newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

"అల వైకుంఠపురములో" సినిమా రివ్యూ

12-01-202012-01-2020 14:38:44 IST
2020-01-12T09:08:44.452Z12-01-2020 2020-01-12T09:07:07.136Z - - 13-08-2020

"అల వైకుంఠపురములో" సినిమా రివ్యూ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన సినిమా అల వైకుంఠపురములో. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత హ్యాట్రిక్ సినిమాగా ఇది తెరకెక్కింది. అంతేకాదు, రిలీజ్ కి ముందే సాంగ్స్ ఒక ఊపు ఊపడంతో సినిమాకి బాగా హైప్ పెరిగింది. సంక్రాంతి రేసులో మరి  ఈసినిమా హిట్ కొట్టిందా లేదా అనేది తెలియాలి అంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ ఏంటంటే... 

రామచంద్ర (జయరాం) మల్టీ మిలియనీర్. అల వైకుంఠపురములో యజమాని. ఆయన ఆఫీస్‌లో ఉద్యోగిగా పనిచేస్తుంటాడు వాల్మీకి (మురళీశర్మ). వీరి ఇద్దరి భార్యలకీ ఒకేసారి ఆస్పత్రిలో పిల్లలు పుడతారు. రామచంద్ర బిడ్డ పురిటిలోనే చనిపోయాడని భావించి వాల్మీకి తనకు పుట్టిన కొడుకును తన యజమానికి ఇచ్చేస్తాడు. ఒక నర్సు సాయంతో ఈ బిడ్డలను మార్చేస్తారు. బిడ్డ చనిపోయాడనుకుని అనుకున్న సమయంలో ఆ బిడ్డ బతుకుతాడు.ఆ బిడ్డిని పెంచి పెద్దవాడ్ని చేస్తాడు. అతడే బంటు (అల్లు అర్జున్). ఇక రామచంద్ర దగ్గర పెరిగిన వాల్మీకి కొడుకు రాజ్ మనోహర్ (సుశాంత్) అవుతాడు. మరి ఈ నిజం వారికి ఎలా తెలిసింది..? అల్లు అర్జున్ తన తల్లిదండ్రులకోసం ఏం చేశాడు అనేది తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ 

 బన్నీ కామెడీ టైమింగ్ సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి. కాస్త గ్యాప్ తీస్కున్నాడనే కానీ టైమింగ్ లో మాత్రం గ్యాప్ లేదు. ఇక సినిమాలో సాంగ్స్ అయితే అదిరిపోయాయి. వినడానికి , చూడటానికి కూడా సూపర్బ్. బన్నీ బాడీలాంగ్వేజ్, పూజాహెగ్దే, నివేథా అందాలు సినిమాకి ప్లస్ పాయింట్. సెకండ్ హాఫ్ లో వచ్చే కాన్ఫిరెన్స్ సీన్ ప్రేక్షకులని కట్టిపారేస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ సినిమాని నిలబెట్టింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా వర్క్, త్రివిక్రమ్ డైలాగ్స్, ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి ఎస్సెట్.

 మైనస్ పాయింట్స్ 

 ఫస్ట్ హాఫ్ లో మరిన్ని బలమైన సన్నివేశాలు రాసుకుని ఉండాల్సింది. సముద్రఖని విలనిజం బాగున్నా కూడా ఆ సీన్స్ ని రక్తికట్టించలేకపోయాయి. ఇక క్లైమాక్స్ ముందు సీన్స్, సెకండా హాఫ్ సీన్స్ కాస్త ల్యాగ్ అనిపిస్తాయి. ఇక ఇలాంటి కథలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి కదా అని కూడా అనిపిస్తుంది. కార్పొరేట్ సీన్స్ చూస్తుంటే అజ్ఞాతవాసి సినిమా గుర్తుకు వస్తుంది. అంతేకాదు, సీనియర్ ఎన్టీఆర్ ఇంటిగుట్టు సినిమా ఛాయలు మనకి కనిపిస్తాయి. చాలా చోట్ల అత్తారింటికి దారేది సన్నివేశాలు కూడా మనకు గుర్తుకు వస్తుంటాయి. 

 ఓవరాల్ గా చెప్పాలంటే సంక్రాంతికి ఈ సినిమా మనల్నీ ఎంటర్టైన్ చేస్తోంది. 

 నటీనటులు:అల్లు అర్జున్, పూజా హెగ్డే, జయరాం, టబు, సుశాంత్ తదితరులు    

 సంగీతం: తమన్                            

కెమెరా: పి.ఎస్.వినోద్                                                                                          

దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్                                    

నిర్మాత: అల్లు అరవింద్ - ఎస్.రాధాకృష్ణ                                              

విడుదల తేదీ: 12/01/2019  

రన్ టైమ్: 165 నిమిషాలు   

రేటింగ్ : 2.75/5


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle