newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కాక రేపిన హీనా ఖాన్

16-05-201916-05-2019 13:17:27 IST
Updated On 16-05-2019 13:22:58 ISTUpdated On 16-05-20192019-05-16T07:47:27.274Z16-05-2019 2019-05-16T07:47:21.570Z - 2019-05-16T07:52:58.227Z - 16-05-2019

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కాక రేపిన హీనా ఖాన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అట్టహాసంగా ప్రారంభమయింది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌. ఈ వేడుకలో రెడ్ కార్పెట్‌పై తళుక్కున మెరిసింది టెలివిజన్ తార హీనా ఖాన్. వెరైటీ డ్రెస్‌తో ఆమె మెరుపులు మెరిపించింది. స్టార్ ప్లస్ ఛానెల్లో ప్రసారమయ్యే  ‘హే రిస్టా క్యా కెహ్లాతా హై’ ద్వారా హీనాఖాన్ తన ప్రత్యేకతను చాటుకుంది. ఈమధ్య బిగ్ బాస్ 11 రియాలిటీ షోలో కూడా ఈ భామ పాల్గొంది.

Cannes 2019,Hina Khan,Hina Khan at Cannes 2019

తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ప్రత్యేకంగా డిజైన్ డ్రెస్ తో కనిపించింది. అందరి కళ్ళు ఆమెపైన పడ్డాయి. హీనా ఖాన్ ఇండియన్ టెలివిజన్ ఇండస్ట్రీలో అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న బుల్లితెర నటి కావడం విశేషం. శ్రీనగర్లో పుట్టిన ఈ కాశ్మీరీ భామ అందంతో, అభినయంతో మత్తెక్కిస్తోంది. ఈమె ఆమీర్ ఖాన్ బంధువు కూడా. అనేక సీరియల్స్‌లో అతిథి పాత్రల్లో కనిపించింది.

2013లోనే టాప్ 50 సెక్సీయస్ట్ ఆసియన్ విమెన్ జాబితాలో చోటు సంపాదించింది. హీనా అనేక అవార్డులు కూడా గెలుచుకుంది. దాదా సాహెబ్ ఫాల్కే ఎక్స్ లెన్స్ అవార్డ్, రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్స్ లెన్స్ అవార్డు తన ఖాతాలో వేసుకుంది. డిసెంబర్ 2018లో ఎఫ్ హెచ్ఎం మేగజైన్ కవర్ పేజీ కనిపించింది. హీనా ఖాన్‌కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కనిపించిన ఆమె అందానికి లక్షలాదిమంది నెటిజన్లు దాసోహమయ్యారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle