newssting
BITING NEWS :
*ప్రధాని మోదీని కలిసిన వైఎస్ఆర్సీఎల్పీ నేత జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర సమస్యలపై చర్చ, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం * వాల్డ్ కప్ వార్మప్ మ్యచ్ లో టీమిండియా పేలవ ప్రదర్శన, న్యూజీల్యాండ్ చేతిలోఓటమి * నరేంద్ర మోదీని పీఎం ఎలక్ట్ గా నియమించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ * రాష్ట్రపతి కోవింద్ కు కొత్త ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ * ఎవరెస్ట్ పర్వతంపై ఈ వారం మరణించిన పర్వతారోహకుల సంఖ్య 10కి చేరిక * తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితా సమర్పించిన సీఈఓ జీకే ద్వివేది

కొమురం భీంగా తారక్.. అల్లూరిగా చరణ్: RRR

14-03-201914-03-2019 12:08:19 IST
Updated On 14-03-2019 14:54:48 ISTUpdated On 14-03-20192019-03-14T06:38:19.941Z14-03-2019 2019-03-14T06:38:17.246Z - 2019-03-14T09:24:48.219Z - 14-03-2019

కొమురం భీంగా తారక్.. అల్లూరిగా చరణ్: RRR
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజమౌళి RRR సినిమా గురించి..చిత్ర విశేషాల గురించి.. ఏ మాత్రం బయటకు పొక్కనీయలేదు. ఇప్పటికే ఈ సినిమా స్టోరీపై రకరకాల ఊహాగానాలు షికార్లు చేశాయి. దీంతో ఈ సినిమా గురించి రాజమౌళి ఏం చెప్పబోతున్నాడో అని తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఆసక్తిగా చూశాయి. రాజమౌళి ఈ మూవీ గురించిన ఆసక్తికర విశేషాలు ప్రెస్ మీట్లో వెల్లడించారు. దీంతో ఉత్కంఠకు తెరపడింది. 1897లో అల్లూరి సీతారామరాజు పుట్టాడు. అతను ఇంగ్లీష్‌తో పాటు వేదాలు, పురాణాల్లోను మంచి అవగాహన పెంచుకున్నాడు. కొమురం భీమ్ యుక్త వయసులో ఉండగానే ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఆయన కూడా గిరిజనుల స్వాతంత్య్రం కోసం పోరాడాడు. ఇంటి నుంచి వెళ్లేటపుడు ఏం చదువుకోని కొమరం భీమ్..ఆ తర్వాత చదువుకొని వస్తాడు. వీళ్లిద్దరు ఒకరి జీవితంలో మరొకరు కలుసుకోలేదు. దాన్ని ప్రేరణగా తీసుకొని ఈ సినిమాను ఫిక్షన్‌గా తెరకెక్కిస్తున్నట్టు రాజమౌళి తెలిపారు.

రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి డైసీ ఎడ్జర్ జోన్స్  నటించబోతున్నట్టు రాజమౌళి వెల్లడించారు. ఈసినిమా కోసం ఎన్టీఆర్ తన బాడీని కూడా పెంచాడు. ఇప్పటికే RRR అనే వర్కింగ్ టైటిల్‌తోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికీ రెండు షెడ్యూళ్ళు పూర్తయ్యాయి. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి ఈ సినిమాను తెలుగులో మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్, రాం చరణ్‌లతో ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు. తెలుగుతో పాటు మిగతా భారతీయ భాషల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ మూవీని జూలై 30, 2020న విడుదల చేస్తామని రాజమౌళి ప్రకటించారు. 

అజయ్ దేవగన్ ఈ మూవీలో కీలక పాత్ర పోషించబోతున్నారు. ‘‘స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఇద్దరు వీరులు, ఒకరితో ఒకరు సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు... ఒకరికొకరు ఇన్స్పిరేషన్ అయి ఉంటే.. వాళ్ల మధ్య స్నేహం ఏర్పడి ఉంటే ఎలా ఉంటుందనేది నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. నా సినిమా కంప్లీట్‌గా ఫిక్షనల్‌గా ఉంటుంది. భారీ ఎత్తున ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. 1920 లో జరిగే కథ కాబట్టి చాలా రీసెర్చ్ చేశాం’’ అని చెప్పారు. అన్ని భాషల్లో ఈ టైటిల్ కామన్‌గా ఉంటుంది. కానీ ఒక్కో భాషలో ఒక్కో టైటిల్ ఉంటుందన్నారు రాజమౌళి. ఈ మూవీకి 300-350 కోట్లు ఖర్చవుతుందని నిర్మాత తెలిపారు. మొత్తం మీద ఈ మూవీ హాట్ టాపిక్ అవుతోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle