newssting
BITING NEWS :
*ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు, 519 కరోనా మరణాలు నమోదు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123 *కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్.. ఫిర్యాదుదారుపై హైకోర్టు ఆగ్రహం *తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్న అధికారులు *ఢిల్లీ: కేంద్రం ఆదేశాలతో ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. లోధీ రోడ్ లో నివాసముంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. వ్యక్తిగత సామాన్లను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలింపు *ఇవాళ తెలంగాణలో 1278 పాజిటివ్ కేసులు నమోదు...8 మంది మృతి..ఇప్పటి వరకు 339 మంది మృతి..హైదరాబాద్ లో 762 పాజిటివ్ కేసులు *బెజవాడలో మరోమారు డ్రగ్స్ కలకలం. డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్*ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో దూకుడు పెంచిన ఏసీబీ.మాజీ మంత్రి పితాని పీఎస్ మురళి అరెస్ట్.మురళీని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ.పితాని కొడుకు సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ*కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన NIA..నలుగురిపై NIA కేసు నమోదు

కరెంట్ బిల్లు చూసి.... ఆ హీరోయిన్ షాక్

28-06-202028-06-2020 12:37:43 IST
2020-06-28T07:07:43.941Z28-06-2020 2020-06-28T07:07:06.153Z - - 11-07-2020

కరెంట్ బిల్లు చూసి.... ఆ హీరోయిన్ షాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్ వేళ జనమంతా ఇళ్ళకే పరిమితం అయ్యారు. సామాన్యులయితే నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు పెరిగి ఇబ్బందులు ప‌డుతున్నారు, ఇది చాలదన్నట్టుగా ప్ర‌భుత్వాలు తడిసి మోపెడు క‌రెంటు బిల్లులతో జనాలను నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఈ క‌ష్టాలు సామాన్యుల‌కే కాదు బడ బడా నేతలకు, సినిమా వారికి కూడా కలుగుతున్నాయి. అలనాటి అందాల భామ రాధ గుర్తుందా. ఆమె తన కార్తీక నాయర్ సినిమాల్లో మెరుపులు మెరిపిస్తోంది. తాజాగా ఆమెకు షాక్ తగిలింది. 

హీరోయిన్‌ కార్తీక తన ఇంటికి వచ్చిన క‌రెంటు బిల్లు చూసి కళ్లు తేలేసింది. ఆ బిల్లు ఎంతో తెలుసా అక్ష‌రాలా ల‌క్ష రూపాయలట. దీంతో ఆమె షాకైంది.  కార్తీక‌ ట్విట‌ర్‌లో త‌న కోపాన్నంత‌టినీ క‌క్కేసింది. 'ముంబైలో ఏం కుంభ‌కోణం జ‌రుగుతోంది?' అంటూ అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్‌ను, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. 'లాక్‌డౌన్‌లో క‌రెంటు మీట‌ర్ రీడింగ్ తీయ‌లేదు. లాక్‌డౌన్ స‌డ‌లింపుల త‌ర్వాత 3 నెల‌ల రీడింగ్ ఒకేసారి తీశారు. దీంతో ఒక్క‌ జూన్ నెల‌లోనే త‌న‌కు ల‌క్ష బిల్లు వ‌చ్చిందని పేర్కొంది.

ఇలా చాలామంది ముంబైవాసులకు ఆమె ప్ర‌స్తావించింది. మ‌రి అధికారులు ఈమె ట్వీట్‌కు స్పందిస్తారో లేదో చూడాలి. కాగా కార్తీక జోష్ మూవీతో 2009లో సినిమాల్లోరి వచ్చింది.  అనేక తెలుగు, త‌మిళ చిత్రాల్లో హీరోయిన్‌గా న‌టించి త‌గిన గుర్తింపు సంపాదించుకుంది. చివ‌రిసారిగా "అరంభ్‌: క‌హానీ దేవ‌సేన కీ" అనే టీవీ సిరీస్‌లో న‌టించింది. జోష్ సినిమాలో ఆమె నాగచైతన్య సరసన  నటించింది. ఆమె రెండో సినిమా  రంగం.  తమిళంలో  తీసిన  ఈ  సినిమాను తెలుగులో డబ్బింగ్  చేయగా, రెండు భాషల్లోనూ విజయవంతమైంది. జూనియర్ ఎన్ టి ఆర్ సరసన దమ్ము చిత్రంలొ కూడా నటించారు. ఆ తరువాత తెలుగులొ అల్లరి నరేష్ సరసన బ్రదర్ ఆఫ్ బొమ్మాలిలో నటించింది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle