newssting
BITING NEWS :
*దిశ కేసులో నలుగురు నిందితులను షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు*దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ *దిశ ఘటన హెచ్చరిస్తోంది - పవన్ కళ్యాణ్ * నర పీడితులకు సరైన శిక్ష పడింది - మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ *దేశంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది, మీరు నిందితులను చంపకూడదు- ఎంపీ మేనకాగాంధీ * దిశకు తగిన న్యాయం జరిగింది - అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, నాని, పూరీజగన్నాధ్ * రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు *దిశ ఘటన తర్వాత దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది - కేజ్రీవాల్*కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్*రేపిస్టులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. రేపిస్టులపై దయ అవసరంలేదు.. నిందితులు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశమే ఉండకూడదన్న రాష్ట్రపతి *నిందితుల హత్యకేసుపై దిశ తల్లిదండ్రుల స్పందన.. మా బిడ్డకు తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్య

‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ చించేసింది

14-05-201914-05-2019 16:50:01 IST
Updated On 14-05-2019 16:50:23 ISTUpdated On 14-05-20192019-05-14T11:20:01.193Z14-05-2019 2019-05-14T11:19:58.233Z - 2019-05-14T11:20:23.493Z - 14-05-2019

‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ చించేసింది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
షాలినీ పాండే.. ఇలా చెబితే ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టడం కష్టం. షాలినీ పాండే అనే కంటే అర్జున్ రెడ్డి భామ అంటే అందరికీ చిరపరిచితం. అర్జున్ రెడ్డిలో ప్రీతీ పాత్రలో విజయ్ దేవరకొండతో కలిసి లిప్ లాక్స్ తో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది. అర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన షాలిని పాండే ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి. ఈ చిత్రంలో షాలిని న‌ట‌న‌కి ఇంప్రెస్ అయిన నిర్మాత‌లు ఆమెకు తమ తదుపరి చిత్రాల్లో అవకాశం కల్పించారు. ఇందులో భాగంగానే మ‌హాన‌టి చిత్రంలో షాలిని పాండే జ‌మునగా న‌టించి అందరినీ మెప్పించింది. 

ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు మూవీలో షాలినీ షాహుకార్ జానకి పాత్రలో నటించింది. ఈ పాత్రకు కూడా విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. అనంతరం నందమూరి కల్యాణ్ రాం 118 మూవీలో మేఘగా నటించింది. ప్రస్తుతం సైలెన్స్ మూవీలో నటించబోతోంది. అలాగే అర్జున్ రెడ్డి క్రేజ్‌తో షాలిని పాండే ప‌లు షాప్ ఓపెనింగ్స్‌కి కూడా వెళ్ళి వస్తోంది. షాలినీకి ప్లస్ ఆమె అందమే అంటున్నారు. ఏ డ్రెస్ వేసినా షాలినీ మైండ్ బ్లోయింగ్ అనేలా కనిపిస్తుంది. 

చిట్టి పొట్టి డ్రెస్‌లతో కాకుండా తాజాగా ఆమె హాఫ్ శారీలో కనిపించి మెస్మరైజ్ చేసింది. ఇన్ స్టా గ్రాంలో షాలినీ పాండే పెట్టిన పిక్చర్స్ వైరల్ అవుతున్నాయి. హాఫ్ శారీలో షాలినీ చాలా సన్నగా, అందంగా కనిపిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి. ఆరెంజ్ లెహంగా, రెడ్ దుపట్టాతో కాక రేపుతోంది. ఈ ఫోటో షూట్ ఆమె అందాన్ని మరింత ద్విగుణీకృ‌తం చేసిందంటున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle