newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

ఇస్మార్ట్ శంకర్ భామకి బంపరాఫర్

13-02-202013-02-2020 17:41:59 IST
2020-02-13T12:11:59.359Z13-02-2020 2020-02-13T12:11:51.674Z - - 14-08-2020

ఇస్మార్ట్ శంకర్ భామకి బంపరాఫర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక్క సినిమా లైఫ్ ని మార్చేస్తుంది. నిజమే కొంతమంది హీరోయిన్లను చూస్తే ఈ మాట నిజమేనేమో అనిపిస్తుంది. ఇస్మార్ట్ శంకర్ భామ నిధి అగర్వాల్ దశ తిరిగిపోయింది. బంపరాఫర్ పట్టేసింది. మోడల్, నర్తకి అయిన నిధి అగర్వాల్ 2017 లో మున్నా మైఖేల్ చిత్రంలో ఆమె తొలిసారిగా స్క్రీన్ ముందుకొచ్చింది. 2018 లో చందూ మొండేటి దర్శకత్వం లో విడుదల అయిన సవ్యసాచి చిత్రం తో తెలుగులో కనిపించింది.

తర్వాత మిస్టర్ మజ్నులోనూ నటించింది. 2019లో తెలుగులో పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో డాక్టర్ సారా పాత్రలో కనిపించింది. ఈ సినిమా హిట్ కావడంతో వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ తాజాగా వకీల్ సాబ్ అంటూ పింక్ రీమేక్ లో షూటింగ్ లో పాల్గొంటూనే క్రిష్ సినిమాని చేస్తున్నాడు.

ఓఆసక్తికరమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని అంటున్నారు. మన దేశాన్ని మొఘలులు పాలించే కాలంలో రాబిన్ హుడ్ లాంటి ఓ దొంగ చేసిన తిరుగుబాటే ఈ సినిమా కథ అని అంటున్నారు. ఈ సినిమా కోసం హీరోయిన్ గా చాలామందిని ట్రై చేశారు. కియారా అద్వానీ, సోనాక్షిసిన్హా, పూజ హెగ్డే.. ఇలా చాలామందిని అడిగినా వారంతా కుదరదని చెప్పేశారట. అంటే పవన్ మూవీలో నటించడానికి తమకు కాల్షీట్లు అందుబాటులో లేవన్నారు.

దీంతో 'ఇస్మార్ట్' బ్యూటీ నిధి అగర్వాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారని తెలుస్తోంది. పవన్ లాంటి స్టార్ హీరో సినిమాలో నటించడమే భాగ్యమని భావించిన నిధి అగర్వాల్ రెమ్యూనరేషన్ కూడా తక్కువే అడిగిందట. ఇంకేంటి నిర్మాతలు నిధికి ఓటేశారు. కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకి 'విరూపాక్ష’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు ఫిలింనగర్లో వినిపిస్తోంది.  సూర్య మూవీస్ అధినేత ఎఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేయనున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle