‌న్ గోస్వామి భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించడంతో పాటు  జట్టు విజ‌యాల‌లో చాలా సార్లు కీ రోల్ పోషించిన సంగతి తెలిసిందే.1

ఝలన్ గోస్వామి 2010లో అర్జున అవార్డ్‌ తో పాటు ప‌ద్మ శ్రీ అవార్డు కూడా ద‌క్కించుకుంది. 2002లో తొలి వ‌న్డే మ్యాచ్ ఆడిన గోస్వామి ఇటీవ‌ల టీ 20ల‌కి రిటైర్మెంట్ ప్ర‌క‌టించింది. అటు భార‌త మ‌హిళా క్రికెట‌ర్ మిథాలీ రాజ్ బ‌యోపిక్ కూడా రూపొందుతోంది.

ఈ మూవీలో తాప్సీ కీరోల్‌ పోషిస్తోంది. ఇటు అనుష్క శర్మ కూడా ఝలన్ గోస్వామి బయోపిక్ లో నటించనుండడంతో రెండు బయోపిక్ లు త్వరలో ప్రేక్షకులను అలరించనున్నాయి. క్రీడాకారుల జీవిత చరిత్రలతో రూపొందే బయోపిక్ లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇటు గ్లామర్ పాత్రలతో పాటు పెర్ ఫార్మెన్స్ పాత్రల్లోనూ రాణించేందుకు ఈ పాత్ర తనకు మంచి అవకాశంగా అనుష్క భావిస్తోంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle