newssting
BITING NEWS :
*ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు, 519 కరోనా మరణాలు నమోదు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123 *కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్.. ఫిర్యాదుదారుపై హైకోర్టు ఆగ్రహం *తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్న అధికారులు *ఢిల్లీ: కేంద్రం ఆదేశాలతో ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. లోధీ రోడ్ లో నివాసముంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. వ్యక్తిగత సామాన్లను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలింపు *ఇవాళ తెలంగాణలో 1278 పాజిటివ్ కేసులు నమోదు...8 మంది మృతి..ఇప్పటి వరకు 339 మంది మృతి..హైదరాబాద్ లో 762 పాజిటివ్ కేసులు *బెజవాడలో మరోమారు డ్రగ్స్ కలకలం. డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్*ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో దూకుడు పెంచిన ఏసీబీ.మాజీ మంత్రి పితాని పీఎస్ మురళి అరెస్ట్.మురళీని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ.పితాని కొడుకు సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ*కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన NIA..నలుగురిపై NIA కేసు నమోదు

అల్లరి నరేష్‌కి ఏమైంది? షాకింగ్ పోస్టర్‌తో సెన్సేషన్

28-06-202028-06-2020 11:21:45 IST
2020-06-28T05:51:45.997Z28-06-2020 2020-06-28T05:50:07.992Z - - 11-07-2020

అల్లరి నరేష్‌కి ఏమైంది? షాకింగ్ పోస్టర్‌తో సెన్సేషన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కామెడీకి, మినిమం గ్యారంటీకి కేరాఫ్ అడ్రస్ అల్లరి నరేష్. ఏ సినిమాల్లో నటించినా ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించడం, మంచి కలెక్షన్లు రాబట్టడం నరేష్ కి వెన్నతో పెట్టిన విద్య. అగ్రశ్రేణి దర్శకుడు ఇవివి తనయుడిగా తెరంగేట్రం చేసిన అల్లరి నరేష్ విభిన్నమయిన చిత్రాల్లో నటించి అందరినీ మెప్పిస్తుంటాడు. ఈమధ్యే సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ మహర్షిలోనూ నటించాడు. ఈ సినిమాలో నటనకు మంచి పేరు వచ్చింది.

కేవలం కామెడీ రోల్స్‌లోనే కాకుంగా విల‌క్ష‌ణ పాత్ర‌లు పోషిస్తున్న న‌రేష్ తాజాగా నాంది అనే చిత్రంలో విల‌క్ష‌ణ పాత్ర పోషిస్తున్నాడు. న‌రేష్ కెరియ‌ర్‌లో 57వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో అల్లరి నరేష్ పోలీస్ స్టేషన్‌లో నగ్నంగా కింద కూర్చుని ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది. అసలేం జరిగింది. ఏంటీ పోస్టర్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 

జూన్ 30న అల్ల‌రి న‌రేష్‌ బర్త్ డే కావడంతో ‘నాంది’ ఎఫ్ఐఆర్ (ఫ‌స్ట్ ఇంపాక్ట్ రివీల్‌) పేరుతో గ్లింప్స్‌ వీడియోను విడుదల చేసింది యూనిట్.  ఈ చిత్రంతో హ‌రీష్ శంక‌ర్ ద‌గ్గ‌ర కో-డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తున్న ఈచిత్రానికి అబ్బూరి ర‌వి, చోటా కె. ప్రసాద్‌, శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌, బ్రహ్మ క‌డ‌లి వంటి ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణులు ప‌నిచేస్తున్నారు. వ‌ర‌లక్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, హ‌రీష్ ఉత్తమ‌న్‌, ప్రియ‌ద‌ర్శి, ప్రవీణ్ కీల‌క పాత్రలు పోషించారు.వినూత్న క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. లాక్ డౌన్ వేళ త్వరగా ఈ మూవీని పూర్తిచేయాలని భావిస్తున్నారు. నరేష్ లుక్ గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle