newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

'అర్జున్ సురవరం'..మూడు రోజుల కలెక్షన్స్

03-12-201903-12-2019 08:47:30 IST
2019-12-03T03:17:30.011Z03-12-2019 2019-12-03T02:59:16.015Z - - 06-12-2019

'అర్జున్ సురవరం'..మూడు రోజుల కలెక్షన్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తమిళ సూపర్ హిట్ మూవీ 'కనితన్' రీమేక్ గా తెలుగులో వచ్చిన చిత్రం 'అర్జున్ సురవరం'. ఎప్పుడు విడుదలువుతుందో, అసలు విడుదలవుతుందో లేదో అనే క్లారిటీ దర్శకనిర్మాతలకు, హీరోకు కూడా లేని ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు నవంబర్ 29న విడుదలైంది.

నిఖిల్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు సంతోష్ టీఎన్ తెలుగులో కూడా డైరెక్ట్ చేశాడు. ఏ మాత్రం అంచనాలు లేని ఈ సినిమాకు ట్రైలర్ తో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి రావడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ గా నిలిచింది.

ఈ సినిమాకు 7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి రోజు మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, వసూళ్ల పరంగా ఈ సినిమా బెస్ట్ అనిపించుకుంది. ఈ సినిమా మూడు రోజుల్లో 3.90 కోట్లు వసూల్ చేసి సగం బ్రేక్-ఈవెన్ అయింది. 

నిఖిల్ గత చిత్రాలు 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమా కంటే మొదటి మూడు రోజుల్లో తక్కువ వసూల్ చేసినా 'అర్జున్ సురవరం' అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమా మూడు రోజుల్లో 4.11 కోట్లు వసూల్ చేసింది. నిఖిల్ కెరీర్ లో హైయెస్ట్ షేర్ వసూల్ చేసిన చిత్రంగా ఆ సినిమా నిలిచింది. ఆ తరువాత కేశవ మూడు రోజుల్లో (4.02) కోట్ల షేర్ వసూల్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే… వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 7 కోట్ల 55 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 3.10 కోట్లు వసూల్ చేయాలి. 

ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్స్ 

నైజాం: 1.36 కోట్లు 

సీడెడ్: 0.65 కోట్లు 

వైజాగ్: 0. 58 కోట్లు 

గుంటూరు: 0.36 కోట్లు 

ఈస్ట్: 0.28 కోట్లు 

వెస్ట్: 0.20 కోట్లు 

కృష్ణ: 0.35 కోట్లు 

నెల్లూరు: 0.12 కోట్లు 

ఏపీ & టీఎస్: 3.90 కోట్లు 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle