newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

కంగన ‘నిప్పు’పై ఆలియా నీళ్ళు

09-02-201909-02-2019 12:39:49 IST
2019-02-09T07:09:49.778Z09-02-2019 2019-02-09T07:09:47.779Z - - 21-08-2019

కంగన ‘నిప్పు’పై ఆలియా నీళ్ళు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక సినిమా మంచి విజయం సాధిస్తే... వెంటనే తోటి నటీనటులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేయడమో, తమతమ ప్రెస్‌మీట్స్‌లో దాని ప్రస్తావన తీసుకురావడమో చేస్తారు. ఆ చిత్రాన్ని ఆకాశానికెత్తేస్తూ, ప్రధాన పాత్రధారులపై ప్రశంసలు కురిపిస్తారు. వ్యక్తిగతంగా చాలా దగ్గరగా ఉండే తారలైతే ఏమాత్రం జంకకుండా తమవంతు మద్దతు ప్రకటిస్తారు. కానీ... ‘మణికర్ణిక’ విషయంలో అలా జరగలేదు. కంగన, క్రిష్ గొడవ కారణంగా... ఆ సినిమా విజయాన్ని ఎవ్వరూ పెద్దగా గుర్తించలేదు. దీంతో కంగన ఉవ్వెత్తున ఎగిసింది.

అసలే క్రిష్ గొడవతో తలమునకలై ఉన్న కంగన... తన సన్నిహితులు మద్దతుగా మాట్లాడలేదని, కనీసం సినిమాపై స్పందించలేదనే ఆగ్రహంతో ఊగిపోయింది. బాలీవుడ్‌ మొత్తం ఒక గ్యాంగ్‌లా ఏర్పడి తనకు వ్యతిరేకంగా మారారని, ప్రణాళిక ప్రకారమే ‘మణికర్ణిక’కు మద్దతుగా నిలవలేదంటూ చిందులేసింది. నెపోటిజమ్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకే తనపై ఇలా అందరూ కక్ష గట్టారని ఆమె ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆలియా భట్, ఆమిర్‌ఖాన్‌ల పేర్లు ప్రస్తావించిన కంగనా... వాళ్ళ సినిమాలకు (రాజీ, దంగల్) తాను అండగా నిలిచానని, కానీ ఆ ఇద్దరు మాత్రం తనను సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తమకు అండగా నిలవని నటీనటులపై పరోక్షంగా నిప్పులు చెరిగిన సందర్భాలున్నాయి కానీ... ఇలా నేరుగా పేర్లు ప్రస్తావించి, వారిపై మండిపడ్డ దాఖలాలు ఇండస్ట్రీలో లేవు. దీంతో కంగన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో దుమారం రేపాయి. టాప్ స్టార్స్‌గా పేరుగాంచిన ఆలియా, ఆమిర్‌లనే టార్గెట్ చేయడంతో... వాళ్ళెలా రియాక్ట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు దీనిపై ఆలియా భట్ సానుకూలంగా స్పందించింది. కంగన పిలుపు మేరకు ‘మణికర్ణిక’ సినిమా చూసేందుకు వెళ్ళకపోవడం, మద్దతుగా మాట్లాడకపోవడం తన తప్పేనని, ఇందుకు క్షమాపణలు చెప్పేందుకు రెడీ అంటూ చెప్పుకొచ్చింది.

‘‘కంగన నన్ను ద్వేషిస్తోందని నేను అనుకోవడం లేదు. కావాలని ఆమెని అప్‌సెట్ చేయలేదు. బిజీ షెడ్యూల్స్ వల్ల ఇలా జరిగిపోయింది. ఈ విషయమై కంగనకు క్షమాపణలు చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నిజానికి... ఓ నటిగా తనలా మాట్లాడటానికి చాలా ధైర్యం కావాలి. ఒక వ్యక్తిగా, గొప్ప నటిగా కంగన పట్ల నాకు ఆరాధనా భావం ఉంది... ఎప్పటికీ ఉంటుంది’’ అని ఆలియా పేర్కొంది. అయితే... ఆమిర్ ఖాన్ ఇంతవరకూ స్పందించకుండా మౌనంగా ఉండిపోయారు.


Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle