newssting
BITING NEWS :
*తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది... లాక్ డౌన్ కొనసాగించాలని మోడీకి చెబుతా*-కేసీయార్ *ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 303 *ఎంపీల వేతనాల్లో 30 శాతం కొోత *న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మొత్తంగా 364కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

ఆర్ఆర్ఆర్ ఆలస్యంపై ఆ డైరెక్టర్ అసహనం?

13-02-202013-02-2020 09:26:43 IST
Updated On 13-02-2020 16:13:38 ISTUpdated On 13-02-20202020-02-13T03:56:43.821Z13-02-2020 2020-02-13T03:56:40.135Z - 2020-02-13T10:43:38.775Z - 13-02-2020

ఆర్ఆర్ఆర్ ఆలస్యంపై ఆ డైరెక్టర్ అసహనం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక సినిమా పూర్తయ్యేవరకూ మరో సినిమాకు కాల్షీట్లు ఇవ్వరు హీరో, హీరోయిన్లు. అందులోనూ ఏళ్ళ తరబడి చిత్రాలు చెక్కే జక్కన్న లాంటి డైరెక్టర్ల సినిమాల్లో నటించే వారికైతే ఇది కత్తిమీద సామే. తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ గురించే చర్చ జరుగుతోంది. ఈ సినిమా మరింత ఆలస్యం కాబోతోంది. ఈఏడాది విడుదల కావల్సిన మూవీ వచ్చే ఏడాది జనవరికి విడుదల అవుతుందని భావిస్తున్నారు. అయితే అది కూడా డౌటే. ఈ ఆలస్యమే ఓ డైరెక్టర్ కి కోపం తెప్పిస్తోందనే ప్రచారం జరుగుతోంది.

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు కొరటాలకు తలనొప్పిగా మారుతుందని తెలుస్తోంది. ఈ మూవీ ఆలస్యం కావడం వలన కొరటాల, చిరంజీవి మూవీ విడుదల మరింత ఆలస్యం అవుతుందని అంటున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు అగ్రిమెంట్లు చేసుకున్నారు. దీని ప్రకారం ఆర్ఆర్ఆర్ విడుదలయ్యే వరకు మరో సినిమాలో వీరు కనిపించకూడదని షరతులు వున్నాయి. చిరంజీవితో కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రంలో రాంచరణ్ నటిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీ ఆలస్యం కారణంగా చెర్నీ అందుబాటులో వుండడం లేదు. మూవీలో ఫ్లాష్‌బ్యాగ్ ఎపిసోడ్‌లో చిరంజీవి కారెక్టర్‌లో చెర్రీ కనిపించబోతున్నాడు.

ఈ నేపథ్యంలో ఈ మూవీని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు అనుకున్నారట. అయితే ఆర్ఆర్ఆర్ అగ్రిమెంట్ నేపథ్యంలో ఈ మూవీని వచ్చే ఏడాది వేసవి వరకు ఆపాలనుకుంటున్నారట చిరంజీవి. దీంతో కొరటాల ఇబ్బంది పడుతున్నాడు. 2018లోనే ఈ మూవీకి సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయి. కానీ ఆర్ఆర్ఆర్ కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతుండడంతో కొరటాల అసహనంతో వున్నాడు. 

కొరటాల శివ తాను అనుకున్న చిత్రం త్వరగా పూర్తికావాలని భావిస్తాడు. అలాంటిది తన ప్రమేయం లేకుండా రాజమౌళి కారణంగా తన మూవీ ఆలస్యం కావడంతో తల పట్టుకుంటున్నాడు కొరటాల. ఆచార్య అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీలో చిరు సరసన త్రిష నటిస్తుంది. మ్యాట్నీ ఎంటర్‌టైనర్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle