newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

కాషాయానికి చిక్కనంటూ కబాలి కామెంట్స్

08-11-201908-11-2019 18:09:51 IST
2019-11-08T12:39:51.069Z08-11-2019 2019-11-08T12:39:49.261Z - - 19-11-2019

కాషాయానికి చిక్కనంటూ కబాలి కామెంట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బీజేపీ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనపై బలవంతంగా కాషాయరంగు పులమాలని చూస్తున్నారని, అవన్నీ సాగవన్నారు. తనను బీజేపీలో చేరమని నేతలు ఎవరూ పిలవలేదని, అలాంటి ఉద్దేశం తనకు లేదన్నారు. తనపై ఎన్ని వలలు వేసినా తాను కాషాయానికి చిక్కనని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టత నిచ్చారు రజనీకాంత్.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతియుత వాతావరణం నెలకొల్పాలని, పార్టీ పెట్టేంత వరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటానన్నారు దర్బార్ హీరో రజనీకాంత్. తనను నమ్ముకొని బీజేపీ ఉండాల్సిన అవసరంలేదని వివరణ ఇచ్చారు.

ఎవరితో పొత్తు అనేది తన నిర్ణయమే.. తనను ఎవరూ శాసించలేరన్నారు. అందుకే తాను కాషాయరంగును దగ్గరకు రానివ్వనన్నారు రజనీకాంత్‌. ఈ తమిళ సూపర్ స్టార్ ఇప్పటికీ తన సత్తాను చాటుతూనే వున్నారు.

తాజాగా ఆయన నటిస్తున్న దర్బార్ మూవీ మోషన్ పోస్టర్ విడుదలై దుమ్మురేపుతోంది. ఈ మూవీ పోస్టర్ ను ప్రిన్స్ మహేష్ బాబు ద్వారా విడుదలచేసి ఇటు తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు రజనీకాంత్. దర్బార్ మూవీ పోస్టర్ 17 గంటల్లో 3 మిలియన్ల రియల్ టైం వ్యూస్ సాధించింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle