newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

ఆస్పత్రిలో చేరిన సుద్దాల అశోక్ తేజ... బినెగిటివ్ రక్తం కోసం ఎదురుచూపులు

22-05-202022-05-2020 09:38:32 IST
Updated On 22-05-2020 10:03:34 ISTUpdated On 22-05-20202020-05-22T04:08:32.883Z22-05-2020 2020-05-22T04:08:30.498Z - 2020-05-22T04:33:34.418Z - 22-05-2020

ఆస్పత్రిలో చేరిన సుద్దాల అశోక్ తేజ...  బినెగిటివ్ రక్తం కోసం ఎదురుచూపులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సొంత ఊరు సుద్దాల‌ని త‌న ఇంటి పేరుగా మార్చుకున్న ప్రముఖ గేయ ర‌చ‌యిత సుద్దాల అశోక్ తేజ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. గ‌చ్చిబౌలిలోని ఏషియ‌న్ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జీలో చికిత్స పొందుతున్న ఆయ‌న‌కి వైద్యులు కాలేయ మార్పిడి చికిత్స చేయ‌నున్నారు.  ఆయ‌న బ్ల‌డ్ గ్రూప్ బి నెగెటివ్ కాగా, శ‌స్త్ర చికిత్స స‌మ‌యంలో రక్తం కావ‌ల‌సి ఉంటుంద‌ని , అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోమ‌ని స‌న్నిహితుల‌కి చెప్పారు డాక్టర్లు. లాక్ డౌన్ నేపథ్యంలో రక్తం కొరత విపరీతంగా ఉంది. సుద్దాల అశోక్ తేజ బ్లడ్ గ్రూప్ B నెగిటివ్ ఆసుపత్రిలో అందుబాటులో లేకపోవడంతో ఈ బ్లడ్ గ్రూప్ కోసం ఎదురుచూస్తున్నారు.

B నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న రక్త దాతలు వెంటనే గచ్చిబౌలిలోని ఆసియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రికి సమాచారం అందించవచ్చు. రక్తదాతలు 8985038016 నంబర్‌ని సంప్రదించాలని సుద్దాల అశోక్ తేజ మిత్రులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

సుద్దాల అశోక్ తేజ అందరికీ చిరపరిచితమే.  సినీ నటుడు ఉత్తేజ్‌కి సుద్దాల‌ మేనమామ కావడం వల్ల పరిశ్రమకు పరిచయం కావడం అంత కష్టం కాలేదు. సుద్దాల అశోక్ తేజ నమస్తే అన్న చిత్రం ద్వారా తెలుగు సినీ తెరకి పరిచయమయ్యారు. తనికెళ్ళ భరణి లాంటి వారి ప్రోత్సాహంతో సినిమా రంగంలో పాటల ప్రస్థానం ప్రారంభించాడు. 1200కి పైగా చిత్రాల్లో 2200 పై చిలుకు పాటలు రాశారు. 1960, మే16 న నల్గొండ జిల్లా, గుండాలమండలం, సుద్దాల గ్రామంలో పుట్టిన ఈయన  ఇంటిపేరు గుర్రం. ఆయన తండ్రి హనుమంతు ప్రముఖ ప్రజాకవి. తెలంగాణా విముక్తి పోరాటంలో పాల్గొన్నారు.  నైజాం రాజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు జరిపిన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించాడు. వీరి స్వంత ఊరు సుద్దాల కాబట్టి ఈయనను అందరూ సుద్దాల హనుమంతు అని పిలిచేవారు. ఆయన గుర్తుగా తన ఇంటి పేరు, తర్వాత తరాలకు కూడా సుద్దాలగా మార్చుకున్నాడు. తల్లి జానకమ్మ. అశోక్ తేజ తల్లిదండ్రులిద్దరూ స్వాతంత్ర్య సమరయోధులు. హనుమంతు 75 సంవత్సరాల వయసులో క్యాన్సర్ వ్యాధితో మరణించారు.

బాల్యం నుంచే అశోక్ తేజ పాటలు రాయడం నేర్చుకున్నాడు. సినీ పరిశ్రమకు రాక మునుపు అశోక్ తేజ మెట్‌పల్లిలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండేవారు. నమస్తే అన్న చిత్రం ద్వారా తెలుగు సినీ తెరకి పరిచయమయ్యారు. ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది మాత్రం దాసరి నారాయణరావుని కలవడం. కృష్ణవంశీ లాంటి దర్శకుల సినిమాల్లో మంచి మంచి పాటలు రాశారు. తొలుత తండ్రియైన సుద్దాల హనుమంతు నేపథ్యం వల్ల అన్ని విప్లవగీతాలే రాయాల్సి వచ్చింది. కృష్ణవంశీ లాంటి దర్శకుల ప్రోద్బలంతో తన పాటల్లో అన్ని రసాలు ఒలికించాడు. ఒసేయ్ రాములమ్మా, నిన్నే పెళ్ళాడతాసినిమాలో పాటలతో మంచి పేరు తెచ్చుకున్నారు. నేను సైతం (ఠాగూర్), ఒకటే జననం.. ఒకటే మరణం (భద్రాచలం), ఇనుములో ఒక హృదయం మొలిచెనే (రోబో) వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే (ఫిదా) వంటి సూపర్ హిట్స్ సాంగ్స్ రాశారాయన. ప్రస్తుతం సుద్దాల ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో మూడు పాటలు రాశారు. ఆయన త్వరగా కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle