newssting
BITING NEWS :
*తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది... లాక్ డౌన్ కొనసాగించాలని మోడీకి చెబుతా*-కేసీయార్ *ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 303 *ఎంపీల వేతనాల్లో 30 శాతం కొోత *న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మొత్తంగా 364కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

ఆర్ఆర్ఆర్ మూవీపై అదిరిపోయే అప్ డేట్

14-02-202014-02-2020 10:02:13 IST
Updated On 14-02-2020 13:40:31 ISTUpdated On 14-02-20202020-02-14T04:32:13.023Z14-02-2020 2020-02-14T04:31:46.962Z - 2020-02-14T08:10:31.625Z - 14-02-2020

ఆర్ఆర్ఆర్ మూవీపై అదిరిపోయే అప్ డేట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బాహుబలి సిరీస్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఆర్ఆర్ఆర్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తొలుత జూలైలో విడుదల చేయాలని భావించినా వివిధ కారణాల వల్ల ఈ మూవీని 2021 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆర్ఆర్ఆర్ బిజినెస్ అదిరిపోయిందంటున్నారు.

ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ బిజినెస్ లో బాహుబలి-2ని మించిపోయిందని అంటున్నారు. ఈ విషయంలో బాహుబలి-2కి, ఆర్ఆర్ఆర్ కు మధ్య భారీ గ్యాప్ ఉందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. అప్పట్లో బాహుబలి-2 వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 350 కోట్లకు అమ్ముడయ్యాయి.

ఈ  సినిమా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 542 కోట్లకు జరిగింది. ఇండియన్ ఫిలింకి ఇంత బిజినెస్ జరగడం ఇదే మొదటి సారి అంటున్నారు. ఎన్టీఆర్, రాంచరణ్, రాజమౌళి క్రేజే ఇందుకు కారణంగా చెబుతున్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కొమరం భీమ్, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రల స్ఫూర్తితో జక్కన్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఎంత బిజినెస్ జరిగిందంటే.. ఏపీ మరియు టీఎస్: రూ. 232 కోట్లు, కర్ణాటక: 50 కోట్లు, తమిళనాడు: 42 కోట్లు, కేరళ: 28 కోట్లు, హిందీ: 85 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా: 16 కోట్లు, ఓవర్సీస్: 75 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్: 14 కోట్లు, వరల్డ్ వైడ్ బిజినెస్: రూ. 542 కోట్లు. థియేట్రికల్ హక్కుల రూపంలో రూ 542 కోట్లు వసూల్ చేసిన ఈ సినిమాకు నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలో 1000 కోట్లకు పైగా వస్తాయని అంటున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle