facebooktwitteryoutubeinstagram
newssting
BITING NEWS :
* తొలివిడత ఎన్నికలకు నోటిఫికేషన్ .. నామినేషన్లకు శ్రీకారం ..నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఈ నెల 25వ తేదీ* రక్షణమంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూత.. రాష్ట్రపతి సహా పలువురి నివాళి * ఒకేసారి 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ *మల్కాజ్ గిరి లోక్ సభ జనసేన అభ్యర్థిగా బి.మహేందర్ రెడ్డి *సెన్సార్ బోర్డు పై వర్మ సీరియస్... కోర్టుకెళతానన్న ఆర్జీవీ*కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన వినోద్ కుమార్

ఆలియా ఆనందహేళ

14-03-201914-03-2019 15:16:00 IST
Updated On 14-03-2019 15:18:01 ISTUpdated On 14-03-20192019-03-14T09:46:00.688Z14-03-2019 2019-03-14T09:45:57.108Z - 2019-03-14T09:48:01.376Z - 14-03-2019

ఆలియా ఆనందహేళ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక భారీ చిత్రంలో అవకాశం హీరోయిన్ల కెరీర్‌నే మార్చేయగలదు. బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌ RRR మూవీ ఆఫర్‌తో తెగ మురిసిపోతోంది. రాజమౌళి తాజా చిత్రం  ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ చిత్రంలో రామ్‌చరణ్‌కు జోడీగా నటించబోతున్న ఆలియా ఇవాళ తనకు పండుగరోజు అంటోంది. ..! ఈ సినిమాతోనే ఆలియా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుండడం కాకతాళీయం.

Image may contain: 2 people, meme and text

తనకు సినిమాలో అవకాశం ఇచ్చినందుకు ఆలియా ట్విటర్‌ వేదికగా రాజమౌళికి ధన్యవాదాలు తెలిపారు. ‘ఈరోజు నేను చాలా గొప్పగా ఫీలవుతున్నాను. అద్భుతమైన నటులతో, మిగతా బృందంతో కలిసి అందమైన ప్రయాణాన్ని ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తానా? అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ రాజమౌళి సర్‌..’ అని పేర్కొన్నారు ఆలియా.

రాజమౌళి మూవీలో ఆలియా భట్‌కు అవకాశం వచ్చిందని, ఆమె తిరస్కరించిందని అనేక పుకార్లు షికార్లు చేశాయి. ఈరోజు రాజమౌళి ప్రెస్‌మీట్‌లో ఆలియా ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో నటిస్తోందని చెప్పడంలో అభిమానుల్లో ఉన్న సందేహాలన్నీ ఎగిరిపోయాయి. ఆలియా ట్వీట్‌కు రాజమౌళి సమాధానమిస్తూ.. ‘తోటి నటులతో పోటీపడటానికి అంచనాలు పెంచేస్తూ ఎంతో కష్టపడతావని విన్నాను. ఇప్పుడు నా సినిమాలో నువ్వు అదే నిబద్ధతను చూపించబోతున్నందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’ అని పేర్కొన్నారు. మొత్తం మీద ఆలియా ట్వీట్, రాజమౌళి రిట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle