newssting
BITING NEWS :
బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కేసులో నేడు వెలువడనున్న తీర్పు. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును ప్రకటించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, విశ్వహిందూ పరిషత్‌ నేతలు విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంబర తదితరులు. వీరిలో అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌ మరణించగా కరోనాతో చికిత్స పొందుతున్న ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్. మిగిలిన వారిలో కొందరు నేడు కోర్టుకు హాజరయ్యే అవకాశం * పాకిస్థాన్ దేశంలోని మర్దాన్ నగరంలో జరిగిన పేలుడు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయాలు. గ్యాస్ వల్ల మర్దాన్ నగరంలోని జడ్జి బజార్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని చెప్పిన పాక్ పోలీసులు. ఈ పేలుడులో ఓ బాలుడితోపాటు మొత్తం నలుగురు మృతి. గాయపడిన 12 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు * ఒడిశాలో కరోనా వీర విజృంభణ. కరోనా బారిన పడ్డ ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో నాలుగు వందల మంది. అందులో 351 మంది సేవకులు, 53 మంది సిబ్బందికి వైరస్‌. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి. మరోవైపు ఒడిశా స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌ తో సహా మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ * బిహార్ ఎన్నికల్లో పోటీకి బీఎస్పీతో కలిసి ఆర్ఎల్ఎస్‌పీ ప్రత్యేక ఫ్రంట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బహుజనసమాజ్ పార్టీ, జనతాంత్రిక్ పార్టీతో కలిసి తాము ప్రత్యేక ఫ్రంట్ గా పోటీ చేస్తామని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వా ప్రకటన. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించిన ఉపేంద్ర * శీతాకాలంలో కరోనా వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ హెచ్చరిక. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ, నిపుణుల బృందం హెచ్చరిక. రాబోయే రెండు మూడు నెలలు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని కొనసాగించాలని డాక్టర్ పాల్ సూచన * హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున బలవంతంగా దహనం చేసినట్లుగా ఆరోపిస్తున్న బాధితురాలు కుటుంబ సభ్యులు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ మృతదేహాన్ని పోలీసులే బలవంతంగా దహనం చేశారని ఆరోపణ. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో నలుగురు మృగాలు యువతిపై అత్యాచారం చేసి నాలుక కోసి, గొంతు నులిమిన ఘటనతో కన్నుమూసిన 19ఏళ్ల యువతి * సూర్యాపేట‌ జిల్లాలోని కోదాడ‌లో అదుపుత‌ప్పి ఇంట్లోకి దూసెకెళ్లిన లీలాద‌రి ట్రావెల్స్ ప్రైవేటు బ‌స్సు. రాజ‌స్థాన్ నుంచి విశాఖ‌ప‌ట్నం ప్రయాణిస్తుండగా బుధవారం తెల్ల‌వారుజామున సూర్యాపేటలో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టిన బస్సు. రోడ్డు వెంబ‌డి ఉన్న రెండు విద్యుత్ స్తంభాల మ‌ధ్య‌లోనుంచి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు. ప్ర‌మాద సమ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉండగా నలుగురికి గాయాలు * దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌. నియోజకవర్గంపై దృష్టి సారించనున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానున్న గెలుపు * 288వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం *

ఓటీటీ రంగంలోకి ఈనాడు సంస్థల అధినేత..!

16-09-202016-09-2020 14:57:55 IST
2020-09-16T09:27:55.330Z16-09-2020 2020-09-16T09:27:53.296Z - - 01-10-2020

ఓటీటీ రంగంలోకి ఈనాడు సంస్థల అధినేత..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇప్పటికే పలు రంగాలలో రాణిస్తున్నారు..ఇప్పుడు మరో రంగంలోకి అడుగుపెట్టేందుకు యోచన చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన ఎంచుకున్న రంగాలన్నీ సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారు. ఆయన పేరుతో ఏకంగా ఫిల్మ్ సిటీనే నిర్మించారు. ఆయనే రామోజీరావు.

ఆయన ప్రస్థానం పచ్చళ్ల వ్యాపారంతో మొదలు పెట్టి ఎంటర్ ప్రైన్యూర్ గా మీడియా దిగ్గజంగా ఎదిగారు రామోజీ రావు. ఈనాడు ఈటీవీ గ్రూప్ సంస్థల అధినేతగా ఆయనకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. వ్యాపారం పరంగా ఆయన చేపట్టిందల్లా బంగారమేనని టాక్ కూడా ఉంది.

కాగా  సినీనిర్మాతగానూ రామోజీరావు ఎన్నో క్లాసిక్ సినిమాల్ని తెరకెక్కించారు. ఉషా కిరణ్ మూవీస్ లో దాదాపు 80 పైగా సినిమాలు తీసారు. ఇక ఇవన్నీ 99ఏళ్ల పాటు కేవలం ఈటీవీలోనే చూసే భాగ్యం ఆడియెన్ కి ఉందంట. ఇక సినీరంగంలో ఆయన స్పీడ్ తగ్గించారు. ప్రస్తుతం డిజిటల్ హవా సాగుతోంది కాబట్టి ఓటీటీ రంగంపైనా రామోజీ కన్ను పడిందన్నది తాజా సమాచారం.

ఇప్పటికే తెలుగులో ఆహా ఓటీటీ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అండ్ కో 'ఆహా' కోసం కోట్లాది రూపాయలు వెదజల్లుతూ ఓటీటీ కంటెంట్ ని అందిస్తున్నారు. లాంగ్ టైమ్ లో భారీ లాభాల్ని ఆర్జించేందుకు ప్రణాళికలతో దూసుకెళుతున్నారు. అరవింద్ స్ఫూర్తితో పలువురు టాలీవుడ్ అగ్ర నిర్మాతలు ఓటీటీపై కన్నేశారన్న టాక్ ఉంది.

అందుకే ఇప్పుడు రామోజీ రావు కూడా ఈ విభాగంలో రాణించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎలానూ ఈటీవీకి  సినిమాల దన్ను ఉంటుంది కాబట్టి అవన్నీ అనుబంధ ఓటీటీలో వీక్షించే వీలుంటుంది. ఇక జెమిని - సన్ నెక్ట్స్ లా.. జీ టీవీ - జీ నెట్ వర్క్ లా .. ఈటీవీ ఓటీటీ కూడా రెడీ అవుతుందనే భావిస్తున్నారు. ఇక రామోజీ ఓటీటీ రంగంలో ప్రవేశిస్తే ఈటీవీలోనూ ఇకపై పెద్ద సినిమాలు వేసే వీలుంటుందని అంచనా వేస్తున్నారు. తొలిగా టీవీ ప్రీమియర్ వేసేసి అటుపై ఓటీటీలోకి దానిని పంపిస్తారట. ఇప్పటికే ఓటీటీ పని మొదలుపెట్టారట.

 

 

చిరంజీవి - అల్లు అరవింద్ మధ్య గొడవలా..?

చిరంజీవి - అల్లు అరవింద్ మధ్య గొడవలా..?

   an hour ago


రాజ్ తరుణ్ - హేబ్బా పటేల్ లవ్ లో ఉన్నారా..?

రాజ్ తరుణ్ - హేబ్బా పటేల్ లవ్ లో ఉన్నారా..?

   2 hours ago


నిన్న వైఎస్ జగన్ - నేడు జయప్రద..!

నిన్న వైఎస్ జగన్ - నేడు జయప్రద..!

   4 hours ago


యాంకర్ ప్రదీప్ పెళ్లి ఫిక్స్.. ఎవరితో తెలుసా..?

యాంకర్ ప్రదీప్ పెళ్లి ఫిక్స్.. ఎవరితో తెలుసా..?

   4 hours ago


క్యాబ్ డ్రైవర్ ని మోసం చేసిన ముమైత్ ఖాన్..

క్యాబ్ డ్రైవర్ ని మోసం చేసిన ముమైత్ ఖాన్..

   5 hours ago


బిగ్ బాస్4: వాళ్లంతా గేమ్ ఆడటానికి రాలేదు.. 3 నెలలు డేటింగ్ కి వచ్చారు..

బిగ్ బాస్4: వాళ్లంతా గేమ్ ఆడటానికి రాలేదు.. 3 నెలలు డేటింగ్ కి వచ్చారు..

   5 hours ago


మొగలిరేకులు సీరియల్ ఆర్కే నాయుడు హీరోగా సినిమా..

మొగలిరేకులు సీరియల్ ఆర్కే నాయుడు హీరోగా సినిమా..

   6 hours ago


ఫోన్ నెంబర్ అడిగిన నెటిజన్ కి గట్టిగా సమాధానం చెప్పిన పునర్నవి..

ఫోన్ నెంబర్ అడిగిన నెటిజన్ కి గట్టిగా సమాధానం చెప్పిన పునర్నవి..

   6 hours ago


పవన్ ఫ్యాన్స్ వల్లే ఎలిమినేట్ అయ్యాను.. దేవి నాగవల్లి

పవన్ ఫ్యాన్స్ వల్లే ఎలిమినేట్ అయ్యాను.. దేవి నాగవల్లి

   6 hours ago


వరదల్లో కొట్టుకుపోయిన హీరో శర్వానంద్ తాతగారి ఇల్లు..

వరదల్లో కొట్టుకుపోయిన హీరో శర్వానంద్ తాతగారి ఇల్లు..

   8 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle