newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

ఎన్టీయార్‌కు భారత రత్న ఇవ్వాలి.. డైరెక్టర్ వైవీఎస్ వినతి

18-01-202018-01-2020 13:17:23 IST
2020-01-18T07:47:23.650Z18-01-2020 2020-01-18T07:47:17.691Z - - 26-02-2020

ఎన్టీయార్‌కు భారత రత్న ఇవ్వాలి.. డైరెక్టర్ వైవీఎస్ వినతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇవాళ ప్రముఖ నటుడు, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీయార్ వర్థంతి. ఈసందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన్ని స్మరించుకుంటున్నారు. ఎన్టీయార్ వర్థంతిని పురస్కరించుకుని ఆయన అభిమాని, దర్శకుడు వైవీఎస్ చౌదరి మరోమారు భారతరత్న అవార్డుని తెరమీదకు తెచ్చారు. ఎన్టీఆర్‌ జీవితం ఎంతోమందిని ప్రభావితం చేసిందని దర్శకుడు వైవీఎస్ చౌదరి అన్నారు. ఎన్టీఆర్ 24వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద వైవీఎస్ చౌదరి నివాళులర్పించారు. ఈసందర్బంగా ఎన్టీయార్ ని గుర్తుచేశారు. 

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలో ఎన్టీయార్ కి కోట్లమంది అభిమానులు ఉన్నారన్నారు. ఆయన సినిమాల ద్వారా సందేశం ఇచ్చారని... అలాంటి మహానుభావుడికి  భారత రత్న అవార్డు ఇవ్వాలన్నారు. ఎన్టీఆర్‌కి భారత రత్న బిరుదు ఇచ్చి గౌరవం తేవాలన్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాలకు ఎన్టీఆర్‌ పేరు పెట్టాలని వైవీఎస్‌ చౌదరి కోరారు. 

ఎన్టీయార్ అంటే తనకు ఎంతో అభిమానమని వైవీఎస్ చౌదరి గతంలోనే ప్రకటించారు. ఎన్టీ రామారావు సినిమాలను చూస్తూ సినీరంగంపై వ్యామోహాన్ని పెంచుకున్నానని,  తన కీర్తి ఆ మహానుభావుడి చలవే అన్నారు. ఎన్టీఆర్‌ అభిమాని కావటం తన పూర్వజన్మ సుకృతమని అనేకమార్లు చెప్పుకొచ్చారు. ఏటా ఎన్టీయార్ జయంతి, వర్థంతికి ఆయన నివాళులర్పిస్తుంటారు. తాజాగా వైవీఎస్ చౌదరి లేవనెత్తిన అంశాలపై ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.  

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle