newssting
BITING NEWS :
*ఇవాళ గురుపూర్ణిమ.. చంద్రగ్రహణం **దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

‘కృష్ణ అండ్ హిజ్ లీల’ విడుదల.. నెట్ ఫ్లిక్స్‌కు నిరసన సెగ

30-06-202030-06-2020 10:16:50 IST
Updated On 30-06-2020 10:23:57 ISTUpdated On 30-06-20202020-06-30T04:46:50.602Z30-06-2020 2020-06-30T04:46:24.339Z - 2020-06-30T04:53:57.936Z - 30-06-2020

‘కృష్ణ అండ్ హిజ్ లీల’ విడుదల.. నెట్ ఫ్లిక్స్‌కు నిరసన సెగ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా కారణంగా థియేటర్లు క్లోజ్ కావడంతో వివిధ సినిమాలు విడుదల దగ్గర ఆగిపోయాయి. ఓటీటీ ప్లాట్ ఫాంలపై అవి విడుదల అవుతున్నాయి. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాకు మతం సెగ తగిలింది. ఈ సినిమాలోని హీరో పాత్ర ద్వారా శ్రీకృష్ణుడిని అవమానించారని హిందూవాదులు మండిపడుతున్నారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రవికాంత్ పెరెపు దర్శకత్వంలో తెర‌కెక్కిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రం విడుదలై వివాదంలో చిక్కుకుంది. 

ఈ సినిమాపై ప్రధాన నటీనటులకు హిందూ దేవతల పేర్లు పెట్టడంపై వివాదం రేగుతోంది. ఈ మూవీపై రాకేష్ అనే వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ సినిమాకు వ్యతిరేకంగా హిందూవాదులు విరుచుకుపడుతున్నారు. సినిమా మాధ్యమం మరోసారి హిందూమతాన్ని అవమానించిందని మండిపడుతున్నారు. కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా థియేటర్లలో విడుదల అయ్యే అవకాశం లేదు. దీంతో నిర్మాతలు ఓటీటీ ప్లాట్ ఫాంపై విడుదలచేశారు. 

జూన్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ రొమాంటిక్ డ్రామా అందరినీ అలరిస్తోంది. టైటిల్ ఇంట్రెస్టింగ్ గా వుంది. ముగ్గురు అమ్మాయిలతో కృష్ణ చేసే రొమాన్స్ కాస్త శృతిమించిందనే విమర్శలు వస్తున్నాయి. ఈసినిమాలోని ప్రధాన పాత్రలకు దేవుళ్ల పేర్లు పెట్టి రొమాన్స్ నడిపించడం వల్ల వివాదం మొదలైంది. ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్న కారణంగా నెట్‌ఫ్లిక్స్‌ను బోయ్‌కాట్ చేయాలనే ప్రచారం మొదలైంది. ట్విట్టర్‌లో #BoycottNetflix టాప్ ట్రెండింగ్‌లో  కొనసాగుతోంది. కరోనా వైరస్ లాక్ డౌన్ వేళ ఈ సినిమాకు సంబంధించి దేశ వ్యాప్తంగా చర్చజరగడంతో ఫ్రీ పబ్లిసిటీ లభిస్తోందనే వారు వున్నారు. 

నెట్‌ఫ్లిక్స్ వ్యతిరేకంగా జరుగుతోన్న ఈ ప్రచారాన్ని కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ కానీ, సిరీస్ కానీ కాదని.. ఇండియన్స్ తీసిన సినిమా అని.. అలాంటప్పుడు సినిమా తీసినవారిని ప్రశ్నించాలి కానీ నెట్ ఫ్లిక్స్ పై ఆక్రోశం ఎందుకనే విమర్శకులు వున్నారు. 

 

మర్డర్ మూవీ...  ప్రణయ్ తండ్రి ఫిర్యాదు....వర్మపై ఎస్సీఎస్టీ కేసు

మర్డర్ మూవీ... ప్రణయ్ తండ్రి ఫిర్యాదు....వర్మపై ఎస్సీఎస్టీ కేసు

   11 hours ago


ట్విట్టర్లో మహేష్ దూకుడు.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్

ట్విట్టర్లో మహేష్ దూకుడు.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్

   04-07-2020


హాట్ ఫోటోలతో దుమ్మురేపుతున్న బిగ్ బాస్ బ్యూటీ

హాట్ ఫోటోలతో దుమ్మురేపుతున్న బిగ్ బాస్ బ్యూటీ

   04-07-2020


పసిపిల్లలపై అత్యాచారం.. హత్యలా.. జాతి వినాశనం ఖాయం.. సాయి పల్లవి ఆక్రోశం

పసిపిల్లలపై అత్యాచారం.. హత్యలా.. జాతి వినాశనం ఖాయం.. సాయి పల్లవి ఆక్రోశం

   04-07-2020


రాంచరణ్ లుక్ చూస్తే షాకవ్వాల్సిందే!

రాంచరణ్ లుక్ చూస్తే షాకవ్వాల్సిందే!

   03-07-2020


మరోసారి విక్రమ్ కుమార్ మూవీలో సమంత?

మరోసారి విక్రమ్ కుమార్ మూవీలో సమంత?

   03-07-2020


కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఇకలేరు

కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఇకలేరు

   03-07-2020


ఏపీ సీఎం జగన్‌ని పొగిడేసిన డైరెక్టర్ పూరీ

ఏపీ సీఎం జగన్‌ని పొగిడేసిన డైరెక్టర్ పూరీ

   02-07-2020


హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సోనాక్షి

హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సోనాక్షి

   02-07-2020


హీరోయిన్లే కాదు దర్శకులూ వారికి టార్గెట్టే

హీరోయిన్లే కాదు దర్శకులూ వారికి టార్గెట్టే

   02-07-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle