newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

ఆర్జీవీ....పవర్ స్టార్ మూవీ ఎలా వుందంటే.. ?

25-07-202025-07-2020 14:12:19 IST
Updated On 25-07-2020 14:19:28 ISTUpdated On 25-07-20202020-07-25T08:42:19.775Z25-07-2020 2020-07-25T08:42:12.657Z - 2020-07-25T08:49:28.567Z - 25-07-2020

ఆర్జీవీ....పవర్ స్టార్ మూవీ ఎలా వుందంటే.. ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ లాక్ డౌన్ టైంలోనూ ఏదో ఒకటి చేస్తూ వివాదాల వర్మ సంచలనం కలిగించాడు. తాజాగా పవర్ స్టార్ ఎన్నికల తరువాతి కథ అంటూ ఓ సినిమా తెరకెక్కించి జనం మీదకి వదిలాడు వర్మ. పొగుడుతున్నట్టు కనబడి పవన్ కళ్యాణ్ ని వెక్కిరించడానికి తీసిన ట్రైలర్ లెంగ్త్ సినిమా పవర్ స్టార్.  ఇప్పటికే క్లైమాక్స్, నగ్నం వంటి చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన వర్మ.. తాజాగా పవర్ స్టార్ చిత్రాన్ని విడుదల చేశాడు. పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్‌తో ప్రకంపనలు సృష్టించి.. కావాల్సిన హైప్‌ను తీసుకొచ్చాడు.ఇవాళ 11 గంటలకు తన ఆర్జీవీ వరల్డ్ డిజిటల్ ప్లాట్ ఫాంపై విడుదలచేసి పారేశాడు. 

ట్రయలర్ కంటే కాస్త ఎక్కువ నిడివి అంటే 37 నిమిషాలు వున్న సినిమా ఇది. చివరి ఐదు నిమిషాలు బోరుకొట్టే ఆర్జీవి మోనోలాగ్ విసుగెత్తించడం ఖాయం. పవన్ అభిమానుల కోపం నషాళానికి అంటించే వర్మ మార్కు పొలిటికల్ మసాలా మూవీ. ఇది. దీన్ని సినిమా అనాలా లేక షార్ట్ ఫిలిం అనాలో తెలీడం లేదని డబ్బులు పెట్టి చూసి వచ్చిన ప్రేక్షకులు అంటున్న మాట ఇది. 

పవన్ కళ్యాణ్ అనే ఓ సినిమా స్టార్ మన సేన (జనసేన కు బదులు) పార్టీని స్థాపించి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతాడు. తను పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడం, పార్టీకి ఒక్క సీటు రావడంతో ఫలితాలు వచ్చిన రాత్రి కుంగిపోతాడు. ఇది నిజంగా జరిగిన కథే. ఇక ప్రవన్ కళ్యాణ్‌ను ఆయన పెద్దన్న, చిన్నన్న, ఆప్త మిత్రుడు టీఎస్, భక్తుడు గుండ్ల రమేష్, బాబు వచ్చి మాట్లాడుతారు, ఓదారుస్తారు. కాసేపు తిడతారు. చివరగా తన తదుపరి కార్యాచరణ ఏంటో పాలుపోకుండా ఉన్న ప్రవన్ కళ్యాణ్‌కు ఓ వీరాభిమాని వచ్చి సలహాలు, సూచనలు, హితబోధ చేస్తాడు. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరని తెలియాలంటే పవర్ స్టార్ సినిమా చూడాలంతే. 

పవర్ స్టార్ సినిమా పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మిగతావన్నీ అతిథి పాత్రలే. అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటాయి. వర్మ చెప్పినట్టే ఈపాత్రలు సరదాగా వచ్చినవి కావు. పవన్ కళ్యాణ్ అభిమానులకు కోపం తెప్పించడానికి వచ్చినట్టున్నాయి. సినిమాలో చూపించే పాత్రలు నిజ జీవితంలో కొందరిని పోలి ఉంటుంది. మాట్లాడే విధానం, కనిపించే పద్దతిని బట్టి మనం కొందరి పోలికలు కనిపిస్తాయి.

ఈ క్రమంలో టీఎస్, గుండ్ల రమేష్, కత్తి, ఆయన అన్నయ్య, బాబు, రష్యన్ భార్య వస్తారు. చివరగా వీరాభిమాని వచ్చి కనువిప్పు కలిగిస్తాడు. ఆయా పాత్రల్లో అందరూ చక్కగా నటించారు. పవన్ కళ్యాణ్ మూడోపెళ్ళి చేసుకున్నది రష్యా అమ్మాయినే కదా. ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోవలసింది ఏమీ లేదు. ఉన్న ఒక్క గడ్డి తింటావా సాంగ్ సెటైరికల్‌గా బాగానే ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకె. కెమెరామెన్‌ ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. అంతా ఒకే చోట, ఒకే ఇంట్లో తీసిపాడేశాడు వర్మ. ఈసినిమాకు నిడివి మాత్రమే. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే కథ, కథనం. తన ఊహకు ఏది వస్తే అది తీసే వర్మ.. పవర్ స్టార్‌ను తీయడంలో ఆశ్చర్యమే లేదు. వర్మ తన ఊహలు, కల్పనలను బాగానే వాడుకుంటాడనడానికి ఈ మూవీయే ఉదాహరణ. 

ఈ చిత్రానికి దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ, సంగీతం : డీఎస్ఆర్, సినిమాటోగ్రఫీ : జోషి, నిర్మాణ సంస్థ : ఆర్జీవీ వరల్డ్ థియేటర్. ఈ సినిమాకు ఇచ్చే రేటింగ్ 1/5 మాత్రమే. పవన్ అభిమానులైతే ఇచ్చే రేటింగ్ అయితే 0/5. అద్గదీ సంగతి. 

మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

   2 hours ago


అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

   8 hours ago


దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

   9 hours ago


‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

   02-08-2020


నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

   02-08-2020


 మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ  గిల్లుతున్న వర్మ

మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ గిల్లుతున్న వర్మ

   02-08-2020


మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

   02-08-2020


దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృవియోగం

దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృవియోగం

   01-08-2020


నాగార్జునే హోస్ట్.... బిగ్ బాస్ 4 షో అప్ డేట్ ఏంటంటే?

నాగార్జునే హోస్ట్.... బిగ్ బాస్ 4 షో అప్ డేట్ ఏంటంటే?

   01-08-2020


టాలీవుడ్లో మరో పెళ్ళిసందడి... ఆ హీరోయిన్‌తో ఆది పెళ్లంట..!

టాలీవుడ్లో మరో పెళ్ళిసందడి... ఆ హీరోయిన్‌తో ఆది పెళ్లంట..!

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle