newssting
BITING NEWS :
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై అన్నాడీఎంకేలో అసంతృప్తులు. సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఎవరికివారు నేనంటే నేనే అంటూ వాదులాడుకునే స్థాయికి చేరిన వివాదం. వివాదానికి తెరదించేలా అక్టోబరు 7న అధికారిక ప్రకటిన చేయనున్నట్లు స్పష్టం చేసిన పార్టీ * కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టం బిల్లు ఆమోదాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేరళకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ టీఎన్‌ ప్రతాపన్‌. వ్యవసాయ రంగం అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, కేం‍ద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని సుప్రీం పిటిషన్ లో పేర్కొన్న ఎంపీ. కేం‍ద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మూడు చట్టాలు రాజ్యాంగ విరుద్దమని, చెల్లదని రద్దుచేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరిన ఎంపీ * అసోం మాజీ మహిళా ముఖ్యమంత్రి సైదా అన్వర తైమూర్ (84) అనారోగ్యంతో ఆస్ట్రేలియాలో కన్నుమూత. అసోం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా 4 దశాబ్దాల పాటు పనిచేసిన సైదా అన్వర తైమూర్. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సైదా అన్వర అసోం మొట్టమొదటి మహిళా సీఎం. గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉన్న తన కుమారుడి వద్ద ఉంటున్న సైదా అన్వర తీవ్ర అనారోగ్యానికి గురై కన్నుమూత * బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి(61)కి కరోనా సోకిన సంగతి తెలిసిందే. హిమాలయాల పర్యటనలో ఉండగా స్వల్ప జ్వరం రావడంతో పరీక్షలు చేయగా పాజిటివ్‌ ఫలితాలు. రిషికేశ్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్లుగా ట్వీట్. తన డ్రైవర్‌కు పాజిటివ్‌ వచ్చిందని, అతడి ద్వారా వ్యాపించి ఉంటుందని ట్వీట్ లో వెల్లడించిన ఉమా భారతి * రైలు ప్రయాణికుల నెత్తిన చార్జీల భారం మోపేందుకు రైల్వే శాఖ కసరత్తులు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్ల ప్రయాణికులపై చార్జీల మోత. ప్రయాణికుడు కొనుగోలు చేసే టికెట్ ధరను బట్టి పెరుగుదలకు అవకాశం. గరిష్ఠంగా రూ.35 నుండి కనిష్ఠంగా పది రూపాయల వరకు వసూలు చేయనున్న వినియోగ రుసుము* దేశవ్యాప్తంగా మొత్తం 7 వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో రద్దీగా ఉండే స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి వినియోగ రుసుమును వసూలు చేస్తామని రైల్వే శాఖ ఇది వరకే ప్రకటించింది. ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్లు దాదాపు 1000 వరకు ఉన్నాయి. రైల్వే శాఖ ప్రతిపాదనకు కేంద్రం కనుక ఆమోద ముద్ర వేస్తే ఈ స్టేషన్లలోని ప్రయాణికుల జేబులకు చిల్లులు పడడం ఖాయం * నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలడంతో ముగ్గురు దుర్మరణం. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో సోమవారం రాత్రి జరిగిన ఘటన. బావామాన్ పురా ప్రాంతంలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం. ఈ ఘటనలో అక్కడికక్కడే మరణించిన ముగ్గురు వ్యక్తులు. కరోనా బారిన పడ్డ ఒడిశా డిప్యూటీ స్పీకర్ రజనీకాంత్ సింగ్‌తోపాటు 11 మంది ఎమ్మెల్యేలు. నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, పాత్రికేయులకు ప్రత్యేకంగా కరోనా పరీక్షలు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్, 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్టు నిర్ధారణ * ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి అధికంగా సాగుతున్న వరద నీటి ప్రవాహం. జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేస్తున్న అధికారులు. జలాశయం ఇన్ ఫ్లో 2,05,017 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 3,06,819 క్యూసెక్కులు. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. 883.90 అడుగులకు చేరిన ప్రస్తుతం నీటి మట్టం * తమ భూములకు సరైన నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు కృష్ణంరాజు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణలో తమ భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ దాఖలు. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు * దేశంలో సోమవారం నుండి ప్రారంభమైన వాయువ్య భారతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌, బికనీర్‌ల నుంచి ఈనెల 17నే ఉపసంహరణ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈసారి 11 రోజులు ఆలస్యం. ఏపీ నుంచి అక్టోబరు 15న రుతుపవనాలు నిష్క్రమిస్తాయని అంచనా. కాగా, దక్షిణ ఏపీలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. దీని ప్రభావంతో రాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం. 18 క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3,10,631 క్యూసెక్కులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 309.6546 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులకు చేరిక * మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో 2 గేట్ల నుంచి నీటి విడుదల చేస్తున్న అధికారులు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 645 అడుగులు(4.46టీఎంసీలు) కాగా 644 అడుగుల(4.20టీఎంసీలు)కు చేరిన ప్రస్తుత నీటి మట్టం. అలాగే ఇన్ ఫ్లో 4,505 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,978 క్యూసెక్కులుగా నమోదు * కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు లంచం కేసులో అరెస్టయిన ముగ్గురు సహనిందితులకు ఏసీపీ ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు. చేసింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శ్రీనాథ్‌యాదవ్‌, మధ్యవర్తి అంజిరెడ్డి, వీఆర్‌ఏ సాయిరాజ్‌కు బెయిల్‌

ఎస్పీ బాలు ఆరోగ్యంపై లేటెస్ట్ అప్ డేట్.. కేఏపాల్ ఏం చేశారంటే?

26-08-202026-08-2020 19:36:14 IST
Updated On 27-08-2020 07:06:45 ISTUpdated On 27-08-20202020-08-26T14:06:14.145Z26-08-2020 2020-08-26T14:03:03.874Z - 2020-08-27T01:36:45.197Z - 27-08-2020

ఎస్పీ బాలు ఆరోగ్యంపై లేటెస్ట్ అప్ డేట్.. కేఏపాల్ ఏం చేశారంటే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఎంజీఎం ఆస్పత్రి తాజా బులెటిన్ విడుదల చేశారు. ఎస్పీ బాలు ఆరోగ్యం నిలకడగా ఉంది, ఐసీయూలో వెంటిలేటర్‌పై ఎక్మో ద్వారా చికిత్స కొనసాగుతోందని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఎస్పీ బాలు చికిత్సకు స్పందిస్తున్నారు. మరోవైపు ఎస్పీ బాలు కోసం కేఏ పాల్ కూడా రంగంలోకి దిగారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆయన ప్రస్తుతం ప్రార్ధనలకు దూరంగా ఉంటున్నారు. కేవలం విదేశాల్లో జరిగే ప్రార్ధనా కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటున్నారు. తాజాగా ఆయన చాలా కాలం తర్వాత ఆయన ప్రార్ధన చేశారు. దాని వీడియోను సైతం తన ఫేస్‌ బుక్‌ పేజ్‌లో ఉంచారు.

ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. తీవ్ర అనారోగ్యంతో చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు, సినీ రంగ పెద్దలు ప్రార్ధనలు చేస్తున్నారు. దశాబ్దాలుగా తెలుగు, తమిళంతో పాటు మరెన్నో భాషల్లో తన గాత్రంతో సినీ అభిమానులను అలరించిన బాలసుబ్రహ్మణ్యం క్షేమంగా తిరిగి రావాలని అంతా కోరుకుంటున్నారు. ఇదే కోవలో కేఏ పాల్‌ కు కూడా ఎస్పీ బాలు కోసం ప్రార్ధన చేయాలని కొందరు కోరారు.

దీంతో వెంటనే స్పందించిన పాల్‌ ఎస్పీ బాలు కోలుకోవాలని ప్రత్యేకంగా ప్రార్ధించారు. కుల మతాలకు అతీతంగా అందరూ కళ్లు మూసుకుని తన ప్రార్ధన ఆలకించాలని, చివర్లో ఆమెన్‌ చెప్పాలని కూడా కోరారు. గతంలో తాను ప్రార్ధన ఆలకించి జీసస్‌ ఎందరో ప్రాణాలు కాపాడిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ కేఏ పాల్‌ చేసిన ప్రార్ధన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారింది. ఎలాంటి కల్మషం లేకుండా తొలిసారి ఎస్పీ బాలు వంటి గాయకుడి కోసం ప్రార్ధన చేయడం ఎంతో మందిని కదిలించింది.  దీంతో కేఏ పాల్‌పై రాజకీయాలకు అతీతంగా  ప్రశంసలు కురిపిస్తున్నారు. 

మరోవైపు బాలు ఆరోగ్యం నిలకడగా వుందని, సంగీతానికి ఆయన ప్రతిస్పందిస్తున్నారని ఎంజీఎం వైద్యులు చెప్పారు. ఆస్పత్రిలో అయ్యే ప్రతిరూపాయిని తమిళనాడు ప్రభుత్వమే భరిస్తుందని ఇటీవల ప్రకటించారు. 

Image

ఆచార్య కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో పురాతన దేవాలయం సెట్

ఆచార్య కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో పురాతన దేవాలయం సెట్

   21 minutes ago


రేపిస్టులను పబ్లిక్ లో కాల్చి చంపాల్సిందే..'కంగనారనౌత్'

రేపిస్టులను పబ్లిక్ లో కాల్చి చంపాల్సిందే..'కంగనారనౌత్'

   an hour ago


స్టన్నింగ్ లుక్ లో అక్షరగౌడ..బికినీ ట్రీట్ అదుర్స్

స్టన్నింగ్ లుక్ లో అక్షరగౌడ..బికినీ ట్రీట్ అదుర్స్

   an hour ago


ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్.. జక్నన్నా.. ఇది నిజమేనా..?

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్.. జక్నన్నా.. ఇది నిజమేనా..?

   2 hours ago


అక్కినేని హీరోల ప్లాన్ బాగుంది.. ఏంటో తెలుసా..?

అక్కినేని హీరోల ప్లాన్ బాగుంది.. ఏంటో తెలుసా..?

   2 hours ago


ఫిలింన‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంటర్ (FNCC) రీ- ఓపెనింగ్ ఎప్పుడు..?

ఫిలింన‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంటర్ (FNCC) రీ- ఓపెనింగ్ ఎప్పుడు..?

   2 hours ago


మరోసారి మెగాస్టార్ మంచి మనసు.. ఉచితంగా  ప్లాస్మా దానం..

మరోసారి మెగాస్టార్ మంచి మనసు.. ఉచితంగా ప్లాస్మా దానం..

   3 hours ago


మా నాన్నగారే లేనప్పుడు 'భారతరత్న' ఎందుకు?? ఎస్పీ బాలు కుమారుడు..

మా నాన్నగారే లేనప్పుడు 'భారతరత్న' ఎందుకు?? ఎస్పీ బాలు కుమారుడు..

   3 hours ago


కరోనా దెబ్బకి కూరగాయలు అమ్ముకుంటున్న 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ డైరెక్టర్..

కరోనా దెబ్బకి కూరగాయలు అమ్ముకుంటున్న 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ డైరెక్టర్..

   4 hours ago


అవతార్ 2,3 వచ్చేస్తున్నాయి..

అవతార్ 2,3 వచ్చేస్తున్నాయి..

   4 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle