newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

ఐఫా అవార్డ్స్ లో ఆలియా..రణ్ వీర్..!

19-09-201919-09-2019 16:02:31 IST
2019-09-19T10:32:31.574Z19-09-2019 2019-09-19T10:32:27.033Z - - 20-10-2019

ఐఫా అవార్డ్స్ లో ఆలియా..రణ్ వీర్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐఫా అంటే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అని అర్థం. బాలీవుడ్ లో ప్రతి ఏటా జరిగే సినీ అవార్డ్స్ వేడుకే ఈ ఐఫా. ఈ వేడుకని జూన్ 24..2000వ సంవత్సరంలో ప్రారంభించారు. ఈ సంవత్సరం జరిగే ఐఫా వేడుక ఓ ప్రత్యేకతని సంతరించుకుంది. అదేంటంటే ఈ వేడుకలు ప్రారంభమై ఈ ఏడాదికి 20సంవత్సరాలను పూర్తి చేసుకోవడం విశేషం.

ఐఫా అవార్డ్స్ వేడుకలు మొదటిసారి లండన్ లోని మిలీనియమ్ డమ్ లో  ప్రారంభమయ్యాయి. ఆ ఏడాది మొత్తంలో విడుదలయిన చిత్రాలలో బెస్ట్ చిత్రంని ఎంపిక చేసి..వాటిలో నటించిన నటీ నటులకు ఉత్తమ కేటగిరిలో ఈ అవార్డ్స్ ను అందిస్తారు.

ప్రతి ఏటా ఏదో ఒక దేశంలో జరిగే ఈ వేడుకలు..ఈ ఏడాది ముంబయిలోని సర్ధార్ వల్లభనేని పటేల్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో బాలీవుడ్ ప్రముఖ నటీనటులు పాల్గొన్నారు. మరి ఈ సంవత్సరం  ఈ అవార్డును ఎవరు సొంతం చేసుకున్నారో చూద్దాం. రాజీ చిత్రంలో బాలీవుడ్ చిన్నది ఆలియాభట్ నటనకి మెచ్చి ఉత్తమ నటి అవార్డును ఆమెకి అందించారు. కాగా పద్మావత్ చిత్రంలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో ఒదిగిపోయిన నటుడు రణ్ వీర్ సింగ్ ఉత్తమనటుడి అవార్డును అందుకున్నాడు.

రాజీ..పద్మావత్ చిత్రాలకి అధికంగా నామినేషన్స్ వచ్చాయి. దాంతో ఉత్తమ చిత్రంగా రాజీ ని ఎంపిక చేశారు. అంతేకాదు బెస్ట్ డైరెక్టర్ గా శ్రీరామ్ రాఘవన్ అవార్డు ను  చేజిక్కించుకున్నారు. నటులు విక్కీ కౌశల్..అదితిరావు హైదరి బెస్ట్ సపోర్టింగ్ రోల్ లో మెప్పించినందుకు వారు కూడా అవార్డును అందుకున్నారు.

బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణేకి ఐఫా అవార్డుల వేడుక కార్యక్రమం 20సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్పెషల్ అవార్డును అందించారు. ఇకపోతే మరో నటుడు రణ్ బీర్ కపూర్ బర్ఫీ చిత్రానికి స్పెషల్ అవార్డ్ దక్కించుకున్నాడు. స్పెషల్ అవార్డ్ కేటగిరిలో ఉత్తమ దర్శకుడిగా రాజ్ కుమార్ హిరాణీ అవార్డ్ ను దర్కించుకోవడం విశేషం.

మరి మొదటిసారిగా ఈ అవార్డు ఏ చిత్రాన్ని వరించిందో తెలుసా..హమ్ దిల్ దే చుకే సనమ్. ఈ మూవీ 1999లో విడుదలయింది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించాడు. కాగా ఈ మూవీలో అందాల భామ ఐశ్వర్యా రాయ్..సల్మాన్ ఖాన్..అజయ్ దేవ్ గన్ ముఖ్య పాత్రలని పోషించారు.  ఈ కార్యక్రమానికి హోస్ట్స్ గా యుక్తాముఖీ..అనుపమ్ ఖేర్ చేశారు.

జూన్ 16..2001లో రెండవ ఐఫా అవార్డ్స్ వేడుక సన్ సిటీ లో జరిగగా..కహో నా ప్యార్ హై చిత్రం బెస్ట్ మూవీగా ఎంపికైంది. ఈ వేడుకలకి ప్రియాంకచోప్రా..కబీర్ బేడీ హోస్ట్స్ గా వ్యవహరించారు.

మూడవ ఐఫా వేడుకలు  మలేసియాలోని జెంటింగ్ హైల్యాండ్స్ లో జరిగాయి..ఏప్రిల్ 6..2002లో జరిగిన ఈ వేడుకలో లగాన్ చిత్రం ఈ అవార్డ్స్ ని దక్కించుకుంది. లారాదత్తా ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించింది. ఇకపోతే నాలగవ వేడుకలో దేవదాస్ చిత్రం ఎంపిక కాగా ఈ వేడుకలో వ్యాఖ్యాతలు అనిల్ కపూర్..దియామిర్జాలు .ఐదవ వేడుకలు సింగపూర్ లో ఘనంగా జరగగా..కల్ హో న హో చిత్రం ది బెస్ట్ గా నిలిచింది. రాహుల్ ఖన్నా ఈ కార్యక్రమానికి హోస్ట్. వీర్..జరా చిత్రం ఆరవ ఐఫా వేడుకలో పలు అవార్డ్స్ ని చేజిక్కించుకుంది. ఈ వేడుకకి హోస్ట్స్ గా షారుక్ ఖాన్..ఫర్ధిన్ ఖాన్..కరణ్ జోహార్లు మెరిసారు. ఏడవ ఐఫాలో బ్లాక్ చిత్రం బెస్ట్ గా నిలిచింది. ఫర్ధిన్ ఖాన్..లారాదత్తా వ్యాఖ్యతలుగా వ్యవహరించారు. రంగ్ దే బసంతి చిత్రం ఎనిమిదవ ఐఫా అవార్డ్స్ ని సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమాన్ని బొమ్మాని ఇరానీ..లారాదత్తా హోస్ట్స్ గా నడిపించారు. తొమ్మిదవ ఐఫాలో చెక్ దే ఇండియా మెరిసింది. ఈ వేడుకల్లో బొమ్మానీ ఇరానీ..రితేష్ దేశ్ ముఖ్  హోస్ట్ గా తళుక్కుమన్నారు.

జోదా అక్బర్ 10వ ఐఫా అవార్డ్స్  చిత్రంలో బెస్ట్ గా నిలిచింది. ఈ వేడుకల్లో కూడా మరోసారి  బొమ్మాన్  ఇరానీ..రితేష్ దేశ్ ముఖ్ వ్యాఖ్యాతలుగా మెరవడం విశేషం. త్రీ ఇడియట్స్ చిత్రం 11వ ఐఫా వేడుకల్లో బెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది. మరోసారి బొమ్మాన్ ఇరానీ..రితేష్ దేశ్ ముఖ్ లతో పాటు లారాదత్తా హోస్ట్ చేసింది. 12వ ఐఫా  అవార్డ్స్ కార్యక్రమంలో దబాంగ్ చిత్రం పలు అవార్డ్స్ ని చేజిక్కించుకుంది. ఈ వేడుకలో నాలగవ సారి హోస్ట్స్ గా బొమ్మాన్ ఇరానీ..రితేష్ దేశ్ ముఖ్ లు  నిలిచారు. 13వ ఐఫా అవార్డులని జిందగీ న మిలేగి దోబారా చిత్రం అందుకుంది. ఈ కార్యక్రమంలో  షాహిద్ కపూర్..ఫర్హాన్ అక్తర్ వ్యాఖ్యాతలుగా నిలిచారు. 14వ ఐఫా లో బర్ఫీ చిత్రం బెస్ట్ గా నిలిచింది. షారుక్ ఖాన్..షాహిద్ కపూర్ ఈ వేడుకలకి హోస్ట్స్. భాఘీ మిల్కా భాగ్ చిత్రం 15వ ఐఫా అవార్డ్స్ లో మెరిసింది. షాహిద్ కపూర్..ఫర్హాన్ అక్తర్ హోస్ట్స్ గా వ్యవహరించారు. క్వీన్ 16వ ఐఫా లో ది బెస్ట్ చిత్రం. ఈ కార్యక్రమానికి అర్జున్ కపూర్..రణ్ వీర్ సింగ్ హోస్ట్స్.బజరంగీ భాయిజాన్ 17వ ఐఫా అవార్డ్స్ లో బెస్ట్ చిత్రం..కాగా షాహిద్ కపూర్..ఫర్హాన్ అక్తర్ వ్యాఖ్యాతలు. ఇకపోతే 18వ ఐఫా వేడుకల్లో నీరజా బెస్ట్ మూవీగా  నిలిచింది. కరణ్ జోహార్..సైఫ్ ఆలీ ఖాన్ హోస్ట్స్..కాగా తుమ్హారీ సులు చిత్రం 19వ ఐఫా వేడుకల్లో పలు అవార్డ్స్ ని దక్కించుకుంది. కరణ్ జోహార్..రితేష్ దేశ్ ముఖ్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలు.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle