newssting
BITING NEWS :
*ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు, 519 కరోనా మరణాలు నమోదు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123 *కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్.. ఫిర్యాదుదారుపై హైకోర్టు ఆగ్రహం *తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్న అధికారులు *ఢిల్లీ: కేంద్రం ఆదేశాలతో ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. లోధీ రోడ్ లో నివాసముంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. వ్యక్తిగత సామాన్లను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలింపు *ఇవాళ తెలంగాణలో 1278 పాజిటివ్ కేసులు నమోదు...8 మంది మృతి..ఇప్పటి వరకు 339 మంది మృతి..హైదరాబాద్ లో 762 పాజిటివ్ కేసులు *బెజవాడలో మరోమారు డ్రగ్స్ కలకలం. డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్*ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో దూకుడు పెంచిన ఏసీబీ.మాజీ మంత్రి పితాని పీఎస్ మురళి అరెస్ట్.మురళీని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ.పితాని కొడుకు సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ*కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన NIA..నలుగురిపై NIA కేసు నమోదు

కరోనా కేసుల తీవ్రతపై మహేష్ బాబు ఆందోళన

29-06-202029-06-2020 18:32:01 IST
Updated On 30-06-2020 09:28:47 ISTUpdated On 30-06-20202020-06-29T13:02:01.380Z29-06-2020 2020-06-29T13:01:27.843Z - 2020-06-30T03:58:47.424Z - 30-06-2020

కరోనా కేసుల తీవ్రతపై మహేష్ బాబు ఆందోళన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా వైరస్ కేసులు భయాందోళనలకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి కరోనా కేసులు పెరిగిపోతున్నాయని సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కేసుల పెరుగుదల పట్ల మహేశ్ ఆందోళన వ్యక్తంచేశారు. రోజురోజుకీ కేసులు పెరిగిపోవడం, మృతుల సంఖ్య పెరుగుతోందని, అందరినీ కాపాడుకుందాం అంటూ పిలుపునిచ్చారు. ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. 

దేశంలో కరోనా కేసుల పెరుగుదలకు కారణాలు అన్వేషించాలన్నారు. లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని తెలిపారు. ఈ  సమయంలో మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా, మన చుట్టూ ఉన్నవాళ్లను కూడా కాపాడుకుందాం అంటూ పిలుపునిచ్చారు. బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు. 

మీ చుట్టుపక్కల పరిస్థితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, భద్రతా చర్యలతో పాటు, భౌతికదూరం కూడా పాటించాలని సూచించారు. ఇప్పటివరకు మీ ఫోన్ లో ఆరోగ్యసేతు యాప్ లేకపోతే ఇకనైనా డౌన్ లోడ్ చేసుకోవాలని మహేశ్ బాబు పేర్కొన్నారు. మీకు సమీపంలో ఎవరైనా కరోనా నిర్ధారణ అయిన రోగులు ఉన్నట్టయితే ఈ యాప్ మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది అని వెల్లడించారు. 

అంతేకాదు, ఈ యాప్ తో మీరు అత్యవసర వైద్య సహాయం కూడా అందుకోవచ్చని వివరించారు. మనందరం క్షేమంగా ఉండాలి, ఈ విషయం గుర్తెరిగి బాధ్యతగా మసలుకుందాం అంటూ మహేశ్ బాబు ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు. సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు మూవీ తర్వాత సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle